Jump to content

pelli ante evadina padalisindhey

manadonga

Recommended Posts

1 minute ago, Somedude said:

Its possibl. But pai pic lo eyes and other features same anipisthundhi. Photo effects and filters use chesi make up kotti manchi dress vesi theesinattundhi.

last time eye check up ki eppudu vellinav :giggle:

Link to comment
Share on other sites

2 minutes ago, Somedude said:

Its possibl. But pai pic lo eyes and other features same anipisthundhi. Photo effects and filters use chesi make up kotti manchi dress vesi theesinattundhi.

Ilanti ghoralu matrimony lo common. There are many people like this.

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Sputnik said:

last time eye check up ki eppudu vellinav :giggle:

You are understaimating the power of makeup, photo effects & filters. Watch this video. She is either same lady or her sister.

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, Somedude said:

You are understaimating the power of makeup, photo effects & filters. Watch this video. She is either same lady or her sister.

em makeup oo...nuvvu ala antu unte...ee news reader kuda ade ammayi emo ani doubt vasthundi  :D

Link to comment
Share on other sites

6 minutes ago, Somedude said:

You are understaimating the power of makeup, photo effects & filters. Watch this video. She is either same lady or her sister.

Sister ani cheppi oka lady tho parichayam chesindhi. That's another cheater lady who is part of their trap.

Link to comment
Share on other sites

5 minutes ago, mirchi_bajji said:

em makeup oo...nuvvu ala antu unte...ee news reader kuda ade ammayi emo ani doubt vasthundi  :D

Ori nee. Aa news reader ni chosinappudu same anipinchindhi naaku kooda. I was just looking at her face and the make up she used not concentrating on the content.

Link to comment
Share on other sites

Just now, Somedude said:

Ori nee. Aa news reader ni chosinappudu same anipinchindhi naaku kooda. I was just looking at her face and the make up she used not concentrating on the content.

Link to comment
Share on other sites

Andharu decoits la ela unnaro choodandri. Dandupalyam movie inspiration emo.

ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు

మాయ మాటలతో వ్యాపారికి రూ.11 కోట్ల టోకరా

ghmain-7a_63.jpg

ఈనాడు, హైదరాబాద్‌/న్యూస్‌టుడే, నిజాంపేట: ఎన్నెన్నో మాయమాటలు.. రూ.11 కోట్ల మోసం.. ఇలాంటి సంఘటనలను సినిమాల్లోనే చూస్తుంటాం. అయ్యో.. ఇలా కూడా మోసపోయే వాళ్లుంటారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యానంటూ అతడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ను అంటూ ఆమె అధికార దర్పంతో అందంగా అబద్ధమాడి ఓ వ్యాపారికి కుచ్చు టోపీ పెట్టారు. చేబదులంటూ కోట్లు కాజేశారు. ఖరీదైన కార్లలో షికారు చేశారు. విలువైన స్థలాలు కొనుగోలు చేసి.. విలాసాలతో తులతూగారు. చివరకు.. మోసం బయటపడటంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ప్రియురాలు సహా మరో నలుగురు కేటుగాళ్ల ఆట కట్టించారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను బుధవారం మాదాపూర్‌ ఇన్‌ఛార్జి డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.

శిరీష చదివింది పదోతరగతి..
కడప పట్టణానికి చెందిన ఉద్దానం శిరీష(39) పదో తరగతి చదివింది. బాల్య వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. పదేళ్ల కిందట ఆయనతో విడిపోయింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో నగరానికొచ్చింది. స్మృతి సింహగా పేరు మార్చుకొని నటనలో శిక్షణ తీసుకొంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో బోరబండలో సింహ సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించింది. వ్యాపార లావాదేవీల్లో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, అవివాహితుడైన అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి(41) పరిచయమయ్యాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో 2017 డిసెంబరులో బాచుపల్లిలోని ప్రణవ్‌ అంటిల్లాలోని విల్లాకు మకాం మార్చారు. పక్క విల్లాలో ఉండే క్రషర్‌ యజమాని పి.వీరారెడ్డి పరిచయం అయ్యాడు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నానని, శిక్షణలో ఏర్పడిన గాయాల కారణంగా తాత్కాలికంగా ఇక్కడికి వచ్చానంటూ విజయ్‌కుమార్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. 72 ట్రావెల్స్‌ బస్సులకు యజమానినని నమ్మించాడు. తన భార్య అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ అని చెప్పాడు. సైరన్‌తో ఖరీదైన కార్లలో తిరుగుతుండటంతో బాధితుడు నిజమేనని భావించి వారితో మరింత సన్నిహితంగా మెలిగాడు.

ghmain-7b_22.jpg

చెల్లెలితో పెళ్లి చేయిస్తానంటూ...
విజయ్‌కుమార్‌రెడ్డి.. తండ్రి రాఘవరెడ్డిని సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా వీరారెడ్డికి పరిచయం చేశాడు. విజయ్‌కుమార్‌ సమీప బంధువులు రణధీర్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా జత కలిశారు. వీరంతా ముఠాగా ఏర్పడి వివిధ కారణాలు చెప్పి చేబదులుగా వీరారెడ్డి నుంచి రూ.11 కోట్లు తీసుకున్నారు. బాధితుడి సోదరుడికి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని స్మృతి సింహ మరో అడుగు ముందుకేసింది. తన సోదరినిచ్చి వివాహం చేస్తానంటూ నమ్మించింది. వేరే యువతి ఫొటోలను పంపించి, గొంతు మార్చి తానే బాధితుడి సోదరుడితో తరచూ మాట్లాడేది. వీరారెడ్డి తిరిగి డబ్బులివ్వమని అడిగితే కాబోయే బంధువులమే కదా అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఆయనకు అనుమానమొచ్చి ఆరా తీయగా ఈ కేటుగాళ్ల మోసం బయటపడింది. అప్పటి నుంచి డబ్బు చెల్లించాలంటూ విజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చాడు. బండారం బయటపడటంతో ఆందోళనకు గురైన విజయ్‌ కుమార్‌ ఈ నెల 5న ప్రగతినగర్‌లోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు వీరారెడ్డిని మోసం చేసినట్లు సెల్ఫీ వీడియో తీసుకొని అందరికీ పంపించాడు. ఈ ఘటనతో అసలు విషయం వెలుగు చూసింది. ఆ మరుసటి రోజే వీరారెడ్డి ఫిర్యాదు చేయడంతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఖరీదైన 5 కార్లు(3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు), రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 46 క్రెడిట్‌ కార్డులు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.

Link to comment
Share on other sites

260221slider-balu-hyd6.jpg

40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!

 కి‘లేడీ’ వ్యవహారంలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు

25hyd-crime1a_6.jpg

ఈనాడు, హైదరాబాద్‌: అదో విలాసవంతమైన హోటల్‌.. సంపన్నులు బస చేసే ప్రత్యేక గది. రోజుకు అద్దె రూ.50 వేలు.. ఇతరత్రా ఖర్చులు మరో రూ.50 వేలు.. అంటే రోజుకు రూ.లక్ష.. అలాంటి చోట నలబై రోజులుండి రూ.40 లక్షలు చెల్లించారు. వాళ్లెవరో కోటీశ్వరులు కాదు.. వ్యాపారవేత్తలూ కాదు. ఐపీఎస్‌ అధికారిగా ప్రియుడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా ప్రియురాలు పరిచయం చేసుకొని బాచుపల్లి ఠాణా పరిధిలో ఓ వ్యాపారికి రూ.11.5 కోట్లు టోకరా వేసిన కేటుగాళ్లు. ఈ కేసులో విస్తుపోయే అంశాలు ఎన్నో దర్యాప్తులో వెలుగు చూడటంతో ఔరా అంటూ సైబరాబాద్‌ పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.
 లైవ్‌ లొకేషన్‌ పంపించమంటే ఆత్మహత్య...
కడపకు చెందిన శిరీష అలియాస్‌ స్మృతి సింహ, విజయ్‌కుమార్‌రెడ్డి మాయమాటలతో వ్యాపారి వీరారెడ్డి నుంచి రూ.11.5 కోట్లు వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానమొచ్చి విజయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రాడూన్‌లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. అయితే.. వాట్సప్‌లో లైవ్‌ లొకేషన్‌ పంపించాలంటూ వీరారెడ్డి సూచించారు. దీంతో మిమ్మల్ని నేను మోసం చేశాను.. శిరీష నన్ను తప్పుదోవ పట్టించింది.. ఐయామ్‌ సారీ అంటూ వాయిస్‌ రికార్డును వీరారెడ్డికి పంపించి ఈ నెల 5న ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ నెల 12న వీరారెడ్డి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. కి‘లేడీ’ సహా ఆమెకు సహకరించిన విజయ్‌కుమార్‌రెడ్డి బంధువులు నలుగుర్ని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 కార్లంటే మహా ఇష్టం.. అందుకే..
వీరారెడ్డి నుంచి వసూలు చేసిన డబ్బులో ఎక్కువ శాతం విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు వెచ్చించినట్లు తెలుసుకొని పోలీసులు  ముక్కున వేలేసుకున్నారు. విజయ్‌కుమార్‌రెడ్డికి కార్లంటే మహా ఇష్టం. రూ.1.8 కోట్లతో బీఎండబ్ల్యూ కారును మొదట కొన్నాడు. ఆ ఫొటోలను వీరారెడ్డికి పంపించాడు. దీంతో ఆయన వీళ్లను పూర్తిగా నమ్మేశారు. ఆ తర్వాత రూ.1.7 కోట్లతో మరో కారు, రూ.70 లక్షలతో ఇంకో కారు కొన్నాడు. ప్రేయసికి పుట్టిన రోజు కానుకగా రూ.50 లక్షల బంగారు ఆభరణాలను బహూకరించాడు. శంషాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్‌లో రూ.40 లక్షలు వెచ్చించి 40 రోజులు బస చేశారు. వైజాగ్‌లోనూ ఎనిమిది రోజులు ఉన్నారు. రూ.1.5 కోట్లతో పటాన్‌చెరులో విల్లాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 లక్షలు చెల్లించారు.
 బంధువులకు అప్పులు...
బంధువుల్లో ఎవరికైనా అవసరమొస్తే సాయం చేసేవారు. ఎంత డబ్బు కావాలంటే అంత చేబదులు ఇచ్చేవారు. చిన్న చిన్న మొత్తాలైతే తిరిగి అడిగేవారు కాదు. ఈ తరహాలోనే ఒకరికి రూ.40 లక్షలు ఇవ్వగా.. ఆయన పొలం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఇద్దరిపై బంధువుల్లో గౌరవం పెరిగింది. ఇంత తక్కువ కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించారంటూ విజయ్‌కుమార్‌రెడ్డిని తండ్రి రాఘవరెడ్డి (సీఐఎస్‌ఎఫ్‌లో ఏఎస్‌ఐ), ఇతర బంధువులు ప్రశ్నించారు. జరిగిన విషయమంతా చెప్పడంతో వాళ్లు కూడా జత కలిశారు. సీఐఎస్‌ఎఫ్‌లో డీసీపీ ర్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడంటూ రాఘవరెడ్డిని వీరారెడ్డికి పరిచయం చేశారు. రకరకాల టెండర్లు ఇప్పిస్తామని, వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూస్తానంటూ అతను, ఇతర బంధువులు కూడా డబ్బు తీసుకొన్నారు.
 అమ్మకు ఆరోగ్యం బాగా లేదంటూ...
వీరారెడ్డిని ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌ చాలా తెలివిగా ముగ్గులోకి దింపాడు. తొలుత ‘‘మా అమ్మకు బాగాలేదు.. వైద్యం చేయించాలి.. అవసరానికి నా బ్యాంకు ఖాతా ఫ్రీజ్‌ అయ్యింది.. కార్డులు కూడా పనిచేయడం లేద’’ంటూ బురిడీ కొట్టించి తొలుత రూ.3.5 లక్షలు తీసుకొన్నాడు. ఆ తర్వాత తనకున్న 72 ట్రావెల్స్‌ బస్సుల ధ్రువీకరణ పత్రాలను రెన్యూవల్‌ చేయించాలంటూ మరో రూ.10 లక్షలు తీసుకున్నాడు. స్మృతి సింహ అలియాస్‌ శిరీష మానవ హక్కులకు సంబంధించిన సెమినార్లు, ఇతరత్రా సమావేశాలు నిర్వహించేందుకు డబ్బు కావాలని అడిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బిల్లులు డ్రా చేసి ఇస్తానంటూ బురిడీ కొట్టించింది.

Link to comment
Share on other sites

On 2/25/2021 at 4:48 AM, Somedude said:

Andharu decoits la ela unnaro choodandri. Dandupalyam movie inspiration emo.

ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు

మాయ మాటలతో వ్యాపారికి రూ.11 కోట్ల టోకరా

ghmain-7a_63.jpg

ఈనాడు, హైదరాబాద్‌/న్యూస్‌టుడే, నిజాంపేట: ఎన్నెన్నో మాయమాటలు.. రూ.11 కోట్ల మోసం.. ఇలాంటి సంఘటనలను సినిమాల్లోనే చూస్తుంటాం. అయ్యో.. ఇలా కూడా మోసపోయే వాళ్లుంటారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యానంటూ అతడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ను అంటూ ఆమె అధికార దర్పంతో అందంగా అబద్ధమాడి ఓ వ్యాపారికి కుచ్చు టోపీ పెట్టారు. చేబదులంటూ కోట్లు కాజేశారు. ఖరీదైన కార్లలో షికారు చేశారు. విలువైన స్థలాలు కొనుగోలు చేసి.. విలాసాలతో తులతూగారు. చివరకు.. మోసం బయటపడటంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ప్రియురాలు సహా మరో నలుగురు కేటుగాళ్ల ఆట కట్టించారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను బుధవారం మాదాపూర్‌ ఇన్‌ఛార్జి డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.

శిరీష చదివింది పదోతరగతి..
కడప పట్టణానికి చెందిన ఉద్దానం శిరీష(39) పదో తరగతి చదివింది. బాల్య వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. పదేళ్ల కిందట ఆయనతో విడిపోయింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో నగరానికొచ్చింది. స్మృతి సింహగా పేరు మార్చుకొని నటనలో శిక్షణ తీసుకొంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో బోరబండలో సింహ సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించింది. వ్యాపార లావాదేవీల్లో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, అవివాహితుడైన అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి(41) పరిచయమయ్యాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో 2017 డిసెంబరులో బాచుపల్లిలోని ప్రణవ్‌ అంటిల్లాలోని విల్లాకు మకాం మార్చారు. పక్క విల్లాలో ఉండే క్రషర్‌ యజమాని పి.వీరారెడ్డి పరిచయం అయ్యాడు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నానని, శిక్షణలో ఏర్పడిన గాయాల కారణంగా తాత్కాలికంగా ఇక్కడికి వచ్చానంటూ విజయ్‌కుమార్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. 72 ట్రావెల్స్‌ బస్సులకు యజమానినని నమ్మించాడు. తన భార్య అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ అని చెప్పాడు. సైరన్‌తో ఖరీదైన కార్లలో తిరుగుతుండటంతో బాధితుడు నిజమేనని భావించి వారితో మరింత సన్నిహితంగా మెలిగాడు.

ghmain-7b_22.jpg

చెల్లెలితో పెళ్లి చేయిస్తానంటూ...
విజయ్‌కుమార్‌రెడ్డి.. తండ్రి రాఘవరెడ్డిని సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా వీరారెడ్డికి పరిచయం చేశాడు. విజయ్‌కుమార్‌ సమీప బంధువులు రణధీర్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా జత కలిశారు. వీరంతా ముఠాగా ఏర్పడి వివిధ కారణాలు చెప్పి చేబదులుగా వీరారెడ్డి నుంచి రూ.11 కోట్లు తీసుకున్నారు. బాధితుడి సోదరుడికి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని స్మృతి సింహ మరో అడుగు ముందుకేసింది. తన సోదరినిచ్చి వివాహం చేస్తానంటూ నమ్మించింది. వేరే యువతి ఫొటోలను పంపించి, గొంతు మార్చి తానే బాధితుడి సోదరుడితో తరచూ మాట్లాడేది. వీరారెడ్డి తిరిగి డబ్బులివ్వమని అడిగితే కాబోయే బంధువులమే కదా అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఆయనకు అనుమానమొచ్చి ఆరా తీయగా ఈ కేటుగాళ్ల మోసం బయటపడింది. అప్పటి నుంచి డబ్బు చెల్లించాలంటూ విజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చాడు. బండారం బయటపడటంతో ఆందోళనకు గురైన విజయ్‌ కుమార్‌ ఈ నెల 5న ప్రగతినగర్‌లోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు వీరారెడ్డిని మోసం చేసినట్లు సెల్ఫీ వీడియో తీసుకొని అందరికీ పంపించాడు. ఈ ఘటనతో అసలు విషయం వెలుగు చూసింది. ఆ మరుసటి రోజే వీరారెడ్డి ఫిర్యాదు చేయడంతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఖరీదైన 5 కార్లు(3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు), రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 46 క్రెడిట్‌ కార్డులు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.

nice cars

Link to comment
Share on other sites

11 కోట్ల మోసం కేసులో కొత్త కోణాలు..

02272021102031n16.jpg

  • నన్ను క్షమించు అక్కా!
  • ప్రేమ మైకంలో మిమ్మల్ని మోసం చేశా..
  • ఆత్మహత్యకు ముందు వీరారెడ్డి భార్యకు విజయ్‌కుమార్‌ ఫోన్‌
  • వద్దని వారించిన వీరారెడ్డి భార్య
  • పోలీసుల చేతికి కాల్‌ రికార్డులు 
  •  

హైదరాబాద్ : ‘‘అక్కా నన్ను క్షమించు.. మాయలాడి ప్రేమ మైకం నన్ను కమ్మేసింది. ఆ మత్తులో పడి దారి తప్పాను. తేరుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే పశ్చాతాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నా. నీకు నా ముఖం చూపించలేను. సమాజంలో తలెత్తుకొని బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’.. ఇటీవల సంచలనం సృష్టించిన రూ. 11కోట్ల మోసం కేసులో ఆత్మహత్య చేసుకున్న విజయ్‌కుమార్‌ రెడ్డి చివరి సంభాషణ ఇది. ఈ నెల 24న బాచుపల్లిలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిజాంపేట్‌లో ఘరానా కి‘లేడీ’ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌రెడ్డి తన ఆత్మహత్యకు ముందు బాధితుడి భార్యకు ఫోన్‌ చేసి ఆ విషయాన్ని తెలిపాడు. పోలీసుల విచారణలో ఆడియో కాల్‌ రికార్డుల ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది. 

రూ. 10.60కోట్లు కొల్లగొట్టిన జంట..

కడప జిల్లాకు చెందిన శిరీష అలియాస్‌ స్మృతి సిన్హా, విజయ్‌కుమార్‌రెడ్డికి నగరంలో పరిచయమైంది. అది సహజీవనం వరకూ వెళ్లింది. ఇద్దరికీ విలాసవంతమైన జీవితం పట్ల సరదా. అయితే.. విజయ్‌ను పావుగా వాడుకుని రూ. కోట్లు సంపాదించాలని శిరీష పథకం రచించింది. అప్పటికే తనకు పిల్లలున్నా.. వాళ్లను తన అక్క పిల్లలుగా నమ్మించి, విజయ్‌కు దగ్గరైంది. నిజాంపేటలోని ప్రణవ్‌ అంటీలియా విల్లాలో విజయ్‌తో కలిసి అద్దెకు దిగింది. అక్కడ వారి పక్క విల్లాలో ఉంటున్న మైనింగ్‌ వ్యాపారి వీరారెడ్డితో వీరికి పరిచయమైంది. విజయ్‌ను ఐపీఎస్‌ అధికారిగా, తాను మానవహక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) దక్షిణభారత చైర్మన్‌గా వీరారెడ్డిని నమ్మించింది. విజయ్‌ కూడా ఆమె చెప్పినట్లే నడుచుకున్నాడు. కడపలో తమకు 72 వోల్వా బస్సులు, 50 ఎకరాల పొలం ఉందని ఇద్దరూ గొప్పగా చెప్పుకొన్నారు. 

వీరారెడ్డి స్వస్థలం కూడా కడప జిల్లా కావడం, అందరూ ఒకే సామాజిక వర్గం కావడంతో అతడు వారిని విశ్వసించాడు. మైనింగ్‌ (క్రషర్‌ బిజినెస్‌) వ్యాపారం చేస్తున్న వీరారెడ్డి కోటీశ్వరుడని తెలిసి అతని నుంచి డబ్బు లాగేందుకు శిరీష పక్కా స్కెచ్‌ వేసింది. వీరారెడ్డి బావమరిదికి రూ. 90కోట్లు కట్నమిచ్చే అమ్మాయితో సంబంధం కుదురుస్తామని, తక్కువ ధరకు కడపలో పొలాలు కొనుగోలు చేయిస్తామని నమ్మబలికింది. వారిని నమ్మి, వారు అడిగినప్పుడల్లా వీరారెడ్డి డబ్బు ఇచ్చాడు. ఇలా మొత్తం రూ. 10.60కోట్లను రెండేళ్లలో శిరీష, విజయ్‌ కొల్లగొట్టారు. ఆ డబ్బుతో విలాసాలను అనుభవించారు. శంషాబాద్‌ పరిధిలోని ఓ లగ్జరీ హోటల్‌లో, వైజాగ్‌లో రోజుకు రూ. లక్ష చెల్లిస్తూ 50 రోజుల పాటు వేడుకలు చేసుకున్నారు. రూ. కోట్లు విలువైన కార్లు, రూ. లక్షల విలువైన బంగారం, పటాన్‌చెరు ప్రాంతంలో రూ. కోటిన్నరతో విల్లా కొనుగోలు చేశారు. శిరీష మైకంలో పడిన విజయ్‌ కుమార్‌.. ఆమె చెప్పినట్లే చేస్తూ వీరారెడ్డిని మోసం చేశాడు.

పశ్చాత్తాపంతో ఆత్మహత్య

ఏ మోసమూ ఎల్లకాలం సాగదు. ఎట్టకేలకు శిరీష-విజయ్‌ల బాగోతం వీరారెడ్డికి స్నేహితుల ద్వారా తెలిసింది. దీంతో తన డబ్బు తిరిగివ్వాలని  వారిని హెచ్చరించాడు. దీంతో విజయ్‌కు ఏం పాలుపోలేదు. మరోవైపు.. శిరీష పిల్లల విషయంలో తనకు అబద్ధం చెప్పి తనను వాడుకుందని అతడికి అర్ధమైంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో పశ్చాత్తాపంతో బాధపడిన విజయ్‌, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే.. అంతకంటే ముందు వీరారెడ్డి భార్యకు ఫోన్‌ చేసి క్షమాపణ కోరాడు. అతడి ఆత్మహత్య నిర్ణయం విని వీరారెడ్డి భార్య వారించింది. ‘‘నువ్వు చనిపోవద్దు తమ్ముడూ! నిన్ను ఇలా చేసిన వారిని వదలొద్దు. మాయలేడి చేతికి చిక్కి మోసపోయిన నువ్వు చనిపోతే, మాకు ఎలా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా, మగాడిలా మా డబ్బులు మాకు వచ్చేలా చెయ్‌. అంతేకాని ఆత్మహత్య చేసుకోవద్దు’’ అని ఆమె హితవు చెప్పింది. అయినప్పటికీ విజయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ సంభాషణకు సంబంధించిన కాల్‌ రికార్డ్స్‌ సైబారాబాద్‌ పోలీసుల చేతికి వచ్చాయి. మరోవైపు వీరారెడ్డికి అంతకుముందు పెద్దవాళ్లతో పరిచయాలు లేనట్లు పోలీసులు తెలిపారు. శిరీ్‌ష-విజయ్‌ల పరిచయంతో సమాజంలో తనకూ పలుకుబడి పెరుగుతుందని భావించి, వారు అడిగినంతా ముట్టచెప్పాడని వివరించారు. వారి మోసానికి వీరారెడ్డి స్వార్థం తోడవడంతో కథ ఇంత దూరం వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు.. శిరీష బాధితులు ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె పోలీసులకు చిక్కడంతో.. ఆమె చేతిలో మోసపోయిన వారంతా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా బాధితులు పదుల సంఖ్యలోనే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కస్టడీకి నిందితులు

శిరీష సహా అరెస్టు చేసిన నిందితులందరినీ బాచుపల్లి పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఈ మేరకు కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. శిరీష అలియాస్‌ స్మృతి సిన్హా ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసింది..? ఖరీదైన కార్లు, రూ. లక్షల విలువైన బంగారం, పటాన్‌చెరులో రూ. కోటిన్నర విల్లా, బ్యాంకు ఖాతాల్లో డబ్బు.. ఇలా మొత్తంగా సుమారు రూ. 5.50కోట్ల చేతిలో ఉన్నప్పటికీ విజయ్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, అతడి మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా, అన్న ప్రశ్నలకు సమాధానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...