Jump to content

విజయసాయి కారు అద్దాలు ధ్వంసం.. చెప్పులు, రాళ్లు వేసిన నిరసనకారులు


Somedude

Recommended Posts

 

విజయనగరం : రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇటీవల రామతీర్థంలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహానికి జరిగిన అపచారానికి సంబంధించి టీడీపీ, బీజేపీ నేతల నిరసన, అదే సమయంలో వీరికి వ్యతిరేకంగా వైసీపీ వర్గాల ప్రవేశంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి రామతీర్థంలో టెన్షన్‌ టెన్షన్‌గా పరిస్థితులు ఉన్నాయి. ఓ వైపు మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటించడం.. మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటిస్తున్నారు. దీంతో భారీగా ఆయా పార్టీల కార్యకర్తలు, నేతలు రామతీర్థానికి చేరుకున్నారు. వీరితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. అగ్రనేతల పర్యటనతో రామతీర్థంలో హై టెన్షన్ నెలకొంది. 

 

కారు అద్దాలు ధ్వంసం..

ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై నిరసనకారులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత మరో కారులో వెళ్లిన విజయసాయి కొండపై ఆలయాన్ని పరిశీలించారు. అయితే కొండపైకి కూడా వైసీపీ జెండాలతో వెళ్లి కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. దేవుడి దగ్గరికి ఇలా వెళ్లడమేంటి..? ఇదేమైనా పార్టీ ఆఫీసు అనుకుంటున్నారా..? దేవాలయం అనుకుంటున్నారా..? అంటూ టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రామతీర్థం గుడిమెట్లపై వైసీపీ నేతలు బైఠాయించారు. చంద్రబాబును కొండపైకి వెళ్లనివ్వమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా భారీగా పోలీసులు మోహరించారు.

 

01022021142848n61.jpg

 

రోడ్డుపై బైఠాయింపు..

అంతకుముందు రామతీర్థం వెళ్లేందుకు చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికే అనుమతి ఇచ్చారు. కేవలం చంద్రబాబు కాన్వాయ్‌కి అనుమతి ఇచ్చి.. మిగతా వాహనాలు రాకుండా లారీలు అడ్డుపెట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 3 రోడ్ల జంక్షన్‌ వద్ద మమ్మల్ని అడ్డుకున్నారని, చంద్రబాబుతో కలిసి తమని వెళ్లనివ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీసులు అడ్డగించడంతో మాజీ మంత్రి చినరాజప్ప ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత నడుచుకుంటూ వెళ్లి, ఆటోలో రామతీర్థానికి బయలుదేరారు. 

 

సొమ్మసిల్లిన బీజేపీ మహిళా నేత

ఈ క్రమంలో బీజేపీ-టీడీపీ కార్యకర్తల మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాట రామతీర్థం బీజేపీ శిబిరం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని సొమ్మసిల్లి పడిపోయారు. ఇలా మూడు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో రామతీర్థం కాస్త రణరంగాన్ని చవిచూసేలా పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రామతీర్థానికి భారీగా తరలివస్తున్నారు.

 

Link to comment
Share on other sites

రామతీర్థంలో ఆయనకేం పని?: చంద్రబాబు

02012021-babu2-1a.jpg

విజయనగరం: దేవుడి సేవకంటే పవిత్రమైన పని మరొకటి లేదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా కొలుస్తున్న రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేయడం ద్వారా కోదండరాముడికి అవమానం జరిగిందన్నారు. వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం అత్యంత దారుణమన్నారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు నాటకీయ పరిణామాల నడుమ రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం ద్వారా బోడికొండపైకి వెళ్లారు. విగ్రహం ధ్వంసమైన బోడికొండ ప్రదేశాన్ని  పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును పరిశీలించారు. విగ్రహం ధ్వంసంపై అక్కడి పూజారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

‘‘వైకాపా పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయి. తెదేపా హయాంలో ప్రార్థనా మందిరాలపై ఎలాంటి దాడులు జరగలేదు. ఆలయాలను పరిరక్షించే బాధ్యత సీఎం జగన్‌కు లేదా? రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెలిసి అందరూ బాధపడ్డారు. రామతీర్థం, ఒంటిమిట్ట ఆలయాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. 16వ శతాబ్దంలోనే పూసపాటి వంశీయులు రామతీర్థంలో ఆలయాలను నిర్మించారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారు పరమ కిరాతకులు. దేవుడి ఆస్తులపై కన్నేస్తే మసైపోతారు. దేవాలయాల వద్దకు వెళ్లి అన్యమత ప్రచారం చేస్తారా? అసలు పరమత విద్వేషం ఎందుకు? రాష్ట్రంలో హోంశాఖ, దేవాదాయశాఖ మంత్రులు ఉన్నారా? ఉంటే ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని వ్యాఖ్యానించారు.

నన్నెందుకు అడ్డుకున్నారు?
‘‘కొందరు పోలీసులు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారు. రామతీర్థంలో ఎంపీ విజయసాయిరెడ్డికి ఏం పని? ఇలాంటి చోటామోటా నాయకులను నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను. రామతీర్థం ఘటనపై ఆర్డీవో, తహసీల్దార్‌కు బాధ్యత లేదా? విగ్రహాల ధ్వంసం విషయంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత చర్యలు తప్పవు. దేవుడిని చూసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డిని ఆనుమతించారు. మరి నన్నెందుకు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు’’ అని ప్రశ్నించారు.

Atchenna-1b.jpg

పూర్తిగా విచ్ఛిన్నం చేశారు: అచ్చెన్నాయుడు

‘‘రాష్ట్రం 19 నెలలుగా అల్లకల్లోలంగా ఉంది. 151 సీట్లు వచ్చాయనే పొగరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. ప్రాంతాలు, మతాలు, కులాల వారీగా రాష్ట్రాన్ని విభజించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గేది లేదు. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలను ఓ దొంగకు అప్పగించారు. స్థానిక నేతలను కాదని బయటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నాలుగు రోజులకు మీకు దేవుడు గుర్తొచ్చాడా? ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడి చేయిస్తున్నారు. హిందువులు, వారి దేవుళ్లంటే సీఎం జగన్‌కు ద్వేషం. ఆలయాలపై దాడి చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఆలయాల్లో ఇన్ని జరిగినా సీఎం, డీజీపీ ఎందుకు స్పందించడం లేదు?వాళ్లు చేసిన పనులను మా పార్టీ నేతలకు ఆపాదిస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

రామతీర్థం రణరంగం

02121rama-a.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకే రోజు తెదేపా, భాజపా, వైకాపా నేతల పర్యటనతో విజయనగరం జిల్లా రామతీర్థం రణరంగంలా మారింది. తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటన ముందే ఖరారు కాగా... వైకాపా ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వీరితో పాటు భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ కూడా అక్కడికి చేరుకోవడంతో మూడు పార్టీల కార్యకర్తల పోటా పోటీ ఆందోళనలు, నిరసనలతో రామతీర్థం అట్టుడికింది. పోలీసులు భారీగా మోహరించినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు కంటే ముందే విజయసాయిరెడ్డి రామతీర్థం అలయాన్ని సందర్శించారు. 

పోలీసుల తీరుపై భాజపా నిరసన
 కొండపైకి వెళ్లేందుకు ఎవరికీ అనుమతిలేదని చెప్పిన పోలీసులు విజయసాయిరెడ్డిని అనుమతించడంతో భాజపా శ్రేణులు భగ్గుమన్నాయి. తమను కూడా బోడికొండపైకి అనుమతించాల్సిందేనని ఎమ్మెల్సీ మాధవ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒకవైపు భాజపా నేతల ఆందోళన కొనసాగుతుండగానే విజయసాయిరెడ్డితో పాటు భారీగా వైకాపా నాయకులు కొండపైకి నడుచుకుంటూ వెళ్లి కోదండరాముడి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం కొండదిగి కిందకు వస్తున్న క్రమంలో విజయసాయిరెడ్డి వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. వైకాపా, తెదేపా, భాజపా శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేయడంతో రామతీర్థం రణరంగంగా మారింది. మూడు పార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. భాజపా శిబిరం వద్ద  జరిగిన తోపులాటలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పడిపోయారు. విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేక పోయిన నేతలు పర్యటనకు ఎందుకొచ్చారని విపక్షాలతో పాటు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య విజయసాయిరెడ్డి పర్యటన సాగింది. బోడికొండ దిగువున వైకాపా, తెదేపా, భాజపా శ్రేణులు ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఆందోళనకు దిగారు. మరో వైపు విశాఖ నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థం బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్‌కు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెదేపా నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి రామతీర్థంలో ఉండగానే చంద్రబాబు కాన్వాయ్‌ కూడా అక్కడికి చేరుకుంది. దీంతో చంద్రబాబు కాన్వాయ్‌ మరో మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. చంద్రబాబు రామతీర్థం చేరుకోగానే తెదేపా శ్రేణులు జై శ్రీరామ్‌, జై తెలుగుదేశం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

చర్చకు నేను సిద్ధం: ఎంపీ విజయసాయి

రామతీర్థం బోడికొండపై జరిగిన ఘటన చాలా శోచనీయమని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా తెదేపా అధినేత చంద్రబాబు  వ్యవహరిస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. ఎక్కడికైనా వస్తా చర్చకు రమ్మని లోకేశ్‌ సవాల్‌ విసిరారని.. లోకేశ్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తానని.. చర్చకు సిద్ధంగా ఉన్నట్లు విజయసాయి వెల్లడించారు. నెల్లిమర్లలో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. 

02121rama-b.jpg

2viz1bcc.jpg

 

  • Upvote 2
Link to comment
Share on other sites

2 hours ago, LadiesTailor said:

Religion politics started in AP... 🤦‍♂️🤦‍♂️ 

Better for BJP.

Aina ee ViSa Yeddi gaadiki padaali ley. Power vundhi kadha ani yeedhi padithe adhi vaagatam too much ....151 seats tho ee prapancham mothaanni yeeluthunnaam ani peeling..

  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, kamandalamjalam1 said:

Better for BJP.

Aina ee ViSa Yeddi gaadiki padaali ley. Power vundhi kadha ani yeedhi padithe adhi vaagatam too much ....151 seats tho ee prapancham mothaanni yeeluthunnaam ani peeling..

Adento BJP ekkada party strong chestunna akkada ala kalisi vastayu ento 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Mr Mirchi said:

1. jaggu batch chesi vundalsindhi

2. cbn batch chepinchi vundaali

3. chillara batch without informing their leaders chesi vundali 

 

cc camera lu levaa e temple lo

Aa 3 lo edaina avochu.

but one common aspect aithey undi annitlo. Govt failure

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...