Jump to content

జూనియర్‌ సామ్‌తో పవన్‌ డిస్కషన్‌ ..


r2d2

Recommended Posts

జూనియర్‌ సామ్‌తో పవన్‌ డిస్కషన్‌: ‘‘నా దేవుడిని కలిశాను. ఎంతో ఆనందంగా ఉంది.’’ అని అంటున్నారు నటి అషూ రెడ్డి. డబ్‌స్మాష్‌తో వెలుగులోకి వచ్చి, తన లుక్స్‌తో అగ్ర కథానాయిక సమంతను తలపించి.. జూనియర్‌ సామ్‌గా పేరు తెచ్చుకున్నారు అషూ. సోషల్‌మీడియా ప్లాట్‌‌ఫామ్స్‌, బుల్లితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఆమె పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సందర్భంగా జరిగిన విషయాలను అషూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

జూనియర్‌ సామ్‌తో పవన్‌ డిస్కషన్‌

‘‘చాలారోజుల తర్వాత నా దేవుడ్ని కలిశాను. నేను, ఆయన కోసం నేను వేయించుకున్న టాటూ ఇంకా గుర్తున్నాయని పవన్‌ చెప్పారు. రెండు గంటలపాటు మేం మాట్లాడుకున్నాం. ఆయన దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నాకో ఉత్తరం ఇచ్చారు’’ అంటూ పవన్‌తో దిగిన ఫొటోని షేర్‌ చేశారు అషూ రెడ్డి. దాంతోపాటు పవన్‌ ఇచ్చిన లెటర్‌ను కూడా అభిమానులతో పంచుకుంది ఈ భామ. ఆఖరున ‘పవన్‌కల్యాణ్‌.. నువ్వు ఎప్పటికీ నా మొదటి ప్రేమవే’’ అంటూ పవన్‌ మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసింది అషూ రెడ్డి. 

జూనియర్‌ సామ్‌తో పవన్‌ డిస్కషన్‌

ఆ అకౌంట్‌ క్రిష్‌ది కాదు

దర్శకుడు క్రిష్‌కు సంబంధించిన ఓ సోషల్‌మీడియా అకౌంట్‌ గురించి నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలని నటి అషూ రెడ్డి సూచించారు. క్రిష్‌కు ఇన్‌స్టా అకౌంట్‌ లేదని.. కాబట్టి ఆయన పేరుతో ఉన్న ఖాతాలను ఫాలో అవ్వొద్దని ఆమె తెలిపారు. ఈ మేరకు అషూ ఇన్‌స్టాలో సరికొత్త పోస్ట్‌ పెట్టారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...