Jump to content

డబ్బులకు బదులుగా ల్యాప్‌టాప్‌...


r2d2

Recommended Posts

డబ్బులకు బదులుగా ల్యాప్‌టాప్‌: జగన్‌

అమ్మఒడి పథకం కింద వచ్చే ఏడాది నుంచి డబ్బులకు బదులు, ల్యాప్‌టాప్‌ తీసుకొనే అవకాశం కల్పిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. తొమ్మిదోతరగతి దాటిన వారు, వసతిదీవెన లబ్ధిదారులకు దీనిని వర్తింపజేస్తామన్నారు.  అమ్మఒడి పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను ఆయన నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయాలపై దాడులు, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి ఘాటు విమర్శలు చేశారు.

ఒకటి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు ‘అమ్మఒడి’ పథకం వర్తింప జేస్తామని సీఎం జగన్‌ అన్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉండేవని, ప్రభుత్వ బడులను దిగజార్చి, ప్రైవేటు బడులను ప్రోత్సహించారని విమర్శించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. పేదింటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా.. వారి మేనమామలా ఆదుకుంటున్నానని సీఎం అన్నారు. చదువుకునే వయసున్న ప్రతి పిల్లవాడు బడి బాట పట్టాలని సీఎం ఆకాంక్షించారు.

దేవాలయాలపై దాడుల గురించి మాట్లాడుతూ.. దేవుడిపై ఎన్నడూ భక్తి లేనివారు ఇవాళ కొత్త వేషం కడుతున్నారని సీఎం విమర్శించారు. ‘‘ కొంతమంది ఆలయాల భూములను కాజేశారు. అమ్మవారి గుడిలో క్షుద్రపూజలు చేసిన వారు ఇవాళ కొత్త వేషం కడుతున్నారు. అక్కచెల్లెమ్మల కోసం అడుగులు ముందుకేస్తుంటే అడ్డు తగులుతున్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సీఎం అన్నారు. నిన్న గుడులపై దాడులు చేశారు..రేపు బడులపై దాడులు చేస్తారేమో అని విమర్శించారు. కొవిడ్‌ సమయంలోనూ పేదింటి అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వంపై  నమ్మకం పెరిగిందని సీఎం అన్నారు.

Link to comment
Share on other sites

5 minutes ago, jalsa01 said:

Highly respected tail names de iuntadi 

I heard, manavallu brathakadam kosam edo okati create chesi.. dobbali anta.... 

direct ga money tisukovatam thappu kada... 

Link to comment
Share on other sites

1 hour ago, jalsa01 said:

Ee panchudendhi vay... aa 8K Cr edo infra medha pedite atleast per cr ki oka school lekka 8000 schools ante around 500 schools per district ready avutai kada..

Its all about votes and staying in power. Its never about development 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...