Jump to content

‘ఉక్కు’ ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం: జగన్‌!


r2d2

Recommended Posts

ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీలో సీఎం 
‘ఉక్కు’ ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం: జగన్‌

 విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌తో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. విమానాశ్రయంలో జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎంను కోరారు. ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని, దాని వల్ల సొంత గనుల సమస్య తీరుతుందన్నారు. అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు పలు విషయాలపై సుమారు గంటకుపైగా ప్రతినిధులతో సీఎం మాట్లాడారు. 

అలా చేస్తే ప్రైవేటువారికి ఇవ్వక్కర్లేదు!

‘‘స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం. అందరం కలిసి దిల్లీ పెద్దలను పరిశ్రమకు సానుకూలంగా మారుద్దాం. స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు 20వేల ఎకరాల భూములున్నాయి. ఉపయోగించని భూమి కనీసం 7వేల ఎకరాలు ఉంటుందని అంచనా. ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌కు అనుమతిస్తాం. ల్యాండ్‌ యూజ్‌ కన్వర్షన్‌కు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కనుక అభ్యంతరం ఉండదు. భూములను ప్లాట్లు, లేఅవుట్లు వేసి స్టీల్‌ప్లాంట్‌ ద్వారానే విక్రయించాలి. వచ్చిన డబ్బును స్టీల్‌ప్లాంట్‌లోనే పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల పరిశ్రమలో ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సంపన్నంగా మారుతుంది. ఇవన్నీ అమలు చేస్తే ప్రైవేటువారికి ఇవ్వాల్సిన అవసరముండదు. ఇలా చేస్తే ప్రభుత్వ రంగంలోనే స్టీల్‌ ప్లాంట్‌ ఉంటుంది’’ అని ఉక్కు పరిరరక్షణ సంఘం ప్రతినిధులతో సీఎం చెప్పినట్లు తెలిసింది. 

‘‘పోస్కోకు సంబంధించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు నన్ను కలిసిన మాట వాస్తవం. కడప, కృష్ణపట్నం, భావనపాడులో పరిశ్రమ పెట్టాలని వారిని కోరా. ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదని చెప్పా. కడపలో పరిశ్రమ పెడితే బాగుంటుందని కూడా పోస్కో వారికి చెప్పా’’ అని జగన్‌ వారితో చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌, కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

‘ఉక్కు’ ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం: జగన్‌

‘ఉక్కు’ ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం: జగన్‌

‘ఉక్కు’ ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం: జగన్‌

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...