Jump to content

బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి ? అసలు కారణం ఇదే..


Lonelyloner

Recommended Posts

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒకప్పటి హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‏కు రీమేక్.

 

  • Rajitha Chanti
  •  
  • Publish Date - 7:54 am, Mon, 11 January 21
Vijay Sethupathi and Aamir Khan Movie update
 

Ameer Khan And Vijay Sethupathi Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒకప్పటి హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‏కు రీమేక్. ఇక ఇందులో తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం లాల్ సింగ్ చద్దా మూవీ మేకర్స్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో నటించడానికి విజయ్‏ కూడా ఒప్పుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం విజయ్‏ను 25 కిలోల బరువు తగ్గాలని కోరారట చిత్ర బృందం. ఇందుకు విజయ్ కూడా ఒప్పుకున్నాడట. అయితే విజయ్ అనుకున్నంత బరువు తగ్గలేదని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే విషయమై విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన విషయం అటు చిత్ర మేకర్స్ కానీ, విజయ్ సేతుపతి కానీ స్పందించలేదు. మరీ నిజంగానే విజయ్, అమీర్ సినిమా నుంచి తప్పుకున్నాడా ? లేదా ? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక అమీర్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...