Jump to content

యూరోప్ మరియు పశ్చిమ దేశాలకి అతి పెద్ద షాక్ ఇచ్చింది భారత్! మోడీ మౌనంగా ఉంటూ అంతా చూస్తూ ఉన్నాడు అంటే దాని వెనుక కారణం ఇదే


JackSeal

Recommended Posts

యూరోప్ మరియు పశ్చిమ దేశాలకి అతి పెద్ద షాక్ ఇచ్చింది భారత్!

 2-deoxy-D-glucose (2-DG) అనే డ్రగ్ కి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 
ప్రపంచవ్యాప్తంగా చైనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఆసరా చేసుకొని తమ వాక్సిన్ లని అమ్ముకొని [1.25 ట్రిలియన్ డాలర్లు ] లాభపడదామని ఆశించి భంగపడ్డాయి ఇప్పటికే. కాస్తో కూస్తో అత్యధిక జనాభా ఉన్న భారత్ దేశంలో తమకి కాసుల వర్షం కురుస్తుంది అనుకుంటే అది కాస్తా భారత దేశ స్వంత వాక్సిన్ కోవాక్సిన్ తయారు చేసి వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లింది భారత్.

 తాజాగా మరో షాక్ ఇచ్చింది భారత్ పశ్చిమదేశాలకి. అది 2-deoxy-D-glucose (2-DG) అనే యాంటీ కోవిడ్ డ్రగ్. 
DRDO అనుబంధ సంస్థ ఇన్ మాస్ [Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS) ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ మరియు అలైడ్ సైన్సెస్ సంస్థ అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి ఉపయోగపడే యాంటీ కోవిడ్ డ్రగ్ ని విజయవంతంగా ఆవిష్కరించింది. 
డ్రగ్స్  కంట్రోలర్ జెనెరల్ ఆఫ్ ఇండియా [DCGI ] ఈ రోజు ఇన్మాస్ యాంటీ కోవిడ్ డ్రగ్ ని అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి అనుమతి ఇచ్చింది. ఇది వాక్సిన్ కాదు డ్రగ్ మాత్రమే. 

ఇన్ మాస్ ఆవిష్కరించిన యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) ప్రధానంగా హాస్పిటల్ లో ఉన్న కోవిడ్ పేషంట్స్ కి ఆక్సిజెన్ మీద ఆధారపడకుండా చేస్తుంది. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ ! ఈ మందు వాడితే కోవిడ్ పేషంట్ కి ప్రత్యేకంగా ఆక్సిజెన్ ఇవ్వడం అవసరం ఉండదు. అలాగే కోవిడ్ పేషంట్ త్వరగా కొలుకునేలా సహాయపడుతుంది. 

అసలు విషయం వేరే ఉంది !
2020 సంవత్సరం ఏప్రిల్ నెలలో INMAS హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ మరియు మాలిక్యులర్ బయాలజీ [CCMB] తో కలిసి ప్రయోగాత్మకంగా పరీక్షలు చేయడం ప్రారంభించారు. గుర్తు పెట్టుకోండి అది లాక్ డౌన్ సమయం. ఒక మాలిక్యుల్ కోవిడ్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం మాత్రమే కాకుండా కోవిడ్ వైరస్ కణాలు వృద్ధి చెందకుండా ఆపడం గమనించిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ప్రయోగాలు చేశారు. అయితే ఇది మొదటి క్లినికల్ ట్రయల్. డ్రగ్స్  కంట్రోలర్ జెనెరల్ ఆఫ్ ఇండియా [DCGI ] తో పాటు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ [Central Drug Standard Control Organaisation-CDSCO] లు సంయుక్తంగా రెండో క్లినికల్[Phase-II] ట్రయల్స్ కోసం అనుమతి ఇచ్చాయి మే నెల 2020 లో. 

May - October 2020. DRDO తో పాటు అనుబంధ సంస్థ అయిన DRL [Defence Reacerch Laboratory ] లు కలిసి క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేయడం మొదలు పెట్టాయి. ఈ పరీక్షలు కోవిడ్ పేషంట్ కి ఎంత మోతాదు ఇవ్వాలి ఇచ్చిన తరువాత ఆ పేషంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనే అంశం మీద ట్రయల్స్ నిర్వహించాయి. అంటే ఇది డోస్ & సేఫ్టీ కోసం అన్నమాట. అయితే డ్రగ్ బాగా పనిచేసింది అలాగే ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కనిపించలేదు పేషంట్ త్వరగానే కొలుకున్నాడు. తరువాత ఫేజ్ 2 a కోసం అనుమతి వచ్చింది. ఫేజ్ 2 a పరీక్షల కోసం భారత దేశంలోని 11 హాస్పిటల్స్ లో మొత్తం 110 మంది కోవిడ్ పేషంట్ల మీద పరీక్షలు నిర్వహించారు అన్నీ కేసులు విజేయవంతంగా ముగిశాయి. 

ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ : November 2020-March 2021  లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి వచ్చింది. ఈ సారి ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ , వెస్ట్ బెంగాల్ , గుజరాత్ , మహారాష్ట్ర,తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలలో 220 మంది కరోనా రోగుల మీద పరీక్షలు నిర్వహించారు. అన్నీ కేసుల్లో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. 

మొత్తం మూడు దశల క్లినికల్ ట్రయల్స్ వాటి డాటా ని విశ్లేషించిన తరువాత ఈ రోజు అత్యవసరంగా అవసరం అయితే వాడడానికి అనుమతి లభించింది   

యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) కి. 
So! మన స్వంత వాక్సిన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి ఒక డ్రగ్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకు అవసరార్ధం కోసం రెమిడిసివర్ ని వాడుతూ వచ్చారు ఇక ఆ డ్రగ్ అవసరం ఉండదు. దూరాశతో బ్లాక్ చేసిపెట్టుకున్న అక్రమదారులకి ఇది చేదు వార్త ! 

అలాగే ముందుగా ఆక్సిజెన్ కాన్సంట్రేట్ లు,ఆక్సిజెన్ సిలిండర్ లు బ్లాక్ చేసిపెట్టుకున్న వాళ్ళకి కూడా ఇది చేదు వార్త. ఈ రోజు నుండి హాస్పిటల్ వరకు వెళ్లక్కర లేకుండా డాక్టర్ పర్యవేక్షణలో యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) ని వాడి ప్రమాదం లేకుండా బయటపడవచ్చు. వెంటీలేటర్ల అవసరం కూడా పెద్దగా రాదు.

మోడీ మౌనంగా ఉంటూ అంతా చూస్తూ ఉన్నాడు అంటే దాని వెనుక కారణం ఇదే. DRDO,INMAS,CCMB ల కృషి దాని ఫలితాలు 2020 మే నెల నుండి ప్రధాన మంత్రికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయని తెలిసిపోతుంది కాబట్టి నిబ్బరంగా ఉన్నారు మోడీ ! లాక్ డౌన్ ఉన్నా శాస్త్రవేత్తలు నిరంతరం పరీక్షలు చేసుకుంటూ వెళ్లడమే యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) బయటికి వచ్చింది. 
DRDO,INMAS,CCMB శాస్త్రవేత్తలకి అభినందనలు మరియు ప్రాణామములు. 
జైహింద్ !

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...