r2d2 Posted September 23, 2020 Report Share Posted September 23, 2020 కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలో ఇటీవల భాజపా ఎంపీ అశోక్ గస్తీ కరోనాతో మృతిచెందగా.. తాజాగా బెళగావి లోక్‌సభ సభ్యుడు సురేశ్ అంగడి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేశ్ అంగడి కావడం గమనార్హం. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఆయన ఎంపీగా గెలుపొందారు. నేపథ్యం ఇదీ.. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని కేకే కొప్ప గ్రామంలో చెనబసప్ప అంగడి, సోమవ్వ అంగడి దంపతులకు 1955 జూన్ 1న సురేశ్ జన్మించారు. ఆయనకు భార్య మంగల్ సురేశ్ అంగడి, కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు. సురేశ్ అంగడి 1996-99 మధ్య కాలంలో జిల్లా భాజపా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2000-2004 మధ్య బెళగావి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కొనసాగారు. 2001 నుంచి 2004 వరకు భాజపా బెళగావి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014లోనూ వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన పలు పార్లమెంట్ కమిటీల్లో సభ్యుడిగా కొనసాగారు. 2019లో నాలుగోసారి భాజపా నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted September 23, 2020 Report Share Posted September 23, 2020 Karnataka nunchi two parliamentarians chanipoyaaru in last week Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.