Jump to content

2 years lo jaggadu chesina manchi panulu


nuvvu_naakina_paalem

Recommended Posts

1 minute ago, JustChill_Mama said:

Janalu maranantha varaku evadu em cheyyaledu bhayya ... honestly, both cms are very confident about their welfare schemes & strong votebank which is associated with that. 
naku raithubandhu vosthundhi ... ma thatha ki pension vosthundhi. Ma nayanaki govt salary vosthundhi.... akka/amma ki amma odi vosthundhi. Itlanti calculations nunchi janalu bayata padanantha varaku we can’t do anything..... ye cm ayina edho roju chetthulettheyalsina situation vosthadhi ....

Manadeggara development evadu chestadu bro. Aanta dochukovatame.. atleast cash aanna public ki eeste valla istam.

inka migilindi basic infra development. Adi chalanukunta public ki 

Link to comment
Share on other sites

3 minutes ago, JUST444FUN said:

Manadeggara development evadu chestadu bro. Aanta dochukovatame.. atleast cash aanna public ki eeste valla istam.

inka migilindi basic infra development. Adi chalanukunta public ki 

idhi anna undha?

Link to comment
Share on other sites

6 minutes ago, nuvvu_naakina_paalem said:

idhi anna undha?

nuvvu_naakina_paalem

 

vallu PPT's ni villu modify chesthunnaru anta.. party colors BG lo unde laaga

  • Haha 1
Link to comment
Share on other sites

13 minutes ago, JUST444FUN said:

Manadeggara development evadu chestadu bro. Aanta dochukovatame.. atleast cash aanna public ki eeste valla istam.

inka migilindi basic infra development. Adi chalanukunta public ki 

Cash annadhi kontha mandhi ki
like MLA kinda --> Zptc --> Mptc--> karyakarthalu, valla bandhuvulu, valla bandhuvulu, bandhuvula bandhuvulu and kontha mandhi friends with their caste affiliations varaku osthay.. kaani andulo avasaram pondhalsina Janam untaara .. I dont think so

Link to comment
Share on other sites

5 minutes ago, nuvvu_naakina_paalem said:

idhi anna undha?

Eeppatiki ledu india lo

Evadiki vaadu vadi real estate develop eeyinda leda ani tappite 

Last 70 years evvadu focus cheyale veetimeeda ..

i think basic infra is : house,water, electricity,roads, schools , hospitals.

 

Link to comment
Share on other sites

Just now, ranku_mogudu said:

Cash annadhi kontha mandhi ki
like MLA kinda --> mptc --> zptc--> karyakarthalu, valla bandhuvulu, valla bandhuvulu, bandhuvula bandhuvulu and kontha mandhi friends with their caste affiliations varaku osthay.. kaani andulo avasaram pondhalsina Janam untaara .. I dont think so

Eeppudu aandariki direct deposit ee kada bro . Including Paytm 

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, MiryalgudaMaruthiRao said:

teddies ni BC lo kalapadam Korda achievement next all teddies ki reservation quota lo jobs , seats iyyali

Aa lekkana comms n kings ni kuda kalipinatte ga va.. that corporation was for those 3 vargams..

Link to comment
Share on other sites

2 minutes ago, MiryalgudaMaruthiRao said:

teddies ni BC lo kalapadam Korda achievement next all teddies ki reservation quota lo jobs , seats iyyali

Inka eekkada reservations bro . Next term kalla bodi mottam privatization sestadukada 

Link to comment
Share on other sites

  • 1 year later...
100 మోసాలు..
మొత్తం చదవండి.. హామీలన్నీ అమలు చేశాడని ఎవరైనా అంటే వీటి గురించి అడగండి..
98% హామీలు నేరవేర్చేసాను అని చెప్పే జగన్ మానిఫెస్టోలో ఎన్నో మోసాలు ఎన్నో తప్పులు ఎన్నో అబద్ధాలు.. ఆ మోసాలేంటో చూడండి 👇👇
💥💥మోసం : 1
రైతు భరోసా అని ఏడాదికి 12500 ఇస్తా అన్నాడు కానీ 7500 మాత్రమే ఇస్తున్నాడు
గత ప్రభుత్వంలో మా ఎన్నికల హామీ కాకపోయినా అన్నదాత సుఖీభవ పేరుతో 68లక్షల మందికి రాష్ట్ర ఖజానా నుంచి ఏడాదికి 15వేలు ఇచ్చారు ఇప్పుడు దానిని 7500కి తగ్గించి 45లక్షల మందికే ఇస్తున్నాడు..
💥💥మోసం :2
3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని మూడేళ్ళయింది 3 పైసలు కూడా విదల్చలేదు
💥💥మోసం : 3
4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి తప్పాడు..
వరదలు వచ్చి పంట నష్టపోతే అప్పులపాలు అవటమే దిక్కులా ఉంది
💥💥మోసం :4
ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నారు..
ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా కట్టలేదు అసలు ఆ ఊసే లేదు
రైతుల పంటలు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు మీద పారబోస్తున్నారు
💥💥మోసం :5
ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ టోల్ టాక్స్ లేకుండా చేస్తాం అన్నారు..
అసలు ఇలాంటి హామీ ఒకటి ఇచ్చాం అని కూడా మర్చిపోయారు..
💥💥మోసం :6
రైతులు చనిపోతే భీమా 7లక్షలు ఇస్తానన్నారు..
బీమా మాట దేవుడెరుగు చనిపోతే పట్టించుకునే వాడే లేడు.. అడిగితే దాడులే చేసేస్తున్నారు
గత ప్రభుత్వం ఇచ్చిన 5లక్షల బీమా కూడా తీసేసారు
💥💥మోసం :7
పేదలకి కట్టిస్తానన్న 25లక్షల ఇళ్ళలో ఐయిదంటే ఐదే ఇళ్ళు కట్టారు ఈ మూడేళ్ళలో..
గత ప్రభుత్వం కట్టిన 2లక్షల ఇళ్ళని కూడా ఎవరికీ మంజూరు చెయ్యకుండా కుళ్ళ బెడుతున్నారు పగతో
💥💥మోసం :8
పోలవరం : రివర్స్ టెండరింగ్ తో మొదలైన మోసం అలసత్వంతో కాఫర్ డ్యాం పాడు చేసే స్థాయికి తెచ్చి ఈ మూడేళ్ళలో "మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఆరు వేల కోట్లు " కట్టబెట్టి కేవలం 2% పూర్తి చేసారు..ఇలా చేస్తే పోలవరం పూర్తయ్యేసరికి ఇప్పటి తరం పిల్లలకి షష్టిపూర్తి కూడా ఐపోతుంది.
💥💥మోసం :9
వెలిగొండ ప్రాజెక్టు..This is నిరంతర ప్రక్రియ..డేట్ మార్చుకుంటూ వెళ్ళటం తప్ప ఇటు పుల్ల తీసి అటు పెట్టింది లేదు
ఎన్నికలకి ఏడాది ముందు ఆస్కార్ పెర్ఫార్మెన్స్ కి వేచిచూడాలి
💥💥మోసం :10
చెరువులు పునరుద్ధరణ చేస్తానని కనిపించిన చెరువునల్లా పూడ్చి కబ్జాలు చేసారే కానీ ఇప్పటి వరకూ చెరువులు పునరుద్ధరణ కోసం ఒక ప్రణాళిక అంటూ తేలేదు
💥💥మోసం :11
ప్రత్యేక హోదా సంజీవని 25 ఎంపీలు ఇస్తే మెడలు వంచుతామని పదవిలోకొచ్చి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని మాత్రమే అడగగలం అని మడమ తిప్పేసారు..తన అవినీతి కేసుల కోసం కనిపించినపుడల్లా కాళ్ళ మీద పడిపోతున్నాడు..
ఇంక పోరాడి తెచ్చేదెపుడు..
💥💥మోసం :12
ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ అంటే ఏంటో అనుకున్నాం వచ్చి మూడేళ్ళయింది జాబ్ క్యాలెండర్ ఏది అని జగన్ రెడ్డిని అడిగితే అంటే ఏంటి అని ఎదురు మనల్నే అడుగుతున్నారు..
ఈ మూడేళ్ళలో యువత ఉద్యోగాల కోసం వలస వెళ్ళటం తప్ప జరిగిన అభివృద్ధి ఏం లేదు
💥💥మోసం :13
2.3 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఈ మూడేళ్ళలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చెయ్యలేదు..అసలు జాబ్ క్యాలెండర్ గురించే మర్చిపోయిన వాళ్ళకి ఇది గుర్తుంటుందా??
💥💥మోసం :14
గవర్నమెంట్ కాంట్రాక్టులు యువతకే అని చట్టం తెస్తా అన్నారు..ఇప్పుడు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి..ఒకవేళ చేసినా సొంత వాళ్ళకే దక్కుతున్నాయి.. యువతకి ఇచ్చిన ఈ హామీ మర్చిపోయి చాలా కాలం అయింది..ఎన్నికల టైంకి హడావిడి చేస్తారని తెలుసుగా
💥💥మోసం :15
యువత కార్లు బస్సులు కొనుక్కోవటానికి సబ్సిడీ ..
ఇది ఔట్ ఆఫ్ సిలబస్ అసలు..
గత ప్రభుత్వంలో కార్పొరేషన్ లోన్స్ ద్వారా యువత ఉపాధి కోసం కార్లు ఇచ్చింది.. ఇప్పుడు అవి కూడా ఇవ్వట్లేదు
💥💥మోసం:16
BC, SC, ST యువతకు 50% రిజర్వేషన్ ఇస్తానన్నారు..చెప్పి మూడేళ్ళయింది..ఉద్యోగాలు అడిగితే నోటిఫికేషన్ ఇస్తే పాస్ అవ్వగలవా అని ఎగతాళి చేస్తున్నారు నాయకులు
💥💥మోసం :17
డ్వాక్రా రుణ మాఫీ : రుణాలివ్వాలంటే యానిమేటర్ కి లంచం ఇవ్వాలి లేకపోతే పనిజరగని పరిస్థితి రాజన్న రాజ్యంలో..
ఇంక రుణ మాఫీ కూడానా..
గత ప్రభుత్వంలో పసుపు కుంకుమ పేరుతో 96లక్షల డ్వాక్రా మహిళలకి 21వేల కోట్ల లబ్ది జరిగింది..ఈ ప్రభుత్వంలో సున్నా..
💥💥మోసం :18
మద్యపాన నిషేధం ..దీని గురించి అడిగితే మీ ఇంట్లో ఆడవాళ్ళని అసభ్యంగా తిట్టకుండా ఉంటే చాలు..
నిషేదం నివారణ అయింది..
నివారణ మూడు రెట్ల అధిక ఆదాయంగా మారింది
తాగుబోతులని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారంటే నిషేధం ఎన్నికల టైంలో జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి
💥💥మోసం :19
మద్యానికి బానిసలైన వాళ్ళకోసం డీ ఎడిక్షన్ సెంటర్లు పెడతాను అని మూడేళ్ళైనా ఒక్క నియోజకవర్గంలో కూడా శంకుస్థాపనకి కొబ్బరికాయ కొట్టిన పాపాన పోలేదు
💥💥మోసం :20
కౌలు రైతులకు ఇస్తానన్న 7లక్షల బీమా లేదు గత ప్రభుత్వం ఇచ్చిన 5లక్షల బీమా కూడా తీసేసారు..
ఉన్నది 13లక్షల మంది కౌలు రైతులైతే రాజన్న రాజ్యంలో 8లక్షలమందే ఉన్నారంట మిగిలిన వాళ్ళు నీ పాలన చూసి వ్యవసాయం వదిలేసారా??
💥💥మోసం :21
కౌలు రైతులకి పంట బీమా ఇస్తానన్నావ్..
పొలాలు ఉన్న రైతులకే బటన్ నొక్కిన పడకపోతే ఈ కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తాయి బీమా డబ్బులు..
💥💥మోసం :22
రూపాయికే టిడ్కో ఇళ్ళు ఇస్తానని ఇప్పుడు ఇల్లే ఇవ్వకుండా వడ్డీలు కట్టమని వాలంటీర్లని పంపిస్తున్నావు..గత ప్రభుత్వం కట్టిన 12లక్షల ఇళ్ళలో రెండు లక్షల ఇళ్ళను మూడేళ్ళుగా లబ్దిదారులకు ఇవ్వకుండా లేట్ చేసారు ఇప్పుడు వైసిపి రంగులేస్తున్నారు..రంగు ఆరగానే 2023లో ఇస్తారేమో చూడాలి
💥💥మోసం :23
గొర్రెల కాపరులకు 6వేలు ఇస్తా అన్నాడు..
జనమే గొర్రెలు నేనే కాపరి ఇంక 6వేలు ఎందుకని హామీని అటకెక్కించాడు
💥💥మోసం :24
45ఏళ్ళు నిండిన BC SC ST మహిళలకి పింఛన్లు హామీ..జగనన్న అధికారంలోకి రాగానే అందరికీ అమృతం ఇచ్చాడనుకుంట.. అందుకే ఎవరికీ వయసు పేరగలేదని పింఛన్లు ఇవ్వలేదు..
💥💥మోసం :25
వారంలో CPS రద్దు చేస్తామన్నారు మూడేళ్ళయింది రద్దు చెయ్యమంటే ఉద్యోగుల మీద కేసులు పెట్టి బూతులు తిడుతున్నారు
💥💥మోసం :26
ప్రభుత్వ ఉద్యోగులకి ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు కానీ రివర్స్ పాలనలో ఉద్యోగుల పిఎఫ్ డబ్బులు కూడా నొక్కేసారు
💥💥మోసం :27
కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చెయ్యటం.. ఆ మాట దేవుడెరుగు కొన్ని శాఖల్లో ఉద్యోగులకి నెలల తరబడి జీతాలు రాక ధర్నాలు చేస్తున్నారు
💥💥మోసం :28
కాపు కార్పొరేషన్ కి 10వేల కోట్ల కేటాయింపు..
కేటాయింపు రూపాయి కూడా జరగలేదు కానీ అప్పులు మాత్రం చేసారు..ఆ డబ్బులు ఏమయ్యాయి అని మాత్రం అడగద్దు అడిగితే కేసులు పెడతారు
💥💥మోసం :29
గత ప్రభుత్వంలో ఇచ్చిన 5% కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి కాపులని గాలికి వదిలేసాడు
💥💥మోసం :30
ఆర్య వైశ్య కార్పోరేషన్: వైశ్యులని గదిలో పెట్టి కొడతారే కానీ ఆదుకోరు ఈ పాలనలో. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ అంటే వ్యాపారం చేస్కోటానికి లోన్లు ఇచ్చే వాళ్ళు..జగన్ ప్రభుత్వంలో కార్పొరేషన్ అంటే సొంత వాళ్ళకి పదవుల కోసం కార్పోరేషన్ పేరు మీద అప్పులు చెయ్యటం కోసం వాడుతున్నారు..
💥💥మోసం:31
జూనియర్ లాయర్లకి 5వేల స్టైఫండ్ మూడేళ్ళుగా గాల్లో దీపంలా ఉంది..
💥💥మోసం :32
Lawyer welfare fund 100 crs అంటే ఇది ప్రభుత్వం లాయర్లకి ఇస్తుందో లాయర్లే ప్రభుత్వానికి ఇవ్వాలో ఇంకా తేలలేదు..అది తెలియంగానే ఎప్పటికో ప్రకటన వస్తుందిలే..
💥💥మోసం :33
హైకోర్టు లాయర్లకి స్థలాలు..
అవి మీరు ఇవ్వలేరని మాకు తెలుసుకానీ హైకోర్టుకి వెళ్ళే దారిలో రోడ్డు తవ్వి దొంగిలించిన గ్రావల్ ని తీసుకొచ్చి రోడ్డు బాగు చెయ్యమని అడుగుతున్నారు హైకోర్టు లాయర్లు..
💥💥మోసం :34
జిల్లాకో ఎయిర్ పోర్ట్ జిల్లాకో మెడికల్ కాలేజీ నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు..వింటున్నాం కదా చెప్పారే కానీ చేసిందేం లేదు
💥💥మోసం :35
దేవాలయాల ధూపదీప నైవేద్యాలకి ఫండ్స్..
దేవాలయాల నుంచి ఆదాయం తీసుకున్నదే కానీ ఇచ్చింది లేదు..
💥💥మోసం :36
అర్చకులకి స్థలాలు..వారి స్థలాలు లాక్కోకుండా ఉంటే చాలు
💥💥మోసం :37
రాయలసీమ రైతులకి వరం లాంటి డ్రిప్ ఇరిగేషన్ కోసం డ్రిప్ ఇరిగేషన్ పంపులు సబ్సిడీలో ఇచ్చే గత ప్రభుత్వ పధకాన్ని కూడా ఆపేసావ్ నిన్ను రైతు పక్షపాతి అని ఎవరైనా అంటారా??
💥💥మోసం :38
ఇంటివద్దకే నాణ్యమైన ఇసుక అని చెప్పి గత ప్రభుత్వం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకని 10వేలు నుంచి 30వేలు వసూలు చేస్తూ కూడా కట్టడాలకి ఎందుకూ పనికిరాని ఇసుకని ఇస్తున్నావ్..ఇది ఘరానా మోసం
💥💥మోసం :39
దుల్హన్ పథకం.. ముస్లిం ఆడపిల్లలు పెళ్ళి చేసుకుంటే లక్ష ఇస్తా అన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన 50వేల పధకాన్ని కూడా తీసేసారు
💥💥మోసం :40
ఇళ్ళపట్టాలు..పడుకుంటే కాళ్ళు బైటకొచ్చే సెంటు స్థలం కోసం గతంలో పేదలకి ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కున్నారు.. ప్రభుత్వ స్థలాలలో భూములు ఇవ్వాలి కానీ పేదల దగ్గర దౌర్జన్యంగా స్థలాలు లాక్కుని మళ్ళీ వాళ్ళకే వాళ్ళ స్థలాలు ముక్కలుగా ఇచ్చి ఫోటోలు దిగటం ఇదేం మోసం
💥💥మోసం :41
ఇమాంలకి ఇళ్ళు కట్టిస్తా అన్నారు అసలు ఆ హామీ ఇచ్చినట్టే గుర్తులేదు వాళ్ళకి.. మర్చిపోయారు..
💥💥మోసం :42
ఇమాం మౌజామ్ లకి నెల నెలా 15వేల జీతం ఇస్తానని మూడేళ్ళయింది..దిక్కులేదు
💥💥మోసం :43
ముస్లిం మైనార్టీలు ఎవరైనా చనిపోతే 5లక్షల బీమా అన్నాడు..అటు వైపు కూడా చూడలేదు
💥💥మోసం :44
ఐనవాళ్ళకి పదవులు ఇవ్వటానికి అప్పులు చెయ్యటానికే కమ్మ రెడ్డి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కార్పొరేషన్లు..ఎవ్వరికీ ఒక్క రూపాయ్ ఇవ్వలేదు ఈ మూడేళ్ళలో
💥💥మోసం :45
సున్నా వడ్డీకి 10లక్షల డ్వాక్రా రుణాలు హామీ.. గత ప్రభుత్వం సున్నా వడ్డీకి 5లక్షలు ఇస్తే నేను 10లక్షలు ఇస్తా అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5లక్షలని కూడా 3లక్షలకి తగ్గించి మోసం చేసాడు
💥💥మోసం :46
అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అన్నాడు..మాట మడమ అన్నీ తిప్పేసాడు
💥💥మోసం :47
వృద్ధాప్య పింఛన్లు
గత ప్రభుత్వం 200 నుంచి 2000 రూపాయలు చేస్తే నువ్వు అధికారంలోకి రాగానే 3000 ఇస్తా అన్నావ్.. వచ్చాక ఏడాదికి 250 అన్నావ్.. తర్వాత పెంచుకుంటూ పోతా అన్నావ్..ఆ మడమని తిప్పీ తిప్పి ఎంత పెంచావ్??టిడిపి 1800పెంచితే నువ్వు 500పెంచావ్..ఇది మోసం కాదా??
💥💥మోసం :48
రైతులకి ఎంతకావాలంటే అంత సున్నా వడ్డీకి రుణాలు ఇస్తా అన్నాడు.. అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ఇచ్చిన 3లక్షల సున్నా వడ్డీ ఆపేసి లక్ష మాత్రమే ఇస్తున్నాడు అది కూడా వడ్డీ రైతు ముందు కడితే తర్వాత ఆ డబ్బులు తిరిగిస్తారంట..ఇదేం రివర్స్ సాయం ఇదేం మోసం
💥💥మోసం :49
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నారు.. ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వంలో విలీనం అవటం వలన ఏమైన ఉపయోగం కలిగిందా? కనీసం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా PRC అమలుచేసారా? మీరు ఆర్టీసీ ఆదాయంలో వాటాలు తీస్కోటానికి ఆస్తుల మీద అప్పులు తీస్కోటానికి తప్ప దేనికీ ఉపయోగపడలేదు
💥💥మోసం :50
రైతులకి ఉచిత కరెంట్ ఇస్తానని అధికారంలోకి వచ్చి ఇప్పుడు కరెంట్ మీటర్లు బిగిస్తున్నారు ఇది మోసం కంటే పెద్దది కాదా.. కరెంట్ బిల్ రైతులు ముందు కట్టేయాలంట డబ్బులు తర్వాత ఇస్తారంట..తడి గుడ్డతో గొంతులు కోసే మోసం..
💥💥మోసం :51
SC, STలకు భూమి ఇస్తానని హామీ ఇచ్చి
రివర్స్ పాలనలో ఇప్పటి వరకు 11వేల ఎకరాలు వాళ్ళ దగ్గరనుంచి అనధికారికంగా స్వాధీనం చేసుకున్నారు
💥💥మోసం :52
కళ్యాణ లక్ష్మి : మాటలు కోటలు దాటాయి చేతలు గత ప్రభుత్వం ఇచ్చిన పధకాన్ని కూడా రద్దు చేసాయి
💥💥మోసం :53
SC, STలకి 200యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా అన్నారు..
ఈ మూడేళ్ళలో కరెంట్ చార్జీలు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టేలా పెంచారు..
💥💥మోసం :54
SC, ST లకి విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా 6వేలు అకౌంట్లో వేస్తా అన్నారు..మర్చిపోయుంటారు ఎన్నికల టైంకి గుర్తొస్తుందిలే..
💥💥మోసం :55
గిరిజనుల కోసం ప్రతి ఏజెన్సీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్..
ఉన్న హాస్పిటల్స్ లో మందులకే దిక్కు లేదు..
💥💥మోసం :56
రైతులకి ఉచితంగా బోర్లు వేస్తామన్నారు..
ఎన్నికల టైంకి గుర్తొస్తుందేమో
💥💥మోసం :57
అసైన్డ్ ల్యాండ్ కి ఎక్కువ రేట్ వచ్చేలా చట్టం చేస్తా అన్నారు..కొన్ని వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు..మొత్తం స్వాధీనం చేసుకున్నాక చట్టం చేస్తారేమో..
💥💥మోసం :58
సహకార డైరీకి పాలు పోసే రైతులకి 4రూపాయల బోనస్ అన్నారు.. అధికారంలోకి వచ్చి సహకార రంగాన్నే నిర్వీర్యం చేసి అమూల్ తో కుమ్మక్కై పాడి రైతులని మోసం చేసారు
💥💥మోసం :59
DSC notification..మూడేళ్ళలో ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు..ఉన్నావాళ్ళని అవమానిస్తూ రోడ్డున పడేసారు
💥💥మోసం :60
మధ్యాహ్న భోజన పథకం..
కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోతే విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు..
మధ్యాహ్న భోజన పథకం అటకెక్కింది..
💥💥మోసం :61
SC, ST లో ఎవరైనా మరణిస్తే 5లక్షల బీమా హామీ గాలికి కొట్టుకుపోయింది
💥💥మోసం :62
నాడు నేడు..భవనాలకి రంగులేసి ఫోటోలు పేపర్లో పెడితే నాడు నేడు అని ఎవరు చెప్పారో సిఐడితో ఎంక్వైరీ చేయించాలి..
"నాడు" ఆ సియం పక్కన కూర్చోపెట్టుకుంటే
"నేడు" ఈ సియం సిమెంట్ బస్తాలు మోయిస్తున్నారు
💥💥మోసం :63
ఇంగ్లీష్ మీడియం..
బెండపూడి లో ఎనిమిది మంది పిల్లలకి ప్రసాద్ సార్ సొంత ఖర్చులతో నేర్పించిన ఇంగ్లీష్ తప్ప ఈ మూడేళ్ళలో ఇంగ్లీష్ నేర్చుకున్న గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధులు లేరు
💥💥మోసం :64
జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం అన్నారు..
చానళ్ళకి జర్నలిస్టులని అవమానించటం తప్ప సాయం చేసింది లేదు
💥💥మోసం :65
ఆరోగ్యశ్రీ సేవలు మెరుగ్గా చేస్తానన్నారు..ఈ పెద్దమనిషి వచ్చాక హాస్పిటల్స్ కి బిల్లులు చెల్లించక ఎన్నో హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసాయి
💥💥మోసం :66
Nominated posts 50% reservation for BC SC ST..రాజన్న రాజ్యంలో నామినేటెడ్ పదవులన్నీ "జగన్ సామాజిక వర్గంలో" ఆయనకి భజన చేసే వాళ్ళకే ..
💥💥మోసం :67
Govt contract 50% reservation for BC SC ST..ఏదో హామీ ఇవ్వాలని ఇచ్చారు కానీ వాళ్ళకి కూడా గుర్తుండి ఉండదు
💥💥మోసం :68
బిసి చెల్లెమ్మలు పెళ్ళి చేసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన 35వేల కంటే ఎక్కువగా 50వేలు ఇస్తానని మోసం చేసి ఉన్న 35వేల పధకాన్ని కూడా ఎత్తేసాడు
💥💥మోసం :69
BC లకి అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ ఇస్తా అన్నారు..
అది ఎప్పుడో మర్చిపోయారు..
💥💥మోసం :70
BC లకి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తా అన్నారు మానిఫెస్టోలో తప్ప ఎక్కడా దాని ప్రస్తావనే లేదు..
💥💥మోసం :71
BC లలో ఎవరైనా మరణిస్తే 5లక్షలు బీమా ఇస్తానన్న హమీ హారతి కర్పూరం అయింది
💥💥మోసం :72
టైలర్లకి ఇస్తానన్న ఏడాదికి 10వేల సాయం కుట్టుమిషన్ చక్రాలలో నలిగిపోయింది
💥💥మోసం :73
మత్యకారులకి డీజిల్ సబ్సిడీకి అందించే పధకం మూడేళ్ళ క్రితం అయ్యగారు అధికారంలోకి రాగానే సముద్రంలో కలిసిపోయింది
💥💥మోసం :74
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే SC ST సబ్ ప్లాన్ నిధులని మళ్ళించేసి లెక్కా పత్రం లేకుండా ఖర్చుపెట్టి సంక్షేమం చేసానని బొంకేసారు..మొత్తం 7వేల కోట్లు దారి మళ్ళించేసారు అవి ఏం చేసారో ఎవరికీ తెలియదు..
💥💥మోసం :75
అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా?
💥💥మోసం :76
అమ్మ ఒడి మళ్ళింపు..గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అన్ని పధకాలని ఆపేసి ఆ డబ్బులని అమ్మ ఒడికి మళ్ళించారు..ఇలా పేర్లు మార్చి చేసేది సంక్షేమమా మోసమా??
💥💥మోసం :77
ఉన్నత విద్య నాణ్యమైన విద్య అందిస్తానని విదేశీ విద్య పధకం కింద ఇచ్చే 10లక్షల సాయాన్ని ఆపేసారు
💥💥మోసం :78
పాస్టర్లకి ఇళ్ళ స్థలాలు ..అసలు గుర్తుండి ఉండదు
💥💥మోసం :79
PRC..ఏ ప్రభుత్వంలో ఐనా PRC ఇస్తే జీతాలు పెరుగుతాయ్ మా దగ్గర తగ్గుతాయ్..తడి గుడ్డతో గొంతు కోసే మోసం అంటారు దీన్ని..
💥💥మోసం :80
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ ని ఉద్యోగుల ఖాతాల నుంచే మాయం చేసేసాడు..ఉద్యోగులు ప్రభుత్వం మీద దొంగతనం కేస్ పెడతా అంటున్నారు మరి ఏం జరుగుతుందో..
💥💥మోసం :81
పరిశ్రమలకి ఇచ్చే రాయితీలు ఆపేసారు..
పరిశ్రమలకి అవసరం అయ్యే నీటి సరఫరా ధరలని వంద రెట్లు పెంచేసారు ఒకేసారి..
రాజన్న రాజ్యంలో అంతే అని వాళ్ళు పక్క రాష్ట్రాలకి వెళిపోతున్నారు
💥💥మోసం :82
విద్యార్థులకి ఎంత ఉంటే అంత పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తా అని అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన 35వేల కంటే తక్కువగా 20-25వేలు ఇస్తున్నారు
💥💥మోసం :83
ఏడాదికి 6500 పోలీస్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు..ఒక్కటి కూడా కాలేదు
💥💥మోసం :84
పోలీసులకి వీక్ హాఫ్ అన్నారు స్టాఫ్ తక్కువగా ఉన్నారని అమలు చెయ్యలేదు..అదేదో కొత్త ఉద్యోగాలు ఇచ్చి అమలు చెయ్యాల్సింది కదా..
💥💥మోసం :85
అంగన్వాడీ ఆశా వర్కర్లు జీతాలు పెంచుతామన్నారు..నెలల తరబడి అసలు జీతాలే రాకపోతే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు..
💥💥మోసం :86
నాడు నేడు ఈ ఒక్క ఫోటో చూస్తే నాడు నేడు ఎంత అద్భుతంగా ఉందో తెలిసిపోతుంది..
పనులు చేస్తామన్నారు కానీ ఫలితం లేదు..
నాడు నేడు పధకంలో 3700కోట్ల అవినీతి బయటపడింది..
💥💥మోసం :87
ఈ మూడేళ్ళలో కొత్తగా వచ్చిన కంపెనీ ఒక్కటీ లేదు ఒప్పందం చేసుకున్న కంపెనీలే రివర్స్ పాలనతో పక్క రాష్ట్రాలకి వలస పోయాయ్..ఇక ఉద్యోగాలేమొస్తాయ్ ఆదాయం ఏం వస్తుంది..
💥💥మోసం :88
అగ్రిగోల్డ్ బాధితులకి వచ్చిన మొదటి నెలలోనే 1105కోట్లు ఇస్తా అన్నా..మూడేళ్ళయింది ఇప్పటికీ టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తున్నారు
💥💥మోసం :89
OTS : ఇళ్ళు కట్టించమంటే 25లక్షల ఇళ్ళు కట్టిష్తా అని ఇంత బారు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే అప్పటికే కట్టిన ఇళ్ళ మీద 30 ఏళ్ళ క్రితం అప్పు ఉందని లబ్దిదారుల ఇంటికి మనుషులని పంపించి బెదిరించి 10వేలు కట్టించుకున్నారు..
రివర్స్ పాలనలో మోసాలు ఇలానే ఉంటాయ్ మరి
💥💥మోసం :90
రోడ్లు..ఈ వేసవికి..ఈ వర్షాకాలం ఐపోయాక..ఈ దీపావళికి.. ఈ సంక్రాంతి కల్లా అని మూడేళ్ళు గడిపేసారే కానీ ఒక్క తట్ట కంకర వేసింది లేదు.. ఆక్సిడెంట్స్ జరిగి చనిపోతారు కానీ మా రాష్ట్రంలో రోడ్డు మీద ఉన్న గుంతలు వలన మరణాలు జరుగుతున్నాయి..రోడ్ల కోసం రూపాయ్ పన్ను కూడా కడుతున్నాం
💥💥మోసం :91
ధరలన్నీ పూర్తిగా తగ్గించేస్తాం అని దీర్గం తీసి చెప్తే ఏంటో అనుకున్నాం.. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ధరలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండవు..పక్క రాష్ట్రాల వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ కంటే ధరలు తక్కువ అని బ్యానర్లు పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు..
💥💥మోసం :92
BC sub planతో BCలకి ఇచ్చే సంక్షేమ నిధులు దాదాపు 18వేల కోట్లు దారి మళ్ళించేసారు.ఇన్ని చేసి మళ్ళీ అప్పులెందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అర్ధం కావట్లేదు
పంచాయతీలకి కేంద్రం నుంచి వచ్చిన 7600 కోట్లు దారి మళ్ళించేసారు..పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లటానికి కూడా డబ్బుల్లేవ్
💥💥మోసం :93
స్కూల్ కి వెళ్ళే ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చే పథకం ఆపేసి స్కూల్ కి ఐదారు కిలోమీటర్లు నడిపిస్తున్నావ్
💥💥మోసం :94
నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఆపేసావ్..ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే ఆ డబ్బులకి కూడా ఇంట్లో ఆధారపడేలా చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసావ్
💥💥మోసం :95
పారదర్శకమైన పాలన అందిస్తానని చీకట్లో రహస్య జి.ఒ లు రిలీజ్ చేస్తున్నారు..వాటిని ప్రజలకి అందుబాటులో ఉంచకుండా రహస్యంగా ఉంచుతున్నారు ఇదేనా పారదర్శకమైన పాలనంటే..రహస్య జి.ఒ లతో ఏం మోసాలు చేస్తున్నారు..??
💥💥మోసం :96
కడప స్టీల్ ప్లాంట్ ని ఆరు నెలల్లో కట్టి చూపిస్తానని సవాల్ చేసారు.. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసినా మళ్ళీ రెండో సారి శంకుస్థాపన చేసి ఆ రోజు తెచ్చిన పలుగు పార తట్ట కూడా అక్కడే వదిలేసి వెళిపోయారు.. అంత చిత్తశుద్ధి మరి..
💥💥మోసం :97
మహిళలకి రక్షణ ఇస్తూ సుపరిపాలన చేస్తానని హామీ ఇచ్చి ఎప్పుడూ లేనట్టు రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతే ఎక్కడో ఏదో జరిగితే యాగీ చేస్తారేంటి అని బాధితులని చులకన చెయ్యటం..ఫేక్ దిశా చట్టాలతో మోసం చెయ్యటం..
💥💥మోసం :98
పవర్ కంపెనీల నష్టాలు తీర్చటానికి కొత్తగా ట్రూ అప్ చార్జీలు అని కరెంట్ బిల్ తో వసూలు చేస్తున్నారు..గత ప్రభుత్వంలో ప్రభుత్వమే ఆ నష్టం భర్తీ చేసేది..రాజన్న రాజ్యం కదా ఇక్కడ ఇలానే ఉంటుంది మరి..
💥💥మోసం :99
డ్వాక్రా అక్కాచెల్లెళ్లని ఉద్ధరిస్తానని హామీ ఇచ్చి వాళ్ళ పింఛన్ కోసం దాచుకున్న అభయహస్తం పెన్షన్ డబ్బులు 2118 కోట్ల నిధులు దారి మళ్ళించేసారు..ఇది ఉద్ధరించటమా మోసమా?
💥💥మోసం :100
మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి భవిష్యత్తులో కూడా మేము మద్యపాన నిషేధం చెయ్యము అని బ్యాంకులకి హామీ ఇచ్చి సుమారు 30వేల కోట్లు అప్పు తెచ్చారు..ఇంతకంటే పెద్ద మోసం ఈ ప్రపంచంలో ఉండదు..
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...