Jump to content

🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°: 🙏🚩మనభారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు🚩🙏


afacc123

Recommended Posts

🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:
🙏🚩మనభారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు🚩🙏

మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక లాజిక్ ఉంది.కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్లు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అందుకే.. వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలుచేశారు.
ఇప్పుడు మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం. 

1)పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడేవాళ్లు. శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు. కానీ.. మహిళలు కేవలం ఇంటిపనికే పరిమితం అయ్యేవాళ్లు. ఇలా.. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా.. ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా హైబ్లడ్ ప్రెజర్ సమస్యతో బాధపడేవాళ్లు.కాబట్టి మహిళలు.. ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు.. వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల.. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది.

2)చిన్నపిల్లలకు చెవులు కుట్టించే సంప్రదాయం అందరూ పాటిస్తారు. చిన్నపిల్లలకు ఏడుపు తెప్పించే ఈ సంప్రదాయం వెనక ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ దాగుంది. అందుకే.. ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు.మన భారత దేశం లో చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇద్దరికీ చెవులు కుట్టిస్తారు. చెవుల బయటవైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి.. ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకే .. ఈ సంప్రదాయం తీసుకొచ్చారు మన పూర్వీకులు.

3)హిందూ సంప్రదాయంలో రావిచెట్టుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చాలా పవిత్రంగా పూజిస్తారు. దీనివెనక ఆసక్తికర రహస్యం ఉంది.రావిచెట్టు అన్ని చెట్ల కంటే.. ఎక్కువ ఆక్సిజన్ ని రాత్రి పూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల.. ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండటం వల్ల.. ఈ చెట్టుని పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ గ్రహించవచ్చనే ఉద్ధేశ్యంతో.. ఈ చెట్టుకి పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు.

4)పెళ్లైన మహిళలు మట్టెలు ధరించడం మన హిందూ సంప్రదాయంలో భాగం. చాలా వరకు పెళ్లైన మహిళలంతా ఈ పద్ధతి పాటించితీరాలి. ఈ మట్టెలను కాళి రెండో వేళికి ధరిస్తారు.కాలి రెండోవేళికి మట్టెలు ఎందుకు ధరిస్తారంటే.. ఈ వేలు గర్భాశయం, గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మట్టెలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి.. రుతుక్రమం క్రమపద్ధతిలో ఉండేలా చేస్తుంది. వెండి మట్టెలే ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి, శరీరం మొత్తానికి అందిస్తుంది.

5)గంటలు కొట్టడం వల్ల మైండ్ ని రిలాక్స్ చేసి.. ఏకాగ్రత పొందుతామని సైన్స్ చెబుతుంది. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్ధం.. మెదడుకి చెందిన ఎడమ, కుడి వైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది.ఒకసారి గంట కొడితే ఏడు శబ్ధాలు వస్తాయట. ఇవి శరీరంలోని ఏడు చక్రాలను ఉత్తేజపరుస్తాయి. నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం.. వైబ్రేషన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా, క్రిములను నాశనం చేస్తుంది.

6)భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టే.. మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్ లో మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ, భూమి గురుత్వాకర్షణకు పూర్తీగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి.అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు.. ఐరన్ మెదడు దిశగా వెళ్లి.. తలనొప్పికి కారణమవుతుంది. అలాగే అల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే.. మనపూర్వీకులు అప్పటికే.. లాజిక్ గా ఆలోచించి.. అటువైపు తలపెట్టుకోకూడని చెప్పేవాళ్లు.

7)కుంకుమ పసుపు, నిమ్మ, మెర్క్యురీ మెటల్ తో తయారు చేస్తారు. దీన్ని ధరించడం వల్ల బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి, లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యురీ.. ఒత్తిడిని తొలగిస్తుంది.

8)నమస్కారం పెట్టే సంప్రదాయం వెనకా.. రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి రెండు చేతులు జోడించడం వల్ల అరచేతులు, వేళ్ల చివర్లు కలుస్తాయి.వేళ్ల చివరి భాగాలు కళ్లకి, చెవులకి, మెదడుకి ప్రెజర్ పాయింట్స్. రెండు చేతులు జోడించినప్పుడు.. మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే.. ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

9)గోరింటాకు అందంగా కనిపించడమే కాదు.. అద్భుతమైన మూలిక కూడా. గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో అప్లై చేస్తారు. పెళ్లి అంటే.. చాలా హడావుడి, ఆందోళన అని మనందరికీ తెలుసు.మెమందీ.. నరాలకు సాంత్వన అందించి.. శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు, పాదాలకు అప్లై చేయడం వల్ల.. నరాల చివర్లకు గోరింటాకు అంది.. ఒత్తిడిని దూరం చేస్తాయి.

10)మనం నేలపై కూర్చుని తినే అలవాటుని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదికూడా కాళ్లు మడతపెట్టి.. కూర్చుంటాం. దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు. ఇలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. శరీరానికి సాంత్వన ఇస్తుంది.

11)మనందరం ముందుగా స్పైసీ ఫుడ్ తినా.. చివరగా స్వీట్స్, డిజర్ట్స్ తీసుకుంటాం. ఎందుకు అని ఎప్పుడు ఆలోచించలేదా ? దీనివెనక సైంటిఫిక్ రీజన్ ఉంది.స్వీట్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి కాబట్టి.. ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణరసాలు, యాసిడ్స్ ని పొట్ట దాచుకుని.. తర్వాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది.

12)పూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే.. సంప్రదాన్ని పాటించేవాళ్లు.రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల.. రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి.. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా.. గుళ్లలో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని.. 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది.

13)ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో చాలా మలినాలు పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి శుభ్రంచేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లినింగ్ సిస్టమ్ గా మార్చారు.ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో.. జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80 శాతం నీళ్లు, 20 శాతం పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు.. శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి.. శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.ఉపవాసం డయాబెటిస్, రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.

14)మహిళలు బొట్టు పెట్టుకునే భాగం.. ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు.బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల.. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది.

15)ఆడవారు మంగళ సూత్రాలలో పగడాన్నీ ,ముత్యాన్నీ ధరిస్తారు. అవి కేవలం అలంకార ప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి.
మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. పగడం సూర్యునికి మరియు కుజునికి , ముత్యం చంద్రుని కి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుంది.

16)గర్భిణి స్త్రీలు శూర టెంకాయ తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అడురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.

♦️మీరు మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు

♦️ గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు

♦️మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.

♦️ మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.

♦️ స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.

♦️ కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమి నాసిని.

♦️ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.

♦️ నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది

♦️ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము

♦️ ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది

♦️ టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను

♦️ స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది

♦️ శుక్రవారమునాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాసము ఎక్కువ

♦️ కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ

♦️ ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు

♦️ సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు

♦️ స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.

♦️ పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను

♦️ ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు

♦️ ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి. మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భశయానికి చాలా మంచిది. కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది.
కాలి వేలికి మెట్టెలు ధరించడం వల్ల…
గర్భాశయం దృఢపడుతుంది. రక్తప్రసరణను నియంత్రించి, శరీర క్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెండితో చేసిన మెట్టెలను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధృవావేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది. కావున ఆధునిక పోకడలకు పోకుండా వివాహమైన స్త్రీలు మెట్టెలు ధరిస్తే , చక్కని ఆర్యోగ్యాన్ని పొందిన వారవుతారు.

17)మన ఇంట్లో డబ్బుల బీరువాలో మరియు రోజు వాడే డబ్బుల పరుసు లోను మన వీలును బట్టి 786 (ఓం- సంకేతం)నంబరు ఆఖరుగ ఉన్న అంటే (ఉదాహరణకు నంబరు 9HH 9000786)పది,వనఁదా,వెయ్యి ఏ నోటు అయినా పెట్టుకోవాలి .ఆ నోటును ఎప్పుడు ఖర్చుకు వాడరాదు.యిలా చేయడం అదృష్టం కలిసి రావటానికి సంకేతం.

18)మన శాస్త్రం, తరించడానికి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత ముందు దశ దానాలు చేసి తరువాత వధువు చేతిలో కొబ్బరిబోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడి కాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే.

🌷హరహర మహాదేవ శంభోశంకర🌷

🙏🚩 సర్వేజనా సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు 🚩🙏

🌷🌷హరి నామ స్మరణం 
సమస్త పాప హరణం🌷🌷

🐄🐄గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
గోశాలలను నిర్మించండి🐄🐄

🚩జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩

Link to comment
Share on other sites

 

🌷హరహర మహాదేవ శంభోశంకర🌷

🙏🚩 సర్వేజనా సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు 🚩🙏

🌷🌷హరి నామ స్మరణం 
సమస్త పాప హరణం🌷🌷

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...