Jump to content

విశ్వాసం లేకపోతే.. హైకోర్టును మూసేయమనండి


DaatarBabu

Recommended Posts

పార్లమెంటుకు వెళ్లి అడగండి
న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించం
అభ్యంతరకర పోస్టింగుల వెనుక కుట్ర ఉందేమో తేలుస్తాం
రూల్‌ ఆఫ్‌ లా అమలు కాకపోతే అధికారాన్ని వినియోగిస్తాం
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై (శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ) ఆధారపడి ఉంటుంది. జ్యుడీషియరీ నిస్పృహకు గురైతే ఆ పరిస్థితి అంతర్యుద్ధానికి దారి తీయొచ్చు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేదనుకున్ననాడు ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు.- హైకోర్టు

Link to comment
Share on other sites

న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించేది లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టును అపకీర్తి పాలుజేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అభ్యంతరకర పోస్టింగుల వెనుక కుట్ర ఏమైనా దాగుందా లేదా అనేది తేలుస్తామని చెప్పింది. ఎవరి ప్రభావం లేకుండా సాధారణంగా న్యాయమూర్తులను ఎవరూ దూషించరని అభిప్రాయపడింది. న్యాయ వ్యవస్థపై ఎవరికైనా విశ్వాసం లేకపోతే పార్లమెంటుకు వెళ్లి ఏపీలో హైకోర్టును మూసివేయమని కోరడం ఉత్తమం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. జడ్జీలను అవమానిస్తారా అని కన్నెర్ర చేసింది. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదా? రూల్‌ ఆఫ్‌ లా అమలుకాకపోతే..ఇతర నిబంధనల ప్రకారం మేము అధికారాన్ని వినియోగిస్తాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపై ఉందని, ఈ తరహా పోస్టింగులను అనుమతించొద్దని సామాజిక మాధ్యమ కంపెనీల తరఫు సీనియర్‌ న్యాయవాదులకు సూచించింది. ప్రజాస్వామ్యంలో ఇతరులను కూడా గౌరవించాలని తెలిపింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో హైకోర్టే వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు తమ వంతు సహకారం,సలహాలు ఇస్తామని సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సజన్‌ పూవయ్య తదితరులు కోర్టుకు తెలిపారు. కేసుల నమోదుకు సంబంధించి సీఐడీ వేసిన అదనపు అఫిడవిట్ను పరిశీలించేందుకు విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. పలు విషయాల్లో తీర్పులు    వెల్లడించాక హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ హైకోర్టు అప్పటి ఇంఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం హైకోర్టులో గురువారం మరోసారి విచారణకు వచ్చింది. న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టకుండా స్వీయ నియంత్రణ పాటించేలా ఆయా సామాజిక మాధ్యమ విదేశీ కంపెనీలను ఆదేశించాలని కోర్టు కోరింది. సామాజిక మాధ్యమ కంపెనీల తరఫు న్యాయవాదులు కొందరు కౌంటర్‌ వేశామన్నారు. మరికొందరు ఇంకా వేయాల్సి ఉంది. మరోవైపు సీఐడీ ఎన్ని కేసులు నమోదు చేసింది.. ఏ తరహా కేసులు నమోదు చేసిందీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొని విచారణను వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

Same thing applies to courts too. Govt meedha nammakam lekhapothey dismiss chesi dobbandi...

SC last month lo 3 times motti kayal vesindi HC ki.

Both HC & jagga are dying with ego

Link to comment
Share on other sites

31 minutes ago, Vaampire said:

Same thing applies to courts too. Govt meedha nammakam lekhapothey dismiss chesi dobbandi...

SC last month lo 3 times motti kayal vesindi HC ki.

Both HC & jagga are dying with ego

What are you talking bro. Those three also mortikayalu to jalag Anna

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...