Jump to content

మిఠాయితో మత్తిచ్చి అత్యాచారం


Mirage

Recommended Posts

నగ్న వీడియోలు, ఫొటోల చిత్రీకరణ
వాటితో బెదిరింపులు.. రెండుసార్లు గర్భస్రావం

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగ్న వీడియోలతో తనను బెదిరించి లొంగదీసుకుని.. పెళ్లి చేసుకుని.. బలవంతంగా మతమార్పిడి చేయడంతో పాటు.. తనను చిత్రహింసలు పెట్టి, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని గుంటూరుకు చెందిన ఓ యువతి గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేశారు. సినీనటి కరాటే కల్యాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి వచ్చిన బాధిత యువతి ఫిర్యాదుచేసిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు. 

‘గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన నేను మూడేళ్ల క్రితం తిరుపతి ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో హరికథ విశారద కోర్సులో చేరాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన తాసీఫ్‌ అనే యువకుడు అక్కడే చదువుతూ నావెంట పడ్డాడు. తన స్నేహితుల ఇంటికి తీసుకెళ్లి మిఠాయిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన నాపై అత్యాచారం చేసి నగ్న వీడియోలు, ఫొటోలు చిత్రీకరించాడు. దీనిపై నిలదీస్తే తాను హిందువుగా మారి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పటి నుంచి బెదిరించి పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. నాకు గర్భం రావడంతో మా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అడిగాను. అప్పుడు నేను మైనర్‌ కావడంతో సమస్యలు వస్తాయంటూ నాతో బలవంతంగా మాత్రలు మింగించి గర్భస్రావం చేశాడు. సంగీత కళాశాలలో మూడేళ్ల కోర్సు పూర్తవ్వగానే హైదరాబాద్‌లో వయోలిన్‌ నేర్చుకోవడానికి వెళ్లాను. అక్కడకు వచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు. అక్కడ ఆర్యసమాజ్‌లో తాసీఫ్‌ తన పేరును తారక్‌గా మార్చుకొని మిత్రుల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల అమ్మకు ఆరోగ్యం బాగోలేదని, చూసి వద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. వారికి జరిగిన విషయాలు చెప్పవద్దని బతిమాలాడు. వాళ్ల కుటుంబసభ్యులు మా తల్లిదండ్రులను పిలిపించి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకుని పంపించి, నాకు మతమార్పిడి చేసి పెళ్లిచేశారు.

అప్పటినుంచి చిత్రహింసలు పెట్టారు. దుబాయ్‌కి అమ్మేస్తామన్నారు. అన్నం పెట్టకుండా గదిలో బంధించి, శరీరంపై వేడి గంజినీళ్లు పోసి కాల్చారు. అప్పటికే గర్భవతిగా ఉన్న నాతో మాత్రలు మింగించి గర్భస్రావం చేయించారు. నాకు శీలపరీక్ష చేయాలని బలవంతం చేశారు. నా తల్లిదండ్రులకు తెలియజేయడంతో వాళ్లు వచ్చి నన్ను పంపించాలన్నారు. మమ్మల్ని కొట్టి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకొని వారి మతపెద్దల సమక్షంలో మూడుసార్లు తలాక్‌ చెప్పించి రోడ్డు మీదకు నెట్టేశారు’ అని ఆ యువతి వాపోయారు.

Link to comment
Share on other sites

 

Hopefully police will investigate the matter and find out the truth. 

The story might be true but there might be a small chance it might be wrong , fair investigation needed 

Link to comment
Share on other sites

22 minutes ago, Ryzen_renoir said:

 

Hopefully police will investigate the matter and find out the truth. 

The story might be true but there might be a small chance it might be wrong , fair investigation needed 

Looks like a complaint has been registered.

Link to comment
Share on other sites

Chex kosam antha cheyala andi

Entha mandiri dabbulaki vastharo chepandi

Chakkaga pelli kooda chesukovachu

Parents pillalni educate cheyaali, chex is not everything ani ledhantey

Mitai lo mathumandhu titles padathai

Link to comment
Share on other sites

4 minutes ago, keviinusa said:

snehitundi intiki tesukuvelli mithai lo mathu mandu given anta.

forcibly taken or she went willingly ??

Not sure.. news chusthunte she went there willingly.. same college and ventapadi sataisthunapudu enduku vellindo foolish ga

Link to comment
Share on other sites

26 minutes ago, Mirage said:

Not sure.. news chusthunte she went there willingly.. same college and ventapadi sataisthunapudu enduku vellindo foolish ga

malla videos tesadu ani cheptundi

hindu ga maari I will marry ani promise chesi malla laingika daadi anta

then hyd lo arya samaj lo pelli took to inlaws house

endoo theda kodutundii seena

Link to comment
Share on other sites

29 minutes ago, keviinusa said:

malla videos tesadu ani cheptundi

hindu ga maari I will marry ani promise chesi malla laingika daadi anta

then hyd lo arya samaj lo pelli took to inlaws house

endoo theda kodutundii seena

Pictures/videos teesina tarvaata adigithe pelli chesukunta annadu antundi..Maybe he continued raping her showing the videos/pictures? She was still a minor when she got pregnant it seems...2-3 years tarvaata pelli chesukunattu unnaru.. and then things went South emo.. Investigation chesthe bayata padthadi mottham story

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...