Jump to content

జస్టిస్‌ రమణ కుమార్తె ‘డేటా చోరీ!’


snoww

Recommended Posts

ఏసీబీ అడ్డదారి

11132020035535n6.jpgKaakateeya

 

జస్టిస్‌ రమణ కుమార్తె ‘డేటా చోరీ!’

అనధికారికంగా ఖాతా వివరాల సేకరణ

5నెలల్లో 4సార్లు ఆ ఖాతా పరిశీలన

భూముల వ్యవహారంలో అత్యుత్సాహం

అనుమానం రాకుండా స్ర్కీన్‌పైనే ఖాతాలోని వివరాలు ఫొటో షాట్‌

ఇంత రిస్క్‌ పెద్దల మెప్పు కోసమేనా!

అనుమానిస్తున్న బ్యాంకు వర్గాలు

 

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అడ్డదారి తొక్కింది. ఏ వ్యక్తి బ్యాంకు వివరాలనైనా అకౌంట్‌ ఉన్న బ్రాంచ్‌ నుంచి తెప్పించుకొనే వీలున్నా, దొంగదారుల్లో అందుకు ప్రయత్నించి దొరికిపోయింది. ముందు కేసు నమోదుచేసి ఆ తరువాత అధికారికంగా డేటా సేకరించుకోవాలి. దీనికి భిన్నంగా ఖాతా వివరాలు తీసుకున్నట్లు తేలింది. తమ పొలిటికల్‌ బాస్‌లను మెప్పించడం కోసమే ఏసీబీ ఇంత రిస్క్‌చేసినట్టు అనుమానిస్తున్నారు. రాజధాని భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను ఎలాగైనా బదనాం చేయాలనే ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలకు ఏసీబీ ఇలా సాయంచేసినట్టు భావిస్తున్నారు.

 

రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వంలో కొంత భూమిని కొన్నారని జస్టిస్‌ ఎన్వీ రమణ పిల్లలపై ఏసీబీ ఈ ఏడాది సెప్టెంబరులో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  అయితే, ఐదు నెలల ముందు నుంచే, అంటే మార్చి నుంచే జస్టిస్‌ రమణ కుమార్తెకు చెందిన ఓ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తాజాగా బయటపడింది. ఆమెకు హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. ఇటీవల ఈ బ్యాంకును యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు. కాబ ట్టి, ఏదైనా సమాచారం కావాలంటే ఆమె ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తెప్పించుకోవాలి. అయితే,  విజయవాడలోని సదరు బ్యాంకు బ్రాంచి కార్యాలయాల్లో కొందరు అధికారులు ఆమె ఖాతాలోకి  ప్రవేశించి వివరాలను సేకరించి ఏసీబీ అధికారులకు పంపించినట్లు తేలింది. అనధికారికంగా అకౌంట్‌నుంచి డేటా రాబట్టడం అతి తీవ్రమైన నేరం. దీంతో బాధ్యులైన ఐదుగురు బ్యాంకు ఉద్యోగులపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బదిలీవేటు వేస్తే.. వారి చర్యలను సమర్థిస్తూ జగన్‌ మీడి యా వార్తా కథనాలు వండివార్చింది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందని బ్యాంకు అధికారులు ఆరాతీస్తే బాగోతమంతా బట్టబయలైంది. 

 

ఎఫ్‌ఐఆర్‌కు ముందే 4సార్లు ఖాతా పరిశీలన

రాజధాని భూములపై దర్యాప్తుచేస్తున్న అధికారికి, బ్యాంకు ఖాతా సమాచారం కావాలంటే చట్టప్రకారం, బ్యాంకు నిబంధనలు అనుసరించి లిఖితపూర్వక విన్న పం ఇవ్వాలి. దాన్ని సదరు బ్యాంకు లీగల్‌ విభాగం పరిశీలించి డేటా ఇవ్వాల్నా? వద్దా అనేది నిర్ణయిస్తుంది. విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో (ఆర్‌వో ఆఫీసు) రింగ్‌రోడ్డు బ్రాంచి, మచిలీపట్టణం బ్రాంచిల్లో ఆ  బ్యాంకు అకౌంట్‌ను ఏసీబీ అధికారులు తెరచి చూశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. డేటా చోరీ కిందకు వస్తుంది. నిజానికి ఈ కేసులో డేటా ఇవ్వొచ్చని బ్యాంకు లీగల్‌ విభాగ ం సూచించింది. అప్పుడు ఖాతా ఉన్న ఎస్‌ఆర్‌నగర్‌ బ్రాంచిలో డేటా ఇవ్వాలి. లేదా అక్కడి ప్రాంతీయ కార్యాలయం నుంచై నా తీసుకోవాలి. అలాకాకుండా అక్కడా ఇక్కడా ఆ ఖాతాను ఎలా తెరచిచూశారు? అంటే దర్యాప్తు నియమాలను పక్కకు తోసేసి ఏసీబీ అధికారులు నేరుగా బ్యాంకు సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చి సమాచారం తీసుకున్నారనేది స్పష్టమవుతోంది. ఒకవేళ బ్యాంకింగ్‌ సర్వీసులన్నీ ఆన్‌లైన్‌ అయి ఎక్కడి నుంచైనా సమాచారం తీసుకోవచ్చు అనుకున్నప్పటికీ, కేసు నమోదుకు ఐదు నెలల ముందు నుంచే వేర్వేరు బ్రాంచిల్లో సమాచారాన్ని ఎందుకుతీసుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి రాజధాని భూములపై సెప్టెంబరులో కేసు నమోదయింది. అందులో జస్టిస్‌ ఎన్వీ రమణ కూతురు భూములు కొన్నట్లు చూపించారు. సెప్టెంబరులో కేసు నమోదయితే మే నెల నుంచి  అక్టోబరు వరకు నాలుగుసార్లు ఆమె బ్యాంకు ఖాతాను యాక్సెస్‌ చేయడం గమనార్హం. 

 

ఇలాగే నాడు జేడీ డేటా చోరీ

ప్రముఖుల డేటాను తప్పుడు సమాచారం ఇచ్చి తీసుకోవడం ఇదే కొత్తకాదు. గతంలోనూ ఇలాంటి పనులకు పాల్పడిన చరిత్ర ఉంది. జగన్‌ అక్రమాస్తుల కేసు విచారిస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్‌కాల్‌ డేటాను తీసుకునేందుకు ఓ పోలీసు అధికారిని  వాడుకొన్నారు. ఆ అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చి  ఆయన ద్వారా డేటా నాడు తెప్పించుకున్నారు. 

 

దొరక్కుండా జాగ్రత్త!

చేస్తున్నది భయంకరమైన తప్పు అని ఏసీబీ అధికారులకు తెలుసు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఒక చిన్న టెక్నిక్‌ ఉపయోగించుకున్నారు. ఖాతా వివరాలను ప్రింట్‌ తీస్తే లాగ్‌ పాయింట్‌ ద్వారా ఎక్కడినుంచి తీసింది కనిపెట్టవచ్చు. అందుకోసం ఆయా బ్యాంకు బ్రాంచిల్లో అకౌంట్‌ యాక్సెస్‌ చేసి కంప్యూటర్‌ మానిటర్‌ స్ర్కీన్‌లనే ఫొటోలు తీసి సమాచారం రాబట్టుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి పనులకు పాల్పడిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే, ప్రభుత్వ వర్గాలు బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. కఠినచర్యలకు బదులు బదిలీతో సరిపుచ్చి వ్యవహారం రచ్చకెక్కకుండా జాగ్రత్త పడ్డారన్న వాదన బ్యాంకింగ్‌ వర్గాల్లో వినిపిస్తుంది.

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

dear High court. Please take action on ACB for stealing data. 

NO worries.. ChB! or FB! ki ichestharu lae..  But if incase isthae.. Bramaravath! land scam lo transactions bayata padthayemo

Link to comment
Share on other sites

3 minutes ago, kidney said:

NO worries.. ChB! or FB! ki ichestharu lae..  But if incase isthae.. Bramaravath! land scam lo transactions bayata padthayemo

Bramaravati high court daily hearings updates enti bro. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Bramaravati high court daily hearings updates enti bro. 

Sep 9th ki SC mana Fud Court ki order ichindhi.. Appatini nundhi mana Uthara kumarulu badha varnaathetham @3$%

Hearing ki date ichesi.. few days vintaru.. Then again Roaster change  to Other Bench request pedtharu.. As usual Round-Robin method is going on

Link to comment
Share on other sites

44 minutes ago, kidney said:

Sep 9th ki SC mana Fud Court ki order ichindhi.. Appatini nundhi mana Uthara kumarulu badha varnaathetham @3$%

Hearing ki date ichesi.. few days vintaru.. Then again Roaster change  to Other Bench request pedtharu.. As usual Round-Robin method is going on

N v r@m@na decision modi court lo undhi antunaru . Let's see what can happen 

Link to comment
Share on other sites

7 minutes ago, snoww said:

Bodi em seyyagaladu ? 

Prime minister has the power  to order a CBI enquiry and put  all accused in jail but he won't . Nothing to gain by sending em to jail , now he can control 

The threat of jail / enquiry will make ramana puppet of modi-shah , another CJI working for BJP

Link to comment
Share on other sites

12 minutes ago, Ryzen_renoir said:

Prime minister has the power  to order a CBI enquiry and put  all accused in jail but he won't . Nothing to gain by sending em to jail , now he can control 

The threat of jail / enquiry will make ramana puppet of modi-shah , another CJI working for BJP

Agreed. Bodi is just using both the sides for pushpam party benefit. 

I don't think he will goto extreme of removing ramana through parliament just to benefit jagan. 

Link to comment
Share on other sites

57 minutes ago, Pappu_Packitmaar said:

Eval kaka ie Ramana daughters ? Jaggadu pani katukuni vella venakala padindu...

Mqna very neutral judge ramana daughters bought land before and after capital tega seap ga 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...