r2d2 Posted May 16, 2021 Report Share Posted May 16, 2021 హుజూరాబాద్ ప్రజాప్రతినిధులను ప్రలోభపెడుతున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజం ‘కొవిడ్‌తో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది చనిపోతున్నారు. సీఎం స్వయంగా సమీక్షించి ఏ జిల్లాలో మంత్రులు.. ఆ జిల్లాలో కరోనా రోగులకు అందే సేవలను పర్యవేక్షించాలని చెప్పారు. కానీ, కరీంనగర్ జిల్లాలో అందుకు భిన్నంగా ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి గొర్రెల మంద మీద తోడేళ్లలా హుజూరాబాద్ ప్రజాప్రతినిధులపై దాడి చేస్తున్నారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమాన్ని కాపాడి ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఈ నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని మంత్రి, సీఎం నియమించిన కొందరు ఇన్‌ఛార్జులు ఫోన్ చేసి డబ్బులు ఆశ చూపుతూ అభివృద్ధి పనుల బిల్లులు రావంటూ బెదిరిస్తున్నారని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ‘తెలంగాణలో చైతన్యం నింపిన గడ్డ మీద కుట్ర చేస్తున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన సమయమిది. రాజకీయాలు, వెకిలిచేష్టలు ఇప్పుడు కాదు. ఇకనైనా ఆపండి. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. సమైక్య రాష్ట్రంలో సైతం ఇలాంటి ప్రయత్నం చేసి భంగపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో గుణపాఠం చెబుతారు’ అని ఆయన హెచ్చరించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.