Jump to content

ఓ ఎన్నారై చరిత్ర - By మల్లాది వెంకట కృష్ణమూర్తి 

sri_india

Recommended Posts

  @Ellen @kakatiya @dasari4kntr 

chala old writing by మల్లాది వెంకట కృష్ణమూర్తి , not all relevant today but NRI life cycle is almost like this  

ఓ ఎన్నారై చరిత్ర - By మల్లాది వెంకట కృష్ణమూర్తి 

మొదటి ఆరునెలలు:సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లుతీసుకుంటాడు.అక్కడి రోడ్ల మీదడ్రైవ్‌ చేయడంలోని భయాన్ని కొద్దిగా జయించాక సెకండ్‌హ్యాండ్‌ కారునొకదాన్ని కొంటాడు. 500 డాలర్లు ఖర్చుచేసిఇండి యాలోని తన బంధుమిత్రులందరితో ఫోన్‌లో మాట్లాడతాడు. సబ్‌వే, మెక్‌డోనాల్డ్స్‌, వెండీస్‌లలోని ఫాస్ట్‌ఫుడ్స్‌తింటాడు.

తర్వాతి ఆరునెలలు:తన బ్యాంక్‌ అక్కౌంట్‌లో తక్కువ మొత్తం ఉందని గ్రహిస్తాడు. ముగ్గురుండే అపార్ట్‌మెంట్‌ నుంచి ఆరుగురు అద్దెకుండే అపార్ట్‌మెంట్‌కి మారతాడు. స్వంతకారులో ఆఫీస్‌కి వెళ్లకుండా, ఇంకో ముగ్గురితో కలిసి మరొకరి కారులో పెట్రోల్‌ ధరని షేర్‌చేస్తూ వెళ్తాడు. ఇండియాలోని ముఖ్యమైన వాళ్లతోనే ఫోన్‌లో అవసరం మేరకే మాట్లాడతాడు. ఇపడు ఫోన్‌ బిల్‌ 250 డాలర్లకి మించదు.

ఆ తర్వాతి ఆరునెలలు:వంట చేతనైంది. కొందరు మిత్రులు ఏర్పడ్డారు. ఇండియాలో కాశీ, రామేశ్వరం వెళ్లడం ఎలా ఆనవాయితీనో, అమెరికాలో నయాగరా జలపాతానికి వెళ్లడం అలా ఆనవాయితీ కాబట్టి అక్కడికి వెళ్ళొస్తాడు. అలాగే న్యూయార్క్‌ వైట్‌హౌస్‌లని కూడా చూస్తాడు. చలికి తన డొక్కు కారు స్టార్ట్‌ కాకపోవడంతో కొత్తకారు కొనే ఆలోచన చేస్తాడు.

తర్వాతి మూడు నెలలు:ఒంటరిగా ఫీలై పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన చేస్తాడు. ఇంటికి ఫోన్‌ చేసినపడల్లా భోజనం ఇబ్బంది గురించి చెప్తుంటాడు.

తర్వాతి మూడు నెలలు:తనకో వధువుని చూడమని తల్లిని కోరతాడు. అతను పనిచేసే కంపెనీ గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేయమని సూచిస్తుంది. సమస్య ఎదురవుతుంది. 10కె జీతానికి కొత్త ఉద్యోగంలోకి మారాలా? లేక ఇపడు పనిచేసే కంపెనీలోనే 5కె జీతానికే కొనసాగుతూ గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేయాలా?

తర్వాతి మూడు నెలలు:ఛీప్‌ ఎయిర్‌లైన్స్‌ టికెట్ల కోసం ఇంటర్నెట్‌లో వేట. ఇండియాకి ఓ విమానం టిక్కెట్‌ కొంటాడు. హర్దీస్‌ చాక్లెట్స్‌, సేల్‌లో టీషర్ట్‌లు, మిత్రులకి పెన్‌డ్రైవ్‌, చెల్లెలికి ఐ పాడ్‌, తండ్రికి క్వేకర్‌ ఓట్‌మీల్‌ ప్యాకెట్లు బహుమతులుగా కొంటాడు.కొన్ని పెళ్ళిచూపులు, తల్లితండ్రులతో కొంత చర్చ తర్వాత మూడువారాల తర్వాత అమెరికాకి తిరిగి వస్తాడు-పెళ్లాంతో (మిగిలిన భారతీయుల్లాగా ఇంత అదృష్టవంతులు కాదు. ముహూర్తం దొరక్క ఆరు నెలల తర్వాత వాళ్ళు పెళ్లిచేసుకోవడానికి మళ్లీ ఇండియాకి డబ్బు, సెలవు ఖర్చు చేసుకుని వెళ్లాలి)

తర్వాతి ఆరు నెలలు:మళ్లీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తక్కువైపోయింది. ఇండియా ట్రిప్‌కి, ఇంటి సామానుకి చాలా సేవింగ్స్‌ ఖర్చయ్యాయి. మరో రెండేళ్లదాకా ఇండియాకి వెళ్లలేడు. అందులో ఇప్పుడు కదిలితే ఇంకో అదనపు టిక్కెట్‌ తో కదలాలి. పైగా గ్రీన్‌కార్డ్‌ సంపాదించుకోవాలి.

రెండేళ్ల తర్వాత:ఇండియాకి వస్తాడు.ప్రతీ డాలర్‌ని లెక్కచూసి ఖర్చుచేస్తాడు. తనవైపు వారికన్నా తన భార్య వైపు వారికి ఎక్కువ బహుమతులు కొంటాడు (కొంటుంది). ఇండియాలో పనిచేసే తన మిత్రుల జీతాలు బాగా పెరిగాయని గమనిస్తాడు, ధరలు కూడా. అపడు బంజారాహిల్స్‌లో కొనాలనుకున్న ఫ్లాట్‌ ధరకి ఇప్పుడు మలక్‌పేట్‌లో కూడా ఫ్లాట్‌ రాదని గ్రహిస్తాడు. విజయవాడలో రావచ్చు తను అనుకున్నట్లుగా మరో మూడేళ్లల్లో ఇండియాకి వెనక్కి తిరిగి రాలేడు. ఇల్లుంటుంది కానీ క్యాష్‌ ఉండదు. కనీసం ఆరేళ్ళు కష్టపడాలని నిస్ప్రృహగా గ్రహిస్తాడు.

అమెరికాలో మూడేళ్ళు:కూతురు పుట్టింది. డెలివరీకి సహాయంగా అత్తగారు వచ్చి వెళ్లింది. బిపి, షుగర్‌ ఉన్న ఆవిడ ఎక్కడ మంచానపడుతుందో అని భయపడ్డాడు. ఉన్న కాస్తా హాస్పిటల్‌కి ఖర్చయిపోతుంది. అత్తగారు, మామగారు వెళ్ళాక తల్లితండ్రి మనవరాల్ని చూడడానికి వెళ్ళి ఆర్నెల్లుండి వెళ్లారు.కూతురు బదులు కొడుకు పుట్టి ఉంటే బావుం డేదనుకున్నాడు. మరో 7-8 ఏళ్ళ తర్వాత తప్పనిసరిగా ఇండియాకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. 12 దాటితే కూతురికి అమెరికన్‌ టీనేజర్స్‌కి ఉండే చెడ్డ అలవాట్లన్నీ ఒంటపడతాయి. తను సహించలేడది.

నాలుగేళ్ల తర్వాత:పెళ్ళయ్యాక ఇండియాకి రెండో ట్రిప్‌ అది. ఇండియాలోని పరిస్థితులు చూశాక అక్కడికి తిరిగి వచ్చే ఆశ నాలుగింట మూడువంతులు తగ్గిపోతుంది. ధరలు ఇంతలా పెరిగాయేమిటి? దోమలు, దుమ్ము, చెడ్డరోడ్లని మొదటిసారిగా పెద్ద సమస్యలాగా గుర్తించాడు. దోమలు కుట్టకుండా కూతురికి రక్షణగా దోమతెర కొంటే సోదరి ఆక్షేపించింది. ఇండియన్‌ బాత్‌రూంని కూతురు అసహ్యించుకోవడంతో దాన్ని అమెరికన్‌ బాత్‌రూంగా మార్పించాడు. విమానంలో చెప్పింది భార్య, తను ఇండియాకి వెనక్కి రానని, అమెరికా తనకి నచ్చిందని. అత్తగారి పోరు లేదుట.

తర్వాతి కొన్ని సంవత్సరాలు:ప్రతీ డిసెంబర్‌కీ భార్య తన కూతురితో ఇండియాకి వచ్చి అందరికీ పోజ్‌ కొట్టి తిరిగి అమెరికా వెళ్తోంది. తన కూతురికి ఇండియన్‌ కల్చర్‌ నచ్చవచ్చన్న నమ్మకంతో ఆ ఖర్చులు భరిస్తున్నాడు తండ్రి. అలా అయితే కూతురు చెడిపోకపోవచ్చు.ప్రతిసారీ ఇంటినించి ఫిర్యాదు కోడలు తక్కువ కాలం అత్తింట్లో ఎక్కువ కాలం పుట్టింట్లో ఉంటోందని.కూతుర్ని భరతనాట్యం క్లాస్‌లో చేర్పించాడు. కొడుకుని వీణక్లాస్‌లో చేరమంటే వాడు రెండు నెలల తర్వాత గిటార్‌కి షిఫ్ట్‌ అయిపోయాడు ఎంత బతిమాలినా వినకుండా. ఇండియా వదిలి చాలాకాలం అయినా తను ఇండియాని మరిచిపోలేదని ఆత్మసంతృప్తి.

మరో పదేళ్ల తర్వాత:మనవాడిపడు ఏభయ్యవ పడిలో పడ్డాడు. అకస్మాత్తుగా ఇండియన్‌ సంస్కృతి గుర్తొచ్చి మోజు పెరిగింది. ఉదయం ఆరుకి సుబ్బలక్ష విష్ణు సహస్ర నామం, కార్లో ఆఫీస్‌కి వెళుతూ చిన జీయర్‌స్వామి భగవద్గీత వింటున్నాడు. చిక్కడపల్లిలోని స్వరాజ్యహోటల్‌, అబిడ్స్‌లోని మధుబార్‌, రాంనగర్‌లోని చలమయ్య మెస్‌లోని భోజనం అన్నీ గుర్తుకువచ్చి ఇండియాకి వచ్చాడు. అవేమీలేవు. ఇండియన్స్‌ తమ సంస్కృతిని మర్చిపోతున్నారని బాధపడ్డాడు. విజయనగర్‌కాలనీలో ఓ ఫ్లాట్‌ని కొన్నాడు. ఇంకో రెండేళ్లల్లో తను తిరిగి వచ్చేస్తున్నానని డిక్లేర్‌ చేశాడు.

ఇండియా విడిచిన 25 ఏళ్ళ తర్వాత:మొత్తానికి ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. అతని కూతురు, కొడుకు ఇండియాకి రాంపొమ్మన్నారు. వాళ్ళు ఏ స్టీవ్‌, సూసన్‌లనో చేసుకుని అక్కడే ఉండిపోతారు. భార్య అమెరికన్‌, ఇండియన్‌ కల్చర్‌లని చక్కగా బ్యాలెన్స్‌ చేసుకుంటోంది. 

ఇపడు అరవయ్యో పడిలో పడ్డ మన హీరో బిర్లామందిర్‌కి ఇతర ఆలయాలకి, మిత్రుల ఫ్లాట్స్‌కి వెళ్తూ కాలం గడుపుతున్నిడు. మిత్రుల పిల్లలంతా ఓణీలు కట్టడం లేదు.అమెరికన్‌ టీషర్ట్‌లని, జీన్స్‌ ప్యాంట్లని, హాఫ్‌ స్కర్ట్స్‌ని ధరిస్తున్నారు. ఎంటివి చూస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఎక్కువకాలం గడుపుతూ ఐపాడ్‌ని తగిలించుకుంటున్నారు. తన మిత్రుల పిల్లలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇండియన్స్‌ని అమెరికన్‌ కల్చర్‌ నాశనం చేస్తోందని మన హీరో వాపోతున్నాడు.

  • Sad 1
  • Upvote 2
Link to comment
Share on other sites

5 hours ago, sri_india said:

Nice story.... appatiki ippatiki eppatiki all men feel the same anukunta... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...