Jump to content

ఫేస్‌బుక్‌ నా పరువు తీస్తోంది


snoww

Recommended Posts

అమరావతి భూ కుంభకోణంపై పోస్టింగ్‌లు వస్తూనే ఉన్నాయి 

హైకోర్టులో మాజీ ఏజీ దమ్మాలపాటి అనుబంధ పిటిషన్‌ 

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టును ఆశ్రయించి ఏసీబీ దర్యాప్తుపై స్టేతో పాటు మీడియా కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ పొందిన మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్‌ మీడియా వేదికల్లో అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన వివరాలతో పోస్టింగ్‌లు వస్తూనే ఉన్నాయని, వాటిని ‘విశ్వవ్యాప్తం’గా తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపైన, తన కుటుంబసభ్యులు, సన్నిహితులపైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన కథనాలను వ్యాప్తిచేస్తూ దురుద్దేశపూర్వక ‘మీడియా ట్రయిల్‌’ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తును, నిందితుల హక్కులను ప్రభావితం చేసేలా మీడియా ట్రయిల్‌ ఉండరాదని మనుశర్మ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందంటూ ప్రస్తావించారు. (ఏసీబీ దర్యాప్తు మొదలు పెట్టకుండానే దమ్మాలపాటి హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చారు). సోషల్‌ మీడియా కథనాలతో తన పరువు ప్రతిష్టలకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ అనుబంధ వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.  (తమిళ పత్రిక కథనం: చంద్రబాబూ.. ఎందుకీ కడుపుమంట..?)

మేం ఆదేశాలిచ్చినా.. 
దమ్మాలపాటి న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు విన్న అనంతరం.. తాము ఆదేశాలిచ్చినా సోషల్‌ మీడియాలో పోస్టులెలా వస్తాయని జస్టిస్‌ మహేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ పోస్టుల తొలగింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ చెప్పారు. దమ్మాలపాటి ఫేస్‌బుక్‌ను ప్రతివాదిగా చేర్చకుండానే ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఉత్తర్వులు కోరుతున్నారన్నారు. తమ ఉత్తర్వుల అమలుకు కేంద్రానికి ఆదేశాలిస్తామని సీజే పేర్కొన్నారు. మరిన్ని వివరాల సమర్పణకు గడువు కావాలన్న ప్రణతి వినతికి సీజే అంగీకరించారు.   (రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు)

మీ ఎస్‌ఎల్‌పీ ఎంతవరకు వచ్చింది? 
హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ ఎంతవరకు వచ్చిందని సీజే ఆరా తీశారు. వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని సుమన్‌ చెప్పారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సీజే ఇచ్చిన మీడియా గ్యాగ్‌ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ న్యాయవాది మమతారాణి దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పైన విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. దమ్మాలపాటి కౌంటర్‌ తమకు అందలేదని మమతారాణి న్యాయవాది పి.బి.సురేశ్‌ చెప్పడంతో «కౌంటర్‌ కాపీని వారికి ఇవ్వాలని ప్రణతికి సీజే సూచించారు.   

Link to comment
Share on other sites

రాజధాని భూముల విషయంలో అవినీతి నిరోధక శాఖ (అనిశా) నమోదుచేసిన కేసు వివరాలను ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా బయటపెట్టకుండా నిరోధిస్తూ తాము ఉత్తర్వులు ఇచ్చినా.. పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు ఎలా పోస్టు చేస్తారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి శుక్రవారం ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌లో ఈ తరహా వ్యాఖ్యలు ఇప్పటికీ ఉన్నాయన్న విషయాన్ని మాజీ  ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది ప్రణతి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించగా.. ఫేస్‌బుక్‌ను అనుబంధ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఆ పోస్టుల తొలగింపునకు వేరే ప్రక్రియను అనుసరించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వపాత్ర ఏమీ లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మరికొన్ని వివరాలను కోర్టుముందు ఉంచేందుకు మరికొంత గడువు కావాలని న్యాయవాది ప్రణతి కోరగా, ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఎస్‌ఎల్‌పీ ఏమైందని జీపీని సీజే ప్రశ్నించగా.. వారం రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు.
మరోవైపు.. ఇదే కేసులో గతనెల 15న హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని, తనను ప్రతివాదిగా చేర్చుకొని (ఇంప్లీడ్‌) వాదించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ న్యాయవాది మమతారాణి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదాపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

Link to comment
Share on other sites

So if I make a post about him in California , I will come under the jurisdiction of this court ? 

Or will they just  censor my post and not put a contempt of court case ? 

Very interesting case 

Link to comment
Share on other sites

5 minutes ago, Ryzen_renoir said:

So if I make a post about him in California , I will come under the jurisdiction of this court ? 

Or will they just  censor my post and not put a contempt of court case ? 

Very interesting case 

They will arrest you when you land in India.. if they manage to get a warrant against you

Link to comment
Share on other sites

13 minutes ago, Thokkalee said:

They will arrest you when you land in India.. if they manage to get a warrant against you

So they will need to send a notice to Facebook india about my post ,after that they need to Norwegian cyber police due to my VPN and after obtaining my location in California they need to send a notice to my residency .

Very legal and very cool :giggle:

Link to comment
Share on other sites

34 minutes ago, Ryzen_renoir said:

So they will need to send a notice to Facebook india about my post ,after that they need to Norwegian cyber police due to my VPN and after obtaining my location in California they need to send a notice to my residency .

Very legal and very cool :giggle:

CITI_c$y

Link to comment
Share on other sites

43 minutes ago, Ryzen_renoir said:

So they will need to send a notice to Facebook india about my post ,after that they need to Norwegian cyber police due to my VPN and after obtaining my location in California they need to send a notice to my residency .

Very legal and very cool :giggle:

Nee Facebook account lo real name vunte you will directly get summons to attend court hearing through whatsapp. 

now a days notices are being served in whatsapp too. 

Link to comment
Share on other sites

53 minutes ago, Ryzen_renoir said:

So they will need to send a notice to Facebook india about my post ,after that they need to Norwegian cyber police due to my VPN and after obtaining my location in California they need to send a notice to my residency .

Very legal and very cool :giggle:

ante ne VPN IP chusi norway potarani ne brain edaitho undo. abbaaa awesome vayya nuv

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...