Jump to content

Raghurama: ఎంపీ రఘురామకు బెయిల్‌ !


r2d2

Recommended Posts

Raghurama: ఎంపీ రఘురామకు బెయిల్‌
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. అయితే కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని పేర్కొంది. పిటిషనర్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని తెలిపింది. కేసు విచారణకు అవసరమైతే కనీసం ఒక రోజు ముందు పిటిషనర్‌కు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వొచ్చని తెలిపింది. రఘురామ, మరో ఇద్దరు వ్యక్తులు రూ.లక్ష చొప్పున పూచీకత్తును పది రోజుల్లో ట్రయల్‌ కోర్టులో సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. పిటిషనర్‌ తన కాలిగాయాలను మీడియాకు చూపించవద్దని, కాదని చేస్తే  తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం హెచ్చరించింది. కేసు దర్యాప్తులో సాక్షులను ప్రభావితం చేయకూడదని పేర్కొంది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపులా పోటాపోటీగా వాదనలు సాగాయి. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దవే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అంతకుముందు  ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది. ‘‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్‌ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్‌ దాఖలు చేస్తారు?’’ అంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే సుప్రీంకు తెలిపారు. రఘురామ రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు.

దవే ఏమన్నారు?

ఎంపీ రఘురామ హద్దులు మీరారని, కరోనా సంక్షోభ సమయంలో ఇదంతా సరికాదని ఆయనకు సమయమిచ్చామని దవే కోర్టుకు తెలిపారు. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేపట్టారన్నారు.  కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారనీ, ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్‌ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదన్నారు. హైకోర్టు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పిందని, ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారు? అని దవే  ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికపై తాము అభ్యంతరం చెప్పడం లేదని, అదే సమయంలో జీజీహెచ్‌ ఆస్పత్రి నివేదిక కూడా సరైనదేనని కోర్టుకు తెలిపారు. అలాగైతే ఎంపీ కాలికి ఫ్రాక్చర్‌ గురించి ఏం చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. గుంటూరు జైలు నుంచి ఆర్మీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ఎంపీ నిరాకరించారనీ, తన కారులో వెళ్తూ అభివాదం చేశారనీ, ఆ సమయంలో కాలిగాయాలు చూపించారనీ చెప్పారు.

రోహత్గీ ఏమని వాదించారు?

రఘురామ తరఫున సీనియర్‌ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. జగన్‌ బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశారన్న నెపంతోనే ఆయనపై కక్షపెంచుకున్నారని కోర్టుకు తెలిపారు. జగన్‌ ప్రతివాదిగా లేనందున దీనిలోకి ఆయన్ను లాగొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అన్నారు. పిటిషనర్‌గా తాను చెప్పాలనుకున్నది తాను చెబుతానని రోహత్గీ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు న్యాయవాదులు ఎందుకు తగవులాడుకుంటున్నారని ధర్మాసనం మందలించింది. బెయిల్‌ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారని రోహత్గీ ఆక్షేపించారు. అరెస్టు, మెజిస్ట్రేట్‌, హైకోర్టు విచారణ పరిణామాలను రోహత్గీ కోర్టుకు వివరించారు.  అనంతరం ఆర్మీ ఆస్పత్రి వైద్య పరీక్షలను ఆయన ప్రస్తావించారు. కాలి బొటనవేలు పక్కన ప్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారన్నారు. సీఐడీ అదుపులో ఉండగా ఎంపీని చిత్రహింసలు పెట్టిన విషయం నిజమేనని వైద్యనివేదికతో నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరారు. సిట్టింగ్‌ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ముకుల్‌ రోహత్గీ ప్రశ్నించారు. కేదార్‌నాథ్‌ తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. కానీ, ఈ సందర్భంలో రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్‌ అని రోహత్గీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Link to comment
Share on other sites

Rrr should stop giving interviews to media which may be tough for him.

rrr should focus on filling more & more casss on jagga like amul. Jaggadi doola full gaa theerthadi

Link to comment
Share on other sites

7 minutes ago, Vaampire said:

Rrr should stop giving interviews to media which may be tough for him.

rrr should focus on filling more & more casss on jagga like amul. Jaggadi doola full gaa theerthadi

he is behaving like school child without any serious plan.. this is complete self goal by jagga.. i don't think raju garu will have any tactical moves to gain any proper benefit from this.per my understanding

Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

he is behaving like school child without any serious plan.. this is complete self goal by jagga.. i don't think raju garu will have any tactical moves to gain any proper benefit from this.per my understanding

jaggad did great move n target achieved

Link to comment
Share on other sites

21 minutes ago, futureofandhra said:

meeru vp avutunnaru

jaggad did great move n achieved target 

explain?

Link to comment
Share on other sites

27 minutes ago, futureofandhra said:

meeru vp avutunnaru

jaggad did great move n achieved target 

Koddiag explain cheyavacchu kada  adi ento

Link to comment
Share on other sites

7 minutes ago, ranku_mogudu said:

explain?

 

2 minutes ago, Unityunity2 said:

Koddiag explain cheyavacchu kada  adi ento

RRR mouth locked

Link to comment
Share on other sites

58 minutes ago, Vaampire said:

Rrr should stop giving interviews to media which may be tough for him.

rrr should focus on filling more & more casss on jagga like amul. Jaggadi doola full gaa theerthadi

No, he should give more interviews. But he should concentrte on the issues without being distracted by the YSRCP social media Dhandupalyam batch. RRR has excellent oratorical skills. His strength is to describe the complex issues in  understandable language with Godavari wittiness. He has been doing great work, recent ga Punch Prakar lanti Dhandupalyam batch 1000s lo attach cheyyadam start chesara, he got distracted. Memu mee fans ani cheppi honey trap kooda chesaru kontha mandhi ladies (.)(.) pics pampi. Oka lady pics naa dhaggara unnayi. Social media lo athani wife meedha, athani pillalu meedha comments choosthe jugupsakaram ga untayi. Paurusham unnodu kabatte, he responsed. He should let that go and focus on the issues.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...