Jump to content

*రఘురామ ఫిర్యాదు- కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్.

Rajnichitti

Recommended Posts

న్యూఢిల్లీ :

*రఘురామ ఫిర్యాదు- కదిలిన కేంద్రం-జగన్ సర్కార్ కు భారీ ఝలక్.*

గత కొన్నేళ్లుగా అప్పులతో నడుస్తున్న ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం భారీ పిడుగు వేసింది.   

ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు కోసం కూడా రుణాలపైనే ఆధారపడుతున్న వైసీపీ సర్కార్ కు భారీ షాకిచ్చింది.                

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం..    

జగన్ సర్కార్ వివరణ కోరింది.                

ఏపీఎస్డీసీ ద్వారా సేకరిస్తున్న రుణాలతో సంక్షేమ పథకాలను లాక్కొస్తున్న ప్రభుత్వానికి ఇది శరాఘాతంగా మారబోతోంది.              

వచ్చే 20 ఏళ్ల మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి మరీ రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్ధికశాఖ తేల్చిచెప్పింది.

*జగన్ సర్కార్ కు భారీ షాక్*

ఏపీలో రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో గతేడాది ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా రుణాలు తీసుకుని నవరత్నాల్లోని సంక్షేమ పథకాలు నడిపిస్తున్న జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాకిచ్చింది.            

ఏపీ ఎస్డీసీ పేరుతో రుణాలు తీసుకుంటూ వాటిని సంక్షేమ పథకాలకు వాడుకోవడం,ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఆర్ధిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఇప్పుడు ప్రభుత్వంలో కలకలం రేపుతోంది.                      

ఈ లేఖలో పేర్కొన్న అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్ట సవరణ చేసి మరీ ఏపీఎస్డీసీ ద్వారా ఈ రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం కేంద్రం పంపిన లేఖతో ఇరుకునపడింది.

రఘురామ ఫిర్యాదుతో

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేసి దాని ద్వారా వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున రుణాలు సేకరిస్తోందని, ఇందుకు ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాన్ని తనఖా పెడుతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోడీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూ వేర్వేరు లేఖలు రాసి ఫిర్యాదు చేశారు.              

రాష్ట్రంలోని కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులు, ఇతర ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తీసుకుంటున్నట్లు రఘురామరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేంద్ర ఆర్ధికశాఖలోని వ్యయ విభాగం దీనిపై స్పందించింది.                

ఏపీ ప్రభుత్వం ఎస్డీసీ ద్వారా చేస్తున్న అప్పులపై రఘురామరాజు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.

దీంతో రఘురామరాజు మరో అంశంలో జగన్ సర్కార్ ను ఇరికించి నట్లయింది

ఏపీఎస్డీసీ రాజ్యాంగ విరుద్ధం

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ ద్వారా రుణ సేకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం.       

ఏపీ ఆర్ధికశాఖకు రాసిన లేఖలో పేర్కొంది.             

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవసరమైన రుణాల్ని బ్యాంకుల ద్వారా సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ఆర్ధికశాఖ జగన్ సర్కార్ కు రాసిన లేఖలో తెలిపింది.           

ఇందుకు తగిన ఆధారాలు ఉన్నట్లు వెల్లడించింది.    

వైసీపీ ఎంపీ రఘురామరాజు చేసిన ఫిర్యాదును బట్టి చూస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3), ఆర్టికల్ 266 (1)కు విరుద్ధంగా ఈ సంస్ధ ఏర్పాటైనట్లు కేంద్ర ఆర్ధికశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపిన లేఖలో తేల్చిచెప్పింది.       

ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం ఇలాంటి సంస్ధ ఏర్పాటుకు అవకాశం లేదని తెలిపింది.                  

దీంతో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటైన ఈ కార్పోరేషన్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మద్యం ఆదాయం గ్యారంటీనా ?

మద్యం ద్వారా వచ్చే 20 ఏళ్లలో లభించే ఆదాయన్ని బ్యాంకు రుణాల కోసం జగన్ సర్కార్ గ్యారంటీగా పెట్టింది.                     

అంటే మద్యం ద్వారా భవిష్యత్తులో లభించే ఆదాయంతో ఈ రుణాలు తీర్చబోతోంది. 

ఈ వ్యవహారాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సీరియస్ గా తీసుకుంది.           

మద్యంపై ఏపీ ప్రభుత్వం విధిస్తున్న అదనపు సుంకంతో ఏపీఎస్డీసీ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తీర్చడంపై ఆర్దికశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

గత ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.18500 కోట్ల మేర ఇలా రుణాలు తీసుకున్నట్లు ఆర్ధిక శాఖ తెలిపింది. 

దీంతో తమ ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం స్ధానంలో వచ్చే ప్రభుత్వాల ఆదాయాన్ని కూడా ఎలా గ్యారంటీగా పెడతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జగన్ సర్కార్ వివరణ కోరిన కేంద్రం

ఏపీలో రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్ పేరుతో ఓ సంస్ధను రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేయడంతో పాటు దానికి భవిష్యత్ ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టిన వ్యవహారంపై కేంద్రం జగన్ సర్కార్ నుంచి ఓ సమగ్ర నివేదిక కోరింది. ఏపీఎస్డీసీ ఏర్పాటుకు పాటించిన నిబంధనలు,దీని ద్వారా ఇప్పటివరకూ తీసుకున్న రుణాలు,వాటికి బ్యాంకులకు సమర్పించిన గ్యారంటీలు, మద్యం ఆదాయంపై ఇచ్చిన హామీ వంటి పలు అంశాల్ని కేంద్ర ఆర్ధికశాఖ కోరినట్లు తెలుస్తోంది.

దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది.             

ఈ వివరాలన్నీ కేంద్రానికి ఇస్తే భవిష్యత్తులో రుణాలపై కచ్చితంగా ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏపీఎస్డీసీ ద్వారా భారీ ఎత్తున రుణాలు సేకరించడం,ఇందుకోసం ప్రభుత్వ ఆస్తుల్ని, భవిష్యత్ ఆదాయాల్ని తనఖా పెట్టడంపై కేంద్ర ఆర్ధికశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో రఘురామ రాజు వ్యూహం ఫలించినట్లయింది.     

కేంద్రం వద్ద జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు రఘురామరాజు వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. ఇప్పుడు కేంద్రం అడిగే వివరాలు ఇచ్చినా సమస్యే,ఇవ్వకున్నా సమస్యే అన్నట్లుగా జగన్ సర్కార్ పరిస్దితి మారనుంది.        

ఎందుకంటే వివరాలు ఇవ్వకపోతే ధిక్కారం అవుతుంది,అలాగని వివరాలు ఇస్తే భవిష్యత్తులో ఇచ్చే రుణాలపై కచ్చితంగా ప్రభావం పడబోతోంది. 

దీంతో జగన్ సర్కార్ పరిస్ధితి ముందునుయ్యి వెనుక గొయ్యిగా మారబోతోంది.

Link to comment
Share on other sites

2 minutes ago, r2d2 said:

SoftInformalKoi-max-1mb.gif

3 yeddis cheap fellows

Okadu tirupati bhumulu amese donga yv subba yeddi

Okadu pichi mandu ammi a dabbulu jagan gadiki iche bijjaladeva reddy gadu

Okadu 16 months chippa kuda tinna pichi eddy

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, Rajnichitti said:

3 yeddis cheap fellows

Okadu tirupati bhumulu amese donga yv subba yeddi

Okadu pichi mandu ammi a dabbulu jagan gadiki iche bijjaladeva reddy gadu

Okadu 16 months chippa kuda tinna pichi eddy

state is run by caste since long.. reddy/chowdari evaru ochina ilage untai pollicies and governing.. 

cbn old and no one to take over. tdp is ready for a collapse without a leader.

Link to comment
Share on other sites

4 hours ago, Rajnichitti said:

Cbn never destroyed the state

his destruction started since the telangana movement.. he never had a stand in the bifurcation. His alliance and fight with inc later bjp left us in the situation we are now finding in.

His love for pappu, when clearly jr ntr or other stronger next generation can revive the party, not only made him lose the last elections that badly but also pushing the party closer to disintegration. 

  • Upvote 1
Link to comment
Share on other sites

Very good 

This should have been enforced the day APSDC was created ,  IVR krishna rao has been writing on its illegality since a long time. 

Hopefully in future no institution will lend to any corporation backed by AP state govt based on future revenues . 

These idiots are mortagaging future of state for short term popularity

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Vallavan said:

his destruction started since the telangana movement.. he never had a stand in the bifurcation. His alliance and fight with inc later bjp left us in the situation we are now finding in.

His love for pappu, when clearly jr ntr or other stronger next generation can revive the party, not only made him lose the last elections that badly but also pushing the party closer to disintegration. 

But he never destructed the state for personal gains...tdpp poyindhi emaindhi...verey parties untai...but thokala  raajyam la motham sarva naashanam kadhaa...not individual destruction

  • Haha 1
Link to comment
Share on other sites

55 minutes ago, RedThupaki said:

But he never destructed the state for personal gains...tdpp poyindhi emaindhi...verey parties untai...but thokala  raajyam la motham sarva naashanam kadhaa...not individual destruction

Totally agree with that.. he was a visionary.. one of the blunders he did was centralizing the IT and governance to solely hyderabad.

but for sure he is not a visionary anymore, there is no disruption he can cause to boost the state economy. that party needs new leadership and they are late already.

Link to comment
Share on other sites

6 minutes ago, Vallavan said:

Any party survival is not the point of discussion...

Which party And leaders does destructive politics to the growth of the Telugu states...obviously ys thokaa..And thokaas leaders..

CBNN party May lose...but that never was always behind growths of the states...that's what I mean bro..

Tdpp untey untundhi peekithey peekani..who cares..

Link to comment
Share on other sites

2 hours ago, Ryzen_renoir said:

Very good 

This should have been enforced the day APSDC was created ,  IVR krishna rao has been writing on its illegality since a long time. 

Hopefully in future no institution will lend to any corporation backed by AP state govt based on future revenues . 

These idiots are mortagaging future of state for short term popularity

do u think pushpams caare 

Link to comment
Share on other sites

3 hours ago, RedThupaki said:

Any party survival is not the point of discussion...

Which party And leaders does destructive politics to the growth of the Telugu states...obviously ys thokaa..And thokaas leaders..

CBNN party May lose...but that never was always behind growths of the states...that's what I mean bro..

Tdpp untey untundhi peekithey peekani..who cares..

tdp strong opposition kaadu... anduke ycp ila adtundi bro.. having a strong opposition is very important.. ledante see kcr how hes giving 10L for dalitha bandhu.. surplus state so telangana at least okay.. cbn with his kakkurthi for pappu made that party so weak..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...