Jump to content

ఆంధ్ర జన్మనిచ్చింది-తెలంగాణ పునర్జన్మనిచ్చింది


Somedude

Recommended Posts

ఆంధ్ర జన్మనిచ్చింది-తెలంగాణ పునర్జన్మనిచ్చింది

twitter-icon.pngwatsapp-icon.pngfb-icon.png

 

  • మార్చి 14 లోపు రాష్ట్ర కమిటీలు
  • వీరమహిళ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఏ ఆశయాలకోసమైతే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందో ఆ ఆశయాల కోసం జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఆంధ్రప్రాంతం జన్మనిస్తే,  తెలంగాణ ప్రాంతం తనకు పునర్జన్మ నిచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన వీరమహిళ రాష్ట్ర విభాగం సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ యువత, ఆడపడుచుల్లో బలమైన భావోద్వేగాలున్నాయన్నారు. తెలంగాణ సిరిసంపదల నేల అని, న్యాయం కోసం గళమెత్తే నేల అని కొనియాడారు. ఈ నేలంటే తనకు చాలా ప్రేమన్నారు. తనలో రాజకీయ చైతన్యం నింపి, ధైర్యాన్ని ఇచ్చిన నేల ఇదని చెప్పారు.

 

జనసేన పార్టీ పురుడు పోసుకుందే తెలంగాణ గడ్డ మీద అన్నారు. భవిష్యత్‌ కోసం సామాజిక బాధ్యతతో పార్టీ పెట్టినట్లు తెలిపారు. తమ్ముడు సినిమా 100 రోజుల వేడుక వదులుకొని ఆ డబ్బుతో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసి్‌సతో బాధపడుతున్న గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్నానని,  అయితే అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారని చెప్పారు.  ఒక మంచి చేయాలంటే స్వచ్ఛంద సంస్థ సరిపోదని, కచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనకు ఆ సంఘటనే ప్రేరణగా నిలిచిందన్నారు. డబ్బిస్తేగానీ ఓటుపడని పరిస్థితికి దేశం వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 లోపు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి, పార్టీ నిర్మాణానికి తొలి అడుగు వేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అర్హం ఖాన్‌, ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Link to comment
Share on other sites

15 hours ago, snoww said:

Inthaki andhra vallani TG lo roads meeda inka koduthunnaro ledo update ichada GOD PK. 

 

14 hours ago, ChinnaBhasha said:

adaithe peaks 😂 pichi pushpam gadu

yes jagan teddy valla ayya yesu teddy cheppinattu Andhra vallu visa ticukoni Hyderabad vastunnaru

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...