Ryzen_renoir Posted September 24, 2020 Report Share Posted September 24, 2020 విజయవాడ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్‌సీ) ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ నుంచి విశాఖప ట్నం తరలించటానికి అధికారులు ఆగమేఘాల మీద చర్యలు చేపట్టారు. బందరు రోడ్డు వెంబడి ఫార్చ్యూన్ మురళీ హోటల్ సమీపాన ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ కార్యాల యం ఉంది. కార్యాలయంలోని ఫర్నిచర్, ఫైల్స్, ఇతర సామాగ్రిని అధికారులు బుధవారం ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ద్వారా విశాఖకు తరలించారు. విశాఖలో ఎక్కడ అన్నది అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. అయితే, 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని చూసిన ట్టు తెలిసింది. అక్టోబరు 1 నుంచి ఈ కా ర్యాలయంలో విధులు నిర్వహించటానికి అధికారులు సిద్ధమయ్యారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాల ఫర్నిచర్‌ను దాదాపుగా తరలించారు. విజయవాడలో ఇక చిన్న బ్రాంచి కార్యాలయమే ఉంటుంది. ఈ బ్రాంచి కార్యాలయం కోసం ఇంత పెద్ద అపార్ట్‌మెంట్ అవసరం లేదు కనుక, లబ్బీపేట బృందావన కాలనీలో ఏర్పాటు చేశారు. కొద్ది ఫర్నిచర్‌ను ఈ కార్యాలయానికి తరలించారు. మూడు నెలల కిందటే ఆదేశాలు.. 3 నెలల కిందటే విశాఖలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ రీజనల్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని విశాఖలో ఏర్పాటు చేయటం అంటే విజయవాడ నుంచి ప్రధాన కార్యాలయాన్ని తరలించినట్టుగానే భావించాలి. గత ప్రభుత్వం అమరావతిలో ని విజయవాడ, అమరావతిలను మెట్రోతో అనుసంధానం చేయాలని, విశాఖలో కూడా ప్రత్యేకంగా మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్దేశించి ఏఎంఆర్‌సీను ఏర్పాటు చేసింది. రవాణా రంగానికి కేంద్రంగా ఉన్న విజయవాడలో ఏపీఎ్‌సఆర్‌టీసీతో పాటుగా ఏఎంఆర్‌సీ ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు నిర్దేశించింది. విజయవాడ-అమరావతిలను అనుసంధానించేలా లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు రూపకల్పన జరగ్గా.. సమాంతరంగా విశాఖ మెట్రోకు కూడా శ్రీకారం చుట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిని విశాఖకు తరలించే చర్యలు చేపట్టింది. అమరావతి పేరుతో ఉన్న మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌గా పేరు మార్చింది. ఆ తర్వాత ఏపీఎంఆర్‌సీ కార్యాలయాన్ని తరలించేందుకు వీలుగా విశాఖలో రీజనల్ కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసినా.. కార్యాలయాల తరలింపునకు తొందరేమిటని నిలదీసినా సర్కారు వైఖరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని విశాఖ తరలించేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted September 24, 2020 Author Report Share Posted September 24, 2020 Orey Jagan , endhuku self financed 65 km metro project nu amaravathi nundi visakhapatnam ki theesukoni pothunavu Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted September 24, 2020 Report Share Posted September 24, 2020 Vijayawada lo already metro kattesaru ga @snoww pls post chinna babu tweet Quote Link to comment Share on other sites More sharing options...
RedThupaki Posted September 24, 2020 Report Share Posted September 24, 2020 Woow...goosebumps....jagnaal gajji ki anthu ledhu anukuntaa Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.