Jump to content

విశాఖలో రూ.100 కోట్ల భూమిపై కన్ను.. హతాశుడైన అమెరికాలోని భూయజమాని


snoww

Recommended Posts

విశాఖలోని విలువైన భూములపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన వారి స్థలాలపై దృష్టి పెట్టి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం తప్పుడు జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) సృష్టించి తప్పుడు సంతకాలు, ఇతర వివరాలతో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే యత్నం చేస్తున్నారు. స్థల యజమానులకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి.

విశాఖ నగర పరిధి కొమ్మాదిలో రూ.100కోట్ల విలువ చేసే స్థలానికి ఈ తరహాలో రిజిస్ట్రేషన్‌ చేసేందుకు మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి డాక్యుమెంటు వచ్చింది. ఈ విషయం అమెరికాలో ఉన్న బాధితులకు తెలియడంతో అక్రమం తాలూకూ గుట్టు రట్టయింది. పోలీసులు కేసు నమోదు చేసి సూత్రధారులపై ఆరా తీస్తున్నారు.

 

బాధితుడు కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్య ప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం... అమెరికాలోని కొలంబస్‌ ఒహాయోలో నివాసం ఉంటున్న తుమ్మల కృష్ణ చౌదరికి కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి ఉంది. దాన్ని మార్కెట్‌ విలువ ప్రకారం కొనుగోలు చేస్తున్నట్లు గత నెల 20న ఓ పత్రికలో ప్రకటన వచ్చింది. ప్రకటన చూసిన విశాఖలో ఉంటున్న కృష్ణ చౌదరి భార్య బంధువులు హతాశులయ్యారు. ఓ వ్యక్తి చూపుతున్న జీపీఏ ఆధారంగా అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నారని తెలుసుకున్నారు. విషయాన్ని కృష్ణ చౌదరి దృష్టికి తేవడంతో ఆయన తాను ఎవరికీ జీపీఏ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. సుమారు రూ.వంద కోట్ల ధర పలుకుతున్న ఆ భూమిని అడ్డదారిలో కాజేయడానికి ఎవరో ప్రణాళిక రచించారని బాధితులకు అర్థమైంది. దీంతో కృష్ణచౌదరి కూడా పత్రికా ప్రకటన ఇచ్చారు. తాము ఎవరికీ స్థలాన్ని విక్రయిస్తూ జీపీఏ ఇవ్వలేదని ప్రకటించారు.

● అయినా కొందరు తమ పలుకుబడి ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలు, జీపీఏ, బ్యాంకు ఖాతాలను సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య తుమ్మల లక్ష్మీసూర్య ప్రసన్న జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌, పి.ఎం.పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు అప్పటికే ఆ భూమిని వేరే వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలుగా ఒక రిజిస్ట్రేషన్‌ నెంబరు కూడా కేటాయించారు.●

* ఫిర్యాదు ఆధారంగా కొందరు అధికారులు నేరుగా కృష్ణచౌదరితో మాట్లాడారు. ఆయన తాను ఎవరికీ జీపీఏ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తనకు విశాఖలో బ్యాంకు ఖాతా లేదని, దాన్ని కూడా సృష్టించారని చెప్పడంతో అధికారులు నివ్వెరపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

సంతకాల ఫోర్జరీ, నకిలీపత్రాల సృష్టి

 

కొమ్మాదిలో విలువైన భూమి విక్రయం యజమానికి తెలిసే జరుగుతోందని నమ్మించేందుకు అక్రమార్కులు పలు సాక్ష్యాలు సృష్టించారు. కృష్ణచౌదరి పేరిట ఒక బ్యాంకు ఖాతా కూడా తెరిచారు. మనిషి లేకుండా ఆ ఖాతా ఎలా సృష్టించారు? దానికి ఎవరు సహకరించారన్నది చర్చనీయాంశంగా మారింది. కృష్ణ చౌదరి సంతకాలను కూడా ఫోర్జరీ చేసి దొంగ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్ని, ‘స్పెషల్‌ పవర్‌ అటార్నీ’లను సృష్టించారు. కృష్ణచౌదరి పేరిట సృష్టించిన బ్యాంకు ఖాతాలో కొంత నగదు కూడా డిపాజిట్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.


బహిరంగ ప్రకటన ఇచ్చాం...

తుమ్మల కృష్ణ చౌదరి భూమిని ఆయన జీపీఏ ఇచ్చిన వ్యక్తి నుంచే కొనుగోలు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి తప్పిదాలు లేవు. ఎవరికైనా అభ్యంతరముంటే తెలపాలని బహిరంగ ప్రకటన ఇచ్చాం. దీనిపై కృష్ణచౌదరి నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. ఇష్టం లేకపోతే ఆయన స్పందిస్తారు కదా! కృష్ణచౌదరి చెప్పారనే ఆయన భార్యకు రూ.2 కోట్ల విలువ చేసే చెక్కులు ఇచ్చాం. ఆమె వాటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా చేసుకున్నారు. జీపీఏ, విక్రయ పత్రాలను ఇక్కడి నుంచి యూఎస్‌కు కొరియర్‌ ద్వారా పంపి వాటి మీద సంతకాలు చేసి తిరిగి పంపిస్తేనే రిజిస్ట్రేషన్‌కు పెట్టాం. కొందరు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారు.

- కన్నబాబురాజు, ఎమ్మెల్యే, ఎలమంచిలి

 

కొనుగోలుదారుడు ఎమ్మెల్యే కుమారుడు..: ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌, కశ్యప్‌ డవలపర్స్‌ ప్రతినిధి సుకుమార్‌ వర్మకు ఆ భూమిని విక్రయించడానికి గత నెల 26న మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరజాపు శ్రీనివాసరావు అనే వ్యక్తి డాక్యుమెంటు పెట్టారు.


విలువైన భూమిని కాజేయడానికి ప్రయత్నించారు...

నా భర్త పేరున ఉన్న రూ.వంద కోట్ల విలువైన భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి విక్రయించాలని కొందరు ప్రయత్నించారు. ఆ క్రమంలో పేపరు ప్రకటన వేయడంతో మాకు తెలిసింది. జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్‌, పి.ఎం.పాలెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాం. శ్రీనివాసరావు అనే వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్‌ను పెండింగులో ఉంచారు. మాకు ఎవరూ ఎలాంటి సొమ్ము ఇవ్వలేదు.. అసలు ఈ విషయం..నాకు గాని, నా భర్తకు గాని తెలియదు.

- లక్ష్మీ సూర్య ప్రసన్న, తుమ్మల కృష్ణ చౌదరి భార్య

Link to comment
Share on other sites

10 hours ago, ticket said:

Arey jaffas enti ra ila tayarayyaru

Bhaadhithudu: TUMMALA Krishna CHOWDHARY

Offenders: Raju

Very strange development. Earlier it used to be reverse with only CHOWS in Offenders list and every other caste in Victims list.

Things changed after 23,May,2019.

Link to comment
Share on other sites

Just now, jaathiratnalu said:

Mana vallu kabatti mana paper lo vachhindi

Bayataku raani matters inka enni vuntaye ??

Also mana vallu cheesinavi yeppudu bayataku raavu...1983-1989, 1994-2004 and 2014-2019 okka scam kooda manavaallu cheyyaleedhu. Adhi pakka nizam. 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, ysshakeela said:

Also mana vallu cheesinavi yeppudu bayataku raavu...1983-1989, 1994-2004 and 2014-2019 okka scam kooda manavaallu cheyyaleedhu. Adhi pakka nizam. 

1000% Agreed with your statement.

 

Link to comment
Share on other sites

19 minutes ago, ysshakeela said:

Bhaadhithudu: TUMMALA Krishna CHOWDHARY

Offenders: Raju

Very strange development. Earlier it used to be reverse with only CHOWS in Offenders list and every other caste in Victims list.

Things changed after 23,May,2019.

Happy tears antav.... Ippudu elli mana royals antha kalisi eddy ki thanks cheppi slavery continue cheddam.. 

Adento ee pawan anna ki pranam istam but jaganna ke vote Vestam batch mari intha teda gallu.. Vallu gain ayyedi lekapoyina ado sunakandam.. 

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, jaathiratnalu said:

Mana vallu kabatti mana paper lo vachhindi

Bayataku raani matters inka enni vuntaye ??

idi common business for every party leader. Jaffas, pulkas, bakths leaders andaridi ide business.  Naa cousin gaadi land andhra lo matter leni pushpam batch mla mingesadu 5 years back. And he used to be a strong BJP supporter believing  they are corruption free. 

Meeku em ina lands vunte careful gaa vundandi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...