Jump to content

ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతి !


r2d2

Recommended Posts

ప్రభుత్వ రంగంలో 1,33,899 ఉద్యోగాలు
 ప్రైవేటు రంగంలో 14 లక్షల కొలువులు
 నిజాలను జీర్ణించుకోలేని విపక్షాలు
 మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ
ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతి

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో తిరుగులేని ప్రగతిని సాధించి దేశంలో మొదటి స్థానంలో ఉందని, నిజాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్‌, భాజపా, ఇతర విపక్షాలు దుష్ప్రచారానికి పూనుకున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీపై  రాష్ట్ర ప్రజలను, యువతను అయోమయానికి, గందరగోళానికి చేస్తున్నాయన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్‌ రాజకీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లె వేసేందుకే మొగ్గు చూపడం బాధాకరమని అన్నారు.  2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తమ ప్రభుత్వ నిబద్ధతపై ఎవరికైనా అనుమానం ఉంటే ఆయా శాఖల్లో ధ్రువీకరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే ప్రైవేటు రంగంపైనా దృష్టి సారించామని, విప్లవాత్మకమైన టీఎస్‌ఐపాస్‌ విధానంతో ప్రైవేటులో సుమారు 14 లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు. తెరాస హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో ఆయన గురువారం బహిరంగ లేఖను విడుదల చేశారు. వీటిని చూసైనా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...