Jump to content

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు


Somedude

Recommended Posts

సిద్దిపేట లేకుంటే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు

సిద్దిపేట ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం
సుందర స్థలంగా రంగనాయక సాగర్‌
హరీశ్‌ ఆణిముత్యం... నా పేరు నిలబెట్టారు
రెండు పడక గదుల ఇళ్ల సముదాయం ప్రారంభోత్సవంలో సీఎం
నియోజకవర్గ అభివృద్ధికి వరాల జల్లు
బాహ్యవలయ రహదారి విస్తరణకు  రూ.160 కోట్ల మంజూరు

10hyd-main2a_8.jpg

రంగనాయక సాగర్‌ గెస్ట్‌హాస్‌లో కూర్చొని అన్నం తింటుంటే ఒకవైపు కళ్లలో నీళ్లొస్తున్నాయి. మరోవైపు ఒళ్లు పులకరిస్తోంది. ఒకప్పుడు సిద్దిపేట పట్టణంలో నీళ్లు లేకుంటే చుట్టుపక్కల గ్రామాల్లో బావులు కొని అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకునేటోళ్లం. చెప్పతరం కాని బాధలు. బోరేసేందుకు రైతులూ తీవ్ర కష్టాలు పడేటోళ్లు. బోర్లు వేసుడు.. అవి ఎండిపోవుడు. చుక్కనీటి కోసం ఎంతో గోస పడ్డాం. రంగనాయక స్వామి, కాళేశ్వర స్వామి దయ వల్ల సిద్దిపేటలో రంగనాయక సాగర్‌ 365 రోజులు నీళ్లతో కళకళలాడుతోంది.

- సిద్దిపేట బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌



ఈనాడు, సిద్దిపేట - ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: ‘ప్రజలంతా ఆత్మగౌరవంతో బతకాలనేది నా కల. అది నెరవేరుతోంది. సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతోంది. ఇంటింటికీ పైపుల ద్వారా గ్యాస్‌ పంపిణీ జరిగేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రానున్న రోజుల్లో సిద్దిపేట గొప్ప పట్టణంగా విలసిల్లుతుంది. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం ఉంది. సిద్దిపేట లేకుంటే కేసీఆర్‌ లేడు... కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దాదాపు రూ.1,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట పట్టణ శివారు నర్సాపూర్‌లో రూ.163 కోట్ల వ్యయంతో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 2,460 గృహాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. మొత్తం 144 మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. సిద్దిపేట నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ఈ నియోజకవర్గం చుట్టూ 28 గ్రామాల మీదుగా 75 కిలోమీటర్ల పొడవునా బాహ్యవలయ రహదారి విస్తరణ కోసం రూ.160 కోట్లు మంజూరు చేశారు.

10hyd-main2b_3.jpg

రాష్ట్రం సిద్ధించేలా చేసిన గడ్డ ఇది...
‘‘సిద్దిపేట పేరులోనే ఏదో బలముంది. ఇది మామూలు పేట కాదు. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. నాకు బాగా గుర్తుంది. తెలంగాణ కోసం దిల్లీకి పోవాల్సిన అవసరం వచ్చి ఉండె. నేనిక్కడ రాజీనామా చేసి పోతున్న అని చెబితే... ఒక గంట సేపు అందరం ఏడ్చినం. తెలంగాణ కోసం నడుం కట్టినం కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలి నేను అక్కడికి పోయిన. మీరు పంపినదానికి అందరి పేరు నిలబెట్టిన. తెలంగాణ తెచ్చి ప్రజల చేతుల్లో పెట్టిన. తెలంగాణ ప్రజలు ఉన్నతంగా బతకాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని నాకు గొప్ప కల ఉండె. వాటన్నింటినీ నెరవేరుస్తున్నా. రాష్ట్రం సాధించిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి రావాలని కాంక్షించి 33 జిల్లాలు చేసుకున్నాం. అందులో సిద్దిపేట ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది.

మిషన్‌ భగీరథ కీర్తి ఈ నేలకే
గతంలో ఇక్కడి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్లు పటాకుల్లా కాలిపోయేవి. ఒక సబ్‌స్టేషన్‌ కావాలంటే ఎన్నో అవస్థలు. భగవంతుడి దయతో తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు లేవు. ఇక రావు. చాలా పటిష్ఠమైన విధానంలో ముందుకు పోతున్నాం. అవసరమైతే ఇతరులకు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతున్నాం. సిద్దిపేటలో గతంలో 28 ట్యాంకర్లు పెట్టి నీళ్లు సరఫరా చేసినా సరిపోకపోయేవి. అందుకే లోయర్‌ మానేరుడ్యాం నుంచి తాగునీళ్లు తెచ్చుకున్నాం. సిద్దిపేట పథకమే ఇప్పుడు రాష్ట్రానికీ విస్తరించింది. దాని పేరే మిషన్‌ భగీరథ. ఇది ఎక్కడో అమెరికా నుంచి రాలే. ఇది ఒక గొప్ప పథకం. నేను చెప్పడం లేదు. కేంద్రమే చెబుతోంది. దేశం మొత్తం మీద 98.31 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఇది మీ బిడ్డ సాధించిన ఘనత. నేనున్నా లేకపోయినా ఆ కీర్తి ఈ గడ్డకే దక్కుతుంది.

10hyd-main2c_2.jpg

ఇక్కడి నాయకులందరికీ సెల్యూట్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపించారు. ఇక్కడి ప్రజల దీవెనలతో చాలా పనులు జరిగాయన్నారు. ఇక్కడి నాయకులందరికీ సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే గడ్డ ఇదని ఆయన ప్రస్తుతించారు. మిగతా వాళ్లూ చూసి నేర్చుకోవాలని చెబుతూ ఉంటానని అన్నారు. వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.


నాలుగు కంపెనీలతో ఒప్పందం..

కొండపాక మండలం దుద్దెడ వద్ద రూ.45 కోట్లతో నిర్మించనున్న ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాలుగు కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. సీఎం సమక్షంలో జోలాన్‌ టెక్నాలజీస్‌, విసాన్‌ టెక్‌, ఎంబ్రోడ్స్‌ టెక్నాలజీ, సెట్విన్‌ కంపెనీల ప్రతినిధులు.. ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐటీ టవర్‌ నిర్మించేందుకు ఏడాది సమయం పడుతున్నందున తాత్కాలికంగా సిద్దిపేట పట్టణంలో ఈ కంపెనీల కోసం భవనాన్ని కేటాయించనున్నారు. ఐటీలో సిద్దిపేట పురోగమిస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఈటల, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్తు అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, జిల్లా కలెక్టరు వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్‌, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ పిల్లోడు సిద్దిపేటను అద్భుతంగా చేసిండు..

10hyd-main2d_1.jpg

సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని ఆణిముత్యం లాంటి నాయకుడు హరీశ్‌ను మీకు అప్పజెప్పిన. ఆ పిల్లోడు నా పేరు కాపాడి గొప్పగా సిద్దిపేటను తయారు చేసిండు. అద్భుతమైన ఉద్యమకర్త మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నా గుండెల నిండా సంతోషంగా ఉంది. హరీశ్‌ బాగా హుషారుగున్నడు. మీరొచ్చి రిబ్బన్‌లు కత్తిరించి పోతే చాలు... ఏమడగనని హైదరాబాద్‌లో చెప్పిండు. ఈడికి వచ్చినంక మీ ముందు నిలబెట్టి అడుగుతుండు. నాకు సిద్దిపేట అంటే బలహీనత. బాగా ప్రాణం. మీ కోరికలు నెరవేర్చిన. ఇంకా ఏమి కావాలన్నా ఇస్తా. సిద్దిపేట అభివృద్ధి కోసం పాటుపడిన హరీశ్‌రావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా బాగా పనిచేసి ప్రజల మెప్పు పొందాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.


సిద్దిపేటకు త్వరలో వైమానిక అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: సిద్దిపేటకు త్వరలో విమానాశ్రయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ప్రకటించడంతో రాష్ట్ర వైమానిక శాఖ అధికారులు సంబంధిత ప్రతిపాదనల తయారీపై దృష్టి సారించారు. త్వరలో వారు సిద్దిపేటను సందర్శించి, కలెక్టర్‌తో సమావేశమై విమానాశ్రయానికి అనువైన వివిధ ప్రాంతాలను పరిశీలించనున్నారు. వరంగల్‌, బసంత్‌నగర్‌ (పెద్దపల్లి జిల్లా), జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌ జిల్లా), భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా జరిగింది. తాజాగా సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం చెప్పడంతో దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. శంషాబాద్‌కు 150 కిలోమీటర్లలోపు కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయరాదంటూ గతంలో ఉన్న ఒప్పందం కారణంగా రాష్ట్రంలో మరో కొత్త విమానాశ్రయం ఏర్పాటు జరగడం లేదని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. తాజాగా సీఎం స్వయంగా ప్రకటించడంతో సిద్దిపేటకు ఈ అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. సిద్దిపేట.. హైదరాబాద్‌కు 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉమ్మడి మెదక్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు సైతం సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. స్థలం గుర్తించిన తర్వాత ప్రతిపాదనల్ని పౌరవిమానయాన శాఖ పరిధిలోని జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు పంపించాలి. ఆ సంస్థ అధ్యయనం అనంతరం సాధ్యాసాధ్యాలను నివేదిస్తుంది. దీని ఆధారంగా కేంద్రం కొత్త విమానాశ్రయం ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటుంది.


ఇప్పుడు రంగనాయక సాగర్‌ వద్ద బ్రహ్మాండమైన పని జరగాలి. 65 ఎకరాల స్థలం ఉంది. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్‌ సెంటర్లు రావాలి. అద్భుతమైన స్టార్‌ హోటళ్లు రావాలి. ఇది తెలంగాణకే గొప్ప పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నా. చల్లగా బతికితే.. రెండేళ్ల తర్వాత అక్కడికి వెళ్లి చూస్తే రెండు కళ్లు చాలొద్దు.


పేదలకు రెండు పడక గదుల ఇళ్లతో నా జన్మ ధన్యం

త ప్రభుత్వాల హయాంలో నిర్మించిన ఇళ్లు మురికికూపాలుగా... పేదలను అవమానించి, చిన్నచూపు చూసేలా ఉండేవి. ఇప్పుడు కాలికి మట్టి అంటకుండా సీసీరోడ్లతో పాటు సకల సదుపాయాలతో రెండు పడక గదుల ఇళ్లను కట్టి ఇస్తున్నాం. నర్సాపూర్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం సందర్భంగా దాదాపు 400 సార్లు అక్కడకు వెళ్లి వచ్చా. సొంత ఇంటిని కట్టుకునేటప్పుడు ఎంత శ్రద్ధ పెడతామో అంతకుమించి ఈ నిర్మాణాల గురించి జాగ్రత్తలు తీసుకున్నాం. గృహప్రవేశాలు చేస్తున్న అక్కాచెల్లెళ్ల కళ్లలో ఆనందభాష్పాలు చూస్తుంటే నా జన్మ ధన్యమయినట్లు అనిపించింది.

- బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు


ప్రత్యేకతల ‘నిలయాలు’
నర్సాపూర్‌లో పేదల కోసం నిర్మించిన రెండు పడకల ఇళ్లు ఎన్నో ప్రత్యేకతల నిలయంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఇక్కడ సకల హంగులు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఇంటింటికీ నేరుగా పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయడం మరీ ప్రత్యేకం. ఈ ఇళ్లను చూసి సీఎం కేసీఆర్‌ అబ్బురపడ్డారు. మంత్రి హరీశ్‌, కలెక్టరు వెంకటరామరెడ్డి పని తీరును ప్రశంసించారు.

మరికొన్ని విశేషాలు...

* ఒక్కో అంతస్తులో నాలుగు చొప్పున 12 ఫ్లాట్లు
* 24 గంటల పాటు తాగునీరు, కరెంటు
* భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ
* దాదాపు 10 వేల మంది నివాసం. వారి అవసరాల కోసం రూ.6 కోట్లతో ఫంక్షన్‌ హాల్‌
* విశాలమైన రహదారులు, మైదానాలు...


ఇళ్లలో కేసీఆర్‌, హరీశ్‌రావుల పటాలు

న్యూస్‌టుడే, సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌: సొంతింటి స్వప్నం సాకారం కావడం.. అద్భుతంగా తీర్చిదిద్దిన నర్సాపూర్‌లోని కేసీఆర్‌ నగర్‌లో రెండు పడక గదుల ఇళ్లు కేటాయించడం.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గృహప్రవేశం చేసే అవకాశం దక్కడంతో లబ్ధిదారులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. తమ ఇళ్లలో కేసీఆర్‌, హరీశ్‌రావుల పటాలు పెట్టుకున్నారు. పేద కుటుంబాలు ఆత్మగౌరవంతో బతకాలనే తన సంకల్పానికి ప్రతీకగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని చూసి కేసీఆర్‌ పరవశించిపోయారు. లబ్ధిదారులతో మాట్లాడారు. సభలో కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు పాదాభివందనంచేశారు. సీఎం... ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Raazu said:

KCR lekapothe only KTR and Kavita leru, migatha dhi Antha same to same. I prefer One state for telugu’s and not divide based on accent.

This is nirantara prakriya modal ettu United state udyamam

Link to comment
Share on other sites

20 minutes ago, MiryalgudaMaruthiRao said:

lol students and NGOs  credit kooda 10gada 

veedu nakka laaga dabba raayudu la ayyadani @csrcsr antundey

Students ngo’s played good roles. But kcr played the key role. 
we can call it fake deeksha or what ever we want. Aa deeksha ey main reason sep tg. 
 

and trs ni congi lo merge chestha ani sonia tho double game adadu. Lekhapothey chaala delay ayyedhi emo

  • Upvote 2
Link to comment
Share on other sites

1 minute ago, Vaampire said:

Students ngo’s played good roles. But kcr played the key role. 
we can call it fake deeksha or what ever we want. Aa deeksha ey main reason sep tg. 
 

and trs ni congi lo merge chestha ani sonia tho double game adadu. Lekhapothey chaala delay ayyedhi emo

kcr role ledhu ani nenu analedhu :giggle:

 

Link to comment
Share on other sites

Just now, csrcsr said:

Papam vayya siddipet mida prema tho ala anadu in a way kcr was one of the reasons along with many other sacrifices for separate state ovaru aina debate chyochu 

 

Just now, MiryalgudaMaruthiRao said:

kcr role ledhu ani nenu analedhu :giggle:

 

 

Link to comment
Share on other sites

2 minutes ago, MiryalgudaMaruthiRao said:

antha nuvve chesi malli dramas endi Anna :giggle:

Mana india lo em cheyyakapoyina credit thisukuntaru. Sep tg ki main reason aadu. Thisukoni credit

Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

Students ngo’s played good roles. But kcr played the key role. 
we can call it fake deeksha or what ever we want. Aa deeksha ey main reason sep tg. 
 

and trs ni congi lo merge chestha ani sonia tho double game adadu. Lekhapothey chaala delay ayyedhi emo

Thanks to dumb b!tch and her dumb political advisors like Digvijay Singh, Chidambaram and Azad....... Congress is now completely washed away from 10 crore telugu people......... 60 years nundi cheyyaleni pani.... YST poyinaka... KCR gaadi star tirigindi.... baaga addinchadu ee Congress pulka gallani Bandla Ganesh 7OClock GIF - BandlaGanesh Ganesh 7OClock - Discover & Share  GIFs.......

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...