Jump to content

మీది ఉద్యోగం కాదు..స్వచ్ఛంద సేవ! 


r2d2

Recommended Posts

రూ.5వేల గౌరవ భృతి ఇస్తామని మొదట్లోనే చెప్పాం
వాలంటీర్లకు ముఖ్యమంత్రి జగన్‌ లేఖ
మీది ఉద్యోగం కాదు..స్వచ్ఛంద సేవ!

‘వాలంటీర్‌’ అనే పదానికి అర్థమే స్వచ్ఛందంగా సేవలు అందించడం. ఇది ఉద్యోగం కాదు.. స్వచ్ఛంద సేవ. వాలంటీర్లుగా సేవలందిస్తున్న చెల్లెమ్మలూ, తమ్ముళ్లూ ఈ విషయాన్ని గమనించండి’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మంగళవారం ఒక లేఖ రాశారు. ‘జీతాలు పెంచాలని కొద్దిమంది వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డెక్కారన్న వార్త ఎంతో బాధించింది’ అని పేర్కొన్నారు.
వాలంటీర్లకు ఇచ్చే గౌరవభృతి గురించి... వారి సేవలు ప్రారంభించిన సమయంలోనే తాను స్పష్టంగా చెప్పానని, వారికిచ్చిన హ్యాండ్‌బుక్‌లోనూ ఆ విషయాన్ని నిర్వచించామని సీఎం తెలిపారు. ‘హ్యాండ్‌బుక్‌లో నేను రాసిన సందేశంలో చూడండి. లేదా ఆ రోజు నా మాటల్ని గుర్తు తెచ్చుకోండి. ప్రతి వార్డులో 50 ఇళ్లకు ఒకరి చొప్పున సేవాదృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5వేల గౌరవ వేతనంతో గ్రామ/వార్డు వాలంటీరుగా నియమిస్తామని, వారు గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానకర్తలుగా ఉండి.. ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాల్ని ఇంటి వద్దే అందిస్తారని చెప్పాం. వారికి అంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చేవరకూ సేవా దృక్పథంతో ఈ పని చేస్తారన్నాం’ అని సీఎం తెలిపారు. ‘గ్రామ/వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు... అదీ మీకు వీలున్న సమయంలో, అందుబాటులో ఉన్నామని చెబుతూ హాజరు ఇస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలూ లేవు. పని ఉన్నప్పుడే సేవాభావంతో ముందుకొచ్చి పని చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని గడపగడపకూ తీసుకెళ్లేందుకు.. ఇలా నెలలో పని ఉన్న ఆ కొద్దిరోజులు మీ సేవలందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు, దీవెనలు అందుకుంటూ మీరు సంతోషంగా చేస్తున్న కార్యక్రమం ఇది. సేవాభావంతో, ప్రతిఫలాపేక్ష లేకుండా వాలంటీర్‌ అన్న పదానికి అర్థం చెబుతూ మీరు ఇంత గొప్ప సేవ అందించారు కాబట్టే సామాన్యులంతా మిమ్మల్ని ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. మీరు వాలంటీర్లుగా కాకుండా, ఇదే పని జీతాలు తీసుకుని చేస్తుంటే పేద ప్రజల్లో ఒక్కరైనా మీకు ఇలాంటి గౌరవం ఇస్తారా? స్వచ్ఛందంగా కాకుండా ఇదే పని మీరు జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవాన్ని పొందగలరా? వాలంటీర్‌ పేరుతో మీరు చేసేది స్వచ్ఛంద సేవ అవుతుందా? గొప్పగా సేవలందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుంది. అత్యుత్తమ సేవలు అందించినవారికి నియోజకవర్గం ప్రాతిపదికగా ఏటా ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో శాలువా కప్పి మిమ్మల్ని గౌరవిస్తారు. మీ సేవలకు అవార్డుగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీకు దక్కకుండా చేసేందుకు, మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు, మొత్తంగా వాలంటీర్‌ వ్యవస్థే లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురిచేసేవారికి, రెచ్చగొట్టేవారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని మీ శ్రేయోభిలాషిగా, అన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం తెలిపారు.

well played sir!😀

 

 

Link to comment
Share on other sites

10 minutes ago, Thokkalee said:

How do you think CBN would have handled this situation?? 🙂

Elections varaku agi  last month before election raise chestadu. Janalu ongo pedtaru 

Link to comment
Share on other sites

59 minutes ago, chandrabhai7 said:

Elections varaku agi  last month before election raise chestadu. Janalu ongo pedtaru 

Alochistamu ani promise chesi  oka committee vesthadu.. he will buy time and won’t take a decision.. 

Link to comment
Share on other sites

11 hours ago, r2d2 said:

అదీ మీకు వీలున్న సమయంలో, అందుబాటులో ఉన్నామని చెబుతూ హాజరు ఇస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలూ లేవు. పని ఉన్నప్పుడే సేవాభావంతో ముందుకొచ్చి పని చేస్తున్నారు.

Just time pass chesi, 5000 teesukomante Volunteers danni full time job la feel avutunnaru ani anna cheppadu 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Just time pass chesi, 5000 teesukomante Volunteers danni full time job la feel avutunnaru ani anna cheppadu 

vallaki a mukka jobs sorry a seva cheyamani join chesukunnapudu cheppali

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...