యథేచ్ఛగా బెదిరింపులు
చివరి రోజు పోటీ నుంచి వైదొలగిన పలువురు తెదేపా అభ్యర్థులు
ఇతర విపక్ష పార్టీల అభ్యర్థులకూ బెదిరింపులు
చివరి నిమిషం వరకూ ఆగని ఉపసంహరణల పర్వం
ప్రలోభాలు, ఒత్తిళ్లే కారణమన్న విపక్షం
ఈనాడు, అమరావతి: పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం కూడా బెదిరింపుల పర్వం కొనసాగింది. ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడి కొన్నిచోట్ల తెదేపా అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు తెదేపా నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. వారి