Jump to content

Municipal Elections - Punjab


bhaigan

Recommended Posts

మున్సిపోల్స్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్.. 53 ఏళ్ల తర్వాత బటిండా కైవసం

ఛండీగఢ్: రైతుల ఆందోళనల నేపథ్యంలో పంజాబ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. క్లీన్ స్వీప్ సాధించింది. బీజేపీకి సాగుచట్టాల షాక్ తగిలినట్టు ఫలితాలు సూచిస్తున్నాయి. మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హోషియార్‌పూర్, కపూర్తలా, అబోహర్, పఠాన్‌కోట్, బాటలా, బటిండా, మోగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా, 53 ఏళ్ల తర్వాత బటిండా మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతికి రావడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో సాగుచట్టాలపై ఇది రిఫరెండమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బటిండా లోక్‌సభ నియాజకవర్గానికి శిరోమణి అకాలీదళ్ (సాద్) హర్‌సిమ్రత్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాగు చట్టాలపై విభేదాల నేపథ్యలో ఆమె పార్టీ ఇటీవల బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. బటిండా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మన్ ప్రీత్ సింగ్ బాదల్ (సాద్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బడింటా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కావడంపై మన్ ప్రీత్ సింగ్ బాదల్ హర్షం వ్యక్తం చేశారు.ఇవాళ చరిత్ర సృష్టించాం. 53 ఏళ్ల తర్వాత బటిండాకు కాంగ్రెస్ మేయర్ పదవి వరించింది. ఇంత అద్భుత విజయం అందించిన బటిండా ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు కోసం ఎంతో శ్రమించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు అని మన్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 2,302 వార్డులు, 109 మున్సిపల్ కౌన్సిల్స్‌కు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈనెల 14న జరిగిన జరిగిన ఎన్నికల్లో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

Link to comment
Share on other sites

19 minutes ago, manadonga said:

Adeso bjp last time sweep chesinattu chebutunaruga 

lastt ime elections lo bjp ki enni vachhayi enti 

Last time was decent in triple figures overall SAD won more but ee saari rendu patha gul.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...