Jump to content

దుర్గమ్మ వెండి సింహం ప్రతిమలు ఎక్కడ?


ParmQ

Recommended Posts

దుర్గమ్మ వెండి సింహం ప్రతిమలు ఎక్కడ?

160920durga-a.jpg

విజయవాడ: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల్లో రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా దుర్గమ్మ వెండి రథం సింహం ప్రతిమలు మాయమైన ఘటన వెలుగు చూసింది. ఆలయ సిబ్బంది మాత్రం అధికారికంగా దీనిని ధ్రువీకరించడం లేదు.

160920durga-b.jpg

ఈవో ఏమంటున్నారంటే?
అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులతో 13న పశ్చిమ ఏసీపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. అప్పుడే సింహాల ప్రతిమలు కనపడలేదన్న విషయాన్ని గుర్తించారని సమాచారం. గత ఏడాది ఉగాది రోజున స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఈ వెండి రథంపై ఊరేగించారు. ఈ ఏడాది కొవిడ్‌ దృష్ట్యా దేవస్థానం ఊరేగింపును రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ రథానికి ముసుగు వేసి ఉంచారు. ఇటీవలి కాలం వరకూ తీయలేదు. దీనిపై దుర్గగుడి ఈవో సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... ‘గత 18 నెలలుగా వెండి రథం మల్లికార్జున మహామండపంలో ఉంది. దానికి ఎన్ని సింహాలు ఉన్నాయో? వాటిని మరమ్మతులకు ఇచ్చారా? లాకరులో ఉన్నాయా? అన్నది పరిశీలన తర్వాతే స్పష్టమవుతుంది. దేవస్థానంలో ఉన్న వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు బీమా సౌకర్యం ఉంది. పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఫిర్యాదు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తాం’ అని స్పష్టం చేశారు.

ఫొటోలు విడుదల చేసిన బుద్దా వెంకన్న
విజయవాడ కనకదుర్గమ్మ వెండిరథానికి ఉండే నాలుగు సింహాల్లో మూడు ప్రతిమలు చోరీకి గురయ్యాయని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అధికారులు ఎవరిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం జగన్‌ అండ చూసుకుని అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు.

Link to comment
Share on other sites

18 minutes ago, Pappu_Packitmaar said:

Dobbesindi mana yellow batch ae anta kada

repo mapo FIR book sestaru emo, munde elli oka stay order techukunte pola ?

TDP vallu dhobbesthe valle photos endhuku release chesthu ra burra thakkuva vedhava?

 

Link to comment
Share on other sites

Inkekkada untai bhayya....asalkey amma raajyam la Kadapa tedlu kadha....vaalu vasthey gudi ni gudi loni ammari vigrahalani kooda dobbesthaaru thelsindhey ga...asalkey highlyy respected donga gaallu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...