Jump to content

రూ.200కోట్ల స్థలంలో విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం - Evaru ee swamy?


Somedude

Recommended Posts

TS News: రామానుజా.. కనవా ఈ కబ్జా!

రూ.200కోట్ల స్థలంలో విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం

ట్రస్టు పేరిట కేంద్ర ప్రభుత్వ భూములు స్వాహా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, మల్లాపూర్‌, న్యూస్‌టుడే

RAMANUJA.jpg

ఓ ప్రధాన రహదారి.. పక్కనే ప్రధాన కూడలి.. దీన్ని ఆనుకొనే కేంద్ర అణు ఇంధన సంస్థ(ఎన్‌ఎఫ్‌సీ)కి చెందిన ఓ స్థలం. విస్తీర్ణం దాదాపు 5 ఎకరాలు.. విలువ రూ.200 కోట్లు. ఈ భూమిపై కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి కన్ను పడింది. ఐదేళ్ల క్రితం ఆధ్యాత్మికత ముసుగులో అక్కడ అడుగుపడింది. అంతే.. ఆ తర్వాత ఒక్కో నిర్మాణం.. తాత్కాలికంగా నిర్మిస్తున్నామంటూనే శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. పలు ఆధ్యాత్మిక కేంద్రాలూ, విగ్రహాలూ పుట్టుకొచ్చాయి. కేంద్ర సర్కారు తేరుకొని ఈ భూమి మాదేనని గుర్తించేలోపే.. జిల్లా యంత్రాంగం చేరుకునేలోపే అక్కడ ఓ వ్యాపార సామ్రాజ్యం రూపుదిద్దుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆగిపోయి ఇప్పుడు వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎన్ని ఫిర్యాదులొచ్చినా.. ఓ ప్రజాప్రతినిధి, మరో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పేరు చెప్పి బెదిరించి యథేచ్ఛగా దందా నడుస్తోంది. ఇదంతా మల్లాపూర్‌ పరిధిలోని నెహ్రూనగర్‌ బస్తీని ఆనుకొని ఉన్నా సర్వే నెంబర్‌ 43, 44ల్లో ఉన్న భూమి స్వాహా కథ.

సెలవు రోజుల్లోనే నిర్మాణాలు

మా భూముల్ని ఆక్రమిస్తున్నారంటూ ఎన్‌ఎఫ్‌సీ ఉన్నతాధికారులు, సెక్యురిటీ అధికారి మహేశ్‌ ఆజాద్‌ రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్‌ దృష్టికీ సమస్యను తీసుకొచ్చారు. అయితే తాత్కాలికంగా నిర్మాణాల్ని ఆపగలుగుతున్నా ఎన్‌ఎఫ్‌సీ సెలవు రోజుల్లో, రాత్రికి రాత్రే నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయని సెక్యూరిటీ అధికారి ఆజాద్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఆక్రమణలపై అడిగితే ప్రజాప్రతినిధుల పేర్లుచెప్పి బెదిరిస్తున్నారని.. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. కేంద్ర సర్కారు భూముల్ని వదలబోమని ఓ ఉన్నతాధికారి చెప్పారు. అన్నీ తెలిసినా ఏం చేయలేకపోతున్నామని.. ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలుంటేనే కబ్జా అడ్డుకోగలమని ఓ స్థానిక రెవెన్యూ అధికారి తెలిపారు.

ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లతో..

ఈ దందా వెనక ఒక్కరే ఉన్నారని ఇక్కడి స్థానికుల వాదన. ఎవరైనా స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి ఓ ప్రజాప్రతినిధితోపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల పేరు చెప్పడంతో పాటు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అన్నీ తెలిసినా అధికారులు ఏం చేయలేకపోతున్నారంటున్నారు.

అవి నిషేధిత భూములే..

- గౌతమ్‌కుమార్‌, ఉప్పల్‌ తహసీల్దార్‌

సర్వే నెం.43,44ల్లో ఉన్నది ఎన్‌ఎఫ్‌సీ భూములేనని నిర్ధారించాం. ఇంధన సంస్థ కాబట్టి అది బఫర్‌జోన్‌గా గుర్తిస్తాం. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత సంస్థదే. అక్కడ ఎవరూ నిర్మాణాలు చేపట్టొద్ధు గతంలో వీటిపై ఫిర్యాదులు అందితే అడ్డుకున్నాం. ఇప్పుడు కూడా సంస్థ కోరితే వెళ్లి అడ్డుకొని వారికి సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం.

మెల్లమెల్లగా ఆక్రమిస్తూ..

 

అదే వైద్యుడు తాజాగా మూడురోజుల క్రితం తాళం తెరిపించి బయటి నుంచి వచ్చిన కొందరు దాతలతో ఆధ్యాత్మిక కేంద్రమంటూ మళ్లీ భూమిపూజ చేయించినట్లు సమాచారం.

61_14.jpg
చదును చేసిన స్థలంలో వాహనాల పార్కింగ్‌ అడ్డా

 

2019 ఏడాది చివర్లో ఇక్కడ ఓ ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. ఇందులో అప్పటి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పర్యటించి ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరించారు. రెవెన్యూ సిబ్బందిని ఆదేశించి చుట్టూ కంచె ఏర్పాటు చేసి తాళం కూడా వేయించారు. అయితే పక్కనున్న స్థలంలో ప్రభుత్వ మరుగుదొడ్లు నిర్మించగా.. రాత్రికి రాత్రే వాటిని మాయం చేసి తుక్కు చేసి అమ్ముకున్నారు. ఆ స్థలాన్ని ఇప్పుడు చదును చేయించి కొందరు వ్యక్తులు వాహనాల కమర్షియల్‌ పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. చర్లపల్లి పరిశ్రమల వాహనాలకు ఈ భూమిని అద్దెకిచ్చినట్లు తెలుస్తోంది.

బఫర్‌జోన్‌ సహా...

తెలంగాణ రెవెన్యూ వెబ్‌సైట్‌లోనూ ఈ 43, 44 సర్వే నెంబర్ల భూమిని సర్కారు భూమిగా రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. నిషేధిత భూమిగా నిర్ధారించి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. దీనిపై స్థానిక వైద్యుడొకరు కన్నేశారు.

1_4113.jpg

యాభై ఏళ్ల క్రితం మల్లాపూర్‌ డివిజన్‌కు ఆనుకొని 150 ఎకరాలల్లో కేంద్ర అణు ఇంధన సంస్థ(ఎన్‌ఎఫ్‌సీ) ఏర్పడింది. బయట దాదాపు 5 ఎకరాల స్థలాన్ని బఫర్‌జోన్‌గా వదిలేసి.. చుట్టూ ప్రహరీ, వాచ్‌ టవర్లు నిర్మించారు. ఇందులో రామానుజ ట్రస్టు పేరిట ప్రైవేటు వ్యక్తులు భవనాన్ని నిర్మించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గోశాల, ఇతర నిర్మాణాలకు సన్నాహాలు చేయగా స్థానికులు, రెవెన్యూ యంత్రాంగం అడ్డుకున్నారు.

Link to comment
Share on other sites

In every city of india most of the new religious places come up on govt lands  for pure commercial purposes . 

Modi maathram ahmedabad lo ilanti places anitini theesesadu but the same hypocrites  BJP will start crying if illegal places of worship are demolished

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...