Jump to content

🌹శుభోదయం🌹        *******   🌻 మహనీయుని మాట 🌻


afacc123

Recommended Posts

        🌹శుభోదయం🌹
       *******
  🌻 మహనీయుని మాట 🌻
      ******                     

"నమ్మకాలను విద్య పూర్తిగా నియంత్రించలేదు.. ఎందుకంటే నమ్మకాలు జీవన విధానమును బట్టి ఏర్పడినవి.. కానీ విద్య ఆధునీకరించగలదు"....!
     *******
   🦜 నేటి మంచిమాట 🦜
     ******               
 "ప్రతి మనిషికి తెలియకుండానే ఒక బలహీనత ఉంటుంది. అదే సానుభూతి కోసం ఎదురు చూడడమే"

🕉️🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼🕉️ 

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
        🌸పంచాంగం🌸
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,

తేదీ    ... 28 - 08 - 2021,
వారం ...  స్థిరవాసరే 【 శనివారం 】
శ్రీ ప్లవ నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
బహుళ పక్షం,

తిధి      :    షష్ఠి రా8.07
                 తదుపరి సప్తమి,
నక్షత్రం  :   భరణి తె3.53
                తదుపరి కృత్తిక,
యోగం :   వృద్ధి ఉ7.36
                తదుపరి ధృవం,
కరణం  :   గరజి ఉ7.20
                తదుపరి వణిజ రా8.07
                ఆ తదుపరి విష్ఠి ,

వర్జ్యం                  : మ12.06 - 1.52,
దుర్ముహూర్తం      : ఉ5.48 - 7.27, 
అమృతకాలం.     : రా10.37 - 12.22,
రాహుకాలం         : ఉ9.00 - 10.30,
యమగండం.       : మ1.30 - 3.00,
సూర్యరాశి.          : సింహం,
చంద్రరాశి.            : మేషం,
సూర్యోదయం.     : 5.47,
సూర్యాస్తమయం : 6.18,

               నేటి మాట

ఆ దేవదేవుని ఆశీస్సులు - మనపై కలగాలంటే???
ముందుగా మనకు త్రికరణ శుద్ధి కావాలి,
ఈరోజు మనం త్రికరణ శుద్ధిగా ఉన్నామా, లేదా అని ముందుగా, ఆలోచించుకోవాలి,
"నేడు మన మనస్సును, ఎలాంటి వాటిపై దృష్టి పెడుతున్నామో, చూసుకోవాలి!!!" 
అనవసర విషయాలపై, పనికిమాలిన విషయాలపై, పెడుతున్నాము, ఇక భగవంతుని అనుగ్రహం ఎలా కలుగుతుంది???...
మితిమీరిన కోరికలు పెట్టుకుని, అవి తీరక , బాధలు పడుతూ ... తత్ఫలితంగా దేవుడు ఇచ్చిన పవిత్ర శక్తిని కోల్పోతున్నాము,

 కోరికలు, కోపం మరియు అత్యాశ (కామ, క్రోధ మరియు లోభ) వంటి చెడు లక్షణాల కారణంగా దుఃఖానికి గురవుతున్నాము...
మనస్సుని నియంత్రించకపోతే కోరికలపై పూర్తిగా నియంత్రణ ఉండదు. 
ఒక కోరిక నెరవేరితే మరొకటి కోరుతుంటారు, వీటికి అంతు ఉండదు! ...
కోపం అనేది మన జీవితాలను నాశనం చేసే మరొక చెడు లక్షణం, కోపంతో ఉన్న వ్యక్తి ఏ ప్రయత్నంలోనూ విజయం సాధించలేక పోతున్నాము...

నిరంతరం పాపాలు చేస్తుంటాము, అందరి చేత ఎగతాళి చేయబడతాము,

కోపం కంటే ద్వేషం ఇంకా ప్రమాదకరమైనది...
ఇది దైవత్వాన్ని అనుభవించే మార్గంలో అనేక ఆటంకములను పుట్టిస్తుంది... ఈ దుష్ట లక్షణాలను అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. 
వీటిని మనలోనికి అనుమతించడం ద్వారా మృగంలా మారవద్దు...
మనము ఎప్పుడూ, మానవులమని నిరంతరం గుర్తు చేసుకోవాలి,
"మనస్సును పూర్తిగా దైవార్పణము చేయాలి, ధ్యానమో, జపమో, స్మరణయో మనకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక సాధన మార్గమును ఎన్నుకొని ఆ మార్గంలో సాగిపొతే, తప్పనిసరి ఆ దేవ దేవుని ఆశీస్సులు సదా మన, ఇంటా వెంట, ఎల్లవేళలా ఉంటాయి."

                      🌸శుభమస్తు🌸
                🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...