Jump to content

ట్రంప్‌ ట్విటర్‌ షాక్‌: ఇచ్చింది మనమ్మాయే!   


r2d2

Recommended Posts

ట్రంప్‌ ట్విటర్‌ షాక్‌: ఇచ్చింది మనమ్మాయే!   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వ్యక్తిగత ఖాతాలో పాటు, ‘టీమ్‌ ట్రంప్‌’ అనే ఖాతానూ ట్విటర్‌ నిషేధించింది. ఇక ‘ప్రెసిడెంట్‌ ట్రంప్‌’ ప్రభుత్వ ఖాతా కావటంతో నిషేధించలేకపోయినప్పటికీ.. దానిలో పలు వివాదాస్పద ట్వీట్లను తొలగించింది. ఈ చర్యల వెనుక ఆ సంస్థ లీగల్‌ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దే కృషి దాగిఉంది. ‘‘మరిన్ని హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించేందుకు ట్విటర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలను పూర్తిగా తొలగించింది. మా నిర్ణయాల అమలుకు సంబంధించిన విధాన విశ్లేషణను మీరు ఇక్కడ చదవవచ్చు’’ అని ఈ సందర్భంగా ఆమె ట్విటర్‌లో ప్రకటించారు.

హైదరాబాద్‌లో పుట్టి..

హైదరాబాద్‌లో జన్మించిన విజయ చిన్న పిల్లగా ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వలసవెళ్లారు. అక్కడి టెక్సాస్‌, న్యూజెర్సీల్లో ఆమె బాల్యం గడిచింది. కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను, న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటును పొందారు. ట్విటర్‌ కంటే ముందు.. జూనిపర్‌ నెట్‌వర్క్స్‌ , విల్సన్‌ సోన్సినీ గుడ్‌రీచ్‌ అండ్‌ రోసాటీ సంస్థలకు న్యాయసేవలందించారు. కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న విజయ .. ప్రస్తుతం ట్విటర్‌ చీఫ్‌ లీగల్‌‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. అంకుర సంస్థలకు చేయూతనిస్తున్నారు. మహిళలకు సమాన వేతనాల సాధన కోసం కృషిచేసే యాంజెల్స్‌ అనే సమష్టి పెట్టుబడుల సంస్థ సహ-వ్యవస్థాపకురాలు కూడా.

ట్విటర్‌ సీఈఓ నీడలా..

ట్విటర్‌ దశాబ్ద కాలంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాల వెనుక విజయ ప్రభావం ఉంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. రాజకీయ ప్రకటనలను విక్రయించకూడదని ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సీని ఒప్పించడంలో విజయ పాత్రే కీలకం. గతేడాది ట్రంప్‌తో జరిపిన చర్చల్లో, 2018లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, దలైలామా సందర్శన సమయంలో కూడా ఆమె ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సీ వెన్నంటే ఉండటం గమనార్హం.

సాధారణ మహిళలాగానే..

అత్యంత శక్తివంతమైన మీడియా ఎగ్జిక్యూటివ్‌గా ఈమెను అమెరికాలోని పత్రికారంగం అభివర్ణిస్తుంది. ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ట్విటర్‌ పరపతికి అనుగుణంగా.. ఆమె దార్శనికత ఉంటుంది. ఆమె వ్యక్తిగత, కుటుంబ వివరాలు బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియదు. శక్తివంతమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో కీలక పాత్ర వహించే విజయకు.. సాధారణ మహిళల మాదిరిగా సాహిత్యంలో ఫిక్షన్ అంటే ఇష్టమట. అంతేకాకుండా పర్యటనలు, వంటచేయటం తనకు ఇష్టమైన వ్యాపకాలంటారు. ఖాళీ సమయాన్ని తన చిన్నారితో ఆమెకు అత్యంత ఇష్టమైన వ్యాపకం! 

Link to comment
Share on other sites

13 minutes ago, AndhraneedSCS said:

Idhi oka news aa?

 

Entha Legal team unna decision was taken by Jack anedi bahiranga rahasyam 

Credit mingipovadam lo mana desi galla tharvatheeee yevvaraina...

  • Like 1
Link to comment
Share on other sites

4 hours ago, kittaya said:

ninnu dekhanu koodadekhadhu ba

dekhina dekhakapooina farak yeemi padadhu vayya...

The moment they interact/indulge in anything related to Indian politics, her job will be at risk.

They have power only as long as they hold on to the role. Same like CBN. As long as he is in CM chair, he will give an impression that the World is running under his feet.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...