Jump to content

ఒకే గొంతుక వినిపించాలి: జగన్‌ 


r2d2

Recommended Posts

ap news: ఒకే గొంతుక వినిపించాలి: జగన్‌

కరోనా టీకాల సరఫరా విషయంలో ఒకే గొంతుక వినిపించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. గ్లోబల్‌ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖలో జగన్‌ స్పష్టం చేశారు. 
 రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒకే గొంతుక వినిపించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని  అందరం కోరదామని లేఖలో పేర్కొన్నారు. గ్లోబల్‌ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని ప్రస్తావించారు. వ్యాక్సిన్‌ లభ్యత విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ సరఫరా విషయంలో రాష్ట్రాలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని జగన్‌ కోరారు. వ్యాక్సినేషన్‌ వేగంగా జరగకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని లేఖలో వెల్లడించారు. కేంద్రీకృత వ్యాక్సినేషన్ ప్రక్రియ వల్ల దేశానికి ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. 

ఒక్క కంపెనీ కూడా బిడ్‌ వేయలేదు: సింఘాల్‌
కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం ఇచ్చిన కోటా సరిపోవడం లేదని, త్వరితగతిన వ్యాక్సిన్‌ వేయాలనే ఉద్దేశంతో గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రీబిడ్‌ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఒక్క కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేయలేదని, ఇవాళ సాయంత్రంతో బిడ్‌ దాఖలుకు సమయం ముగిసిందని వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా బిడ్‌ దాఖలు సమయాన్ని మరో రెండు వారాలు పొడిగించేందుకు సిద్ధమేనని, అప్పుడు కూడా  ఫార్మా కంపెనీలు బిడ్లు దాఖలు చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి అని వ్యాఖ్యానించారు. అందుకే ఈ వ్యాక్సిన్ల కొనుగోలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కేంద్రీకృతంగా జరగాలన్నదే సీఎం జగన్‌ అభిప్రాయమని పేర్కొన్నారు. కేంద్రం అనుమతిచ్చిన కంపెనీలు వ్యాక్సిన్‌ సరఫరా కోసం ముందుకు వస్తే మంచిదని, త్వరిత గతిన వ్యాక్సిన్‌ ప్రక్రియ ముగించి కొవిడ్‌ను నియంత్రించవచ్చని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌  అన్నారు. 

Link to comment
Share on other sites

enduko eedu anavasaramga central ki against velthunnadu... malli delhi vellaki..ongali.. cheekali..

he is again trying the same feat that chamba tried and miglindhi 21 now*&*

Link to comment
Share on other sites

1 minute ago, ranku_mogudu said:

enduko eedu anavasaramga central ki against velthunnadu... malli delhi vellaki..ongali.. cheekali..

he is again trying the same feat that chamba tried and miglindhi 21 now*&*

Vaadikantha scene ledhu NP gaadi strategy copy kottadu

Link to comment
Share on other sites

12 minutes ago, BeerBob123 said:

Vaadikantha scene ledhu NP gaadi strategy copy kottadu

NP evaru bro..third peg elagatledhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...