Jump to content

పరువు కోసమే హేమంత్‌ను చంపేశాం: నిందితుడు లక్ష్మారెడ్డి


Somedude

Recommended Posts

09302020201617n84.jpg

 

హైదరాబాద్: పరువు కోసమే హేమంత్‌ను చంపేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు లక్ష్మారెడ్డి తెలిపాడు. హేమంత్ హత్య కేసులో నిందితుల తొలిరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణలో హత్యకు గల కారణాలను నిందితుడు లక్ష్మారెడ్డి వెల్లడించాడు. ‘అవంతి ప్రేమ విషయం తెలిసి కట్టడి చేశాం. మా నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. 15 సంవత్సరాలుగా బావమ్మర్ధి యుగంధర్‌తో మాటలు లేవు. హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే అధిపత్యం. అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది’ అని పోలీసుల విచారణలో లక్ష్మారెడ్డి స్పష్టం చేశాడు.

 

 

ఇదిలా ఉంటే ఇవాళ సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను అవంతి, హేమంత్ తల్లిదండ్రులు కలిశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చందానగర్ పోలీసులతో రక్షణ కల్పించనున్నట్లు సీపీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

 

కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది:లక్ష్మారెడ్డి

గచ్చిబౌలి పోలీసుల విచారణలో అవంతి తండ్రి వెల్లడి

300920hemanth_case-brk1_1.jpg

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన హేమంత్‌ పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన అవంతి తండ్రి దొంతిరెడ్డి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్‌రెడ్డిని గచ్చిబౌలి పోలీసులు కస్టడీకిలోకి తీసుకుని విచారిస్తున్నారు. చర్లపల్లి జైలు నుంచి ఆరురోజుల కస్టడీకి వారిని తీసుకొచ్చారు. హేమంత్‌ను హత్య చేసిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. హత్య చేయడానికి గల కారణాలను నిందితులు పోలీసులకు వివరించారు. 

అవంతి ప్రేమ విషయం తెలిసి చాలా రోజులు కట్టడి చేశామని.. తమ నుంచి తప్పించుకుని హేమంత్‌ను ఆమె వివాహం చేసుకుందని లక్ష్మారెడ్డి పోలీసుల విచారణలో చెప్పాడు. వివాహం జరిగినట్లు పోలీసుల ద్వారా తమకు సమాచారం వచ్చిందన్నాడు. 15 ఏళ్లుగా బావ మరిది యుగంధర్‌రెడ్డితో తనకు మాటల్లేవని.. వీరి ప్రేమ విషయంపై మాట్లాడాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి చెప్పాడు. అవంతి ప్రేమ వ్యవహారంతో తమ కాలనీలో తలదించుకోవాల్సి వచ్చిందంటూ పోలీసులతో ఆయన చెప్పినట్లు తెలిసింది.

300920hemanth_case-brk2_1.jpg

ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన హేమంత్‌ భార్య అవంతి, ఆయన కుటుంబ సభ్యులు మరోమారు పోలీసులను కోరారు. బుధవారం హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తనతో పాటు హేమంత్‌ కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని అవంతి సీపీని కోరింది. దీనికి స్పందించిన సజ్జనార్‌.. చందానగర్‌లో హేమంత్‌ ఇంటివద్ద భద్రత కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. 

Link to comment
Share on other sites

Paruvu kosam anta...Not for Kulam.... Ohh no... Its actually because of Kulam and Money

 

What is the difference between caste and Paruvu? they don't seem to be the same but I can't distinguish between them clearly 

 

What is Paruvu?

 

 

 

Link to comment
Share on other sites

13 minutes ago, galiraju said:

Ippudu jail ki pothey parauvvu emyndi raaaa?

 

10 minutes ago, Boomer said:

Jail lo hero avthadu anta fellow khaidis deggara

 

1 minute ago, AndhraneedSCS said:

Paruvu kosam anta...Not for Kulam.... Ohh no... Its actually because of Kulam and Money

 

What is the difference between caste and Paruvu? they don't seem to be the same but I can't distinguish between them clearly 

 

What is Paruvu?

 

 

 

are are repu me kuthuru evarithono lechi pothay meku telusthadhi ra paruvu

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, Boomer said:

Arey murari muthi paguludhhi ,picha puvu actinglu 10geku..

Yenti bro vuhake bayam vesindha. 

4 minutes ago, AndhraneedSCS said:

How do you define "Paruvu"? adi cheppu first 

Why do you wear dress bro

Link to comment
Share on other sites

oka adapilla intiki yentha mukyamo, adapilla a initi paruvu ni kapadatam koda anthe mukyam. 

Champatam ante tappe kadu ananu but a amayi chesindi correct a ? 

I know one family sucided with this scenario, apudu vallani venakesuku vasthara. 

Dont take this in one way. 2ridhi tapudu vundi kakapothay parents dont have right to kill any one inlcuding theri daughter but son in law aythy mari ghoram inkokalla pillodini champe right asalu ledu. 

Link to comment
Share on other sites

41 minutes ago, Murari_Murari said:

oka adapilla intiki yentha mukyamo, adapilla a initi paruvu ni kapadatam koda anthe mukyam. 

Champatam ante tappe kadu ananu but a amayi chesindi correct a ? 

I know one family sucided with this scenario, apudu vallani venakesuku vasthara. 

Dont take this in one way. 2ridhi tapudu vundi kakapothay parents dont have right to kill any one inlcuding theri daughter but son in law aythy mari ghoram inkokalla pillodini champe right asalu ledu. 

Define Paruvu please

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...