Jump to content

Tv9 telugu moose time vachindi


csrcsr

Recommended Posts

8 hours ago, Pulkapresident said:

Lol, he is a quack. 

He is not claiming himself as a doctor… and he is not forcing anyone to follow his diet…not doing for money… His success stories are just a biproduct of his method. nammakam unnodu following… 

I wish he does an @rgv style when responding to those butthurt quacks participated in the debate 

  • Upvote 2
Link to comment
Share on other sites

🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
*టీవీ9 బిగ్ ఛాలెంజ్ VRK డైట్ VS IMA లో ఆర్నాబ్ లాగా వోర్లి వొర్లి బోర్లా బడ్డ రజనీ కాంత్,IMA, డాక్టర్ పేర్లు చెప్పుకునే డయాబేటీస్ ట్రీట్మెంట్ మీద బ్రతికే క్వాక్స్, మరియు బిగ్ ఫార్మా దోపిడీ దారులు ఆశలు పటా పంచలు అయి వారి ద్రోహం ప్రజలికి నగ్నం గా కళ్ళకు కట్టాయి తొలి  కుట్రదారుడు రజనీ కాంత్ రెండు వర్గాల మీటింగ్ మొదలెట్టక ముందు దుర్మార్గం గా IMA కు అనుకూలం వీరమాచినేని గారి మీద వేసిన నేరారోపణ లు అత్యంత జుగుప్స కలిగాయి.* *ఆ సమయం లో బెబ్బులి వీరమాచినేని చూసి బాధేసింది. రజనీ కాంత్ మీద కోపాగ్ని పెల్లుబికింది. అశోక్ రెడ్డి రౌడీ డాక్టర్ VRK వైపు చూపుడు వేలు పెట్టి కటకటాలు లో వేయాలి ఈ క్వాక్ ను అన్నప్పుడు వంట్లో ని  రక్తం సల సలా కాగి వూగి పోయింది శరీరమంతా. నాలుగేళ్ళు ప్రజల ఆరోగ్యం కోసం నిస్వార్థం గా కాలు కు బలపాలు కట్టుకొని   ప్రజలకు వాళ్ళ ఆరోగ్యం కొరకు చెవినిల్లు కట్టుకొని, ప్రజల చెవుల్లో జోరీగ లాగా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక నిస్వార్థం గా ఆస్తులర్పించి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళకు పట్టని ప్రజల నోట్ల నుంచి ఆరోగ్య సూత్రాలను వల్లె వేపించటం  మామూలు విషయం కాదు. వీరమాచినేని కి ఎన్ని డాక్టరేట్ లిచ్చినా ఆయన కాలి గోటికి చాలవు.డాక్టరేట్ లు ఎన్నిచ్చినా తక్కువే ఈ అశోక్ రెడ్డి, రౌడీ డాక్టర్, అభినవ అర్బాబ్ రజనీకాంత్ చేసిన అవమానాలు ముందు. ధన ప్రాణాలు లెక్క చేయని ఒక మంచి పనికి ఇంత అవమానమా?డాక్టర్ అశోక్ రెడ్డి, రజనీ కాంత్ చరిత్ర ద్రోహులు గా నిలబడ తారు. వారిని చరిత్ర ఎప్పటికీ క్షమించదు. వారి జీవితం మొత్తం మాయని మచ్చ లాగా వెంటాడి దహించి వేస్తుంది.*
**********************************

*మిత్రుడు రజనీకాంత్ డయాబెటిస్ తగ్గిస్తారా అని వాళ్ళని అడగాలి నిజానికి. ఒక్కడికి కూడా తగ్గించలేదు అల్లోపతి.. కాబట్టే ప్రపంచంలో చనిపోయిన వారిలో షుమారు 50% డయాబెటిక్ సంబందిత దుష్ఫలితాలు తో మరణిస్తున్నారు.. అంటే ఎంత మోసం అర్ధం చేసుకోవచ్చు.*

*ఇప్పుడు రజనీకాంత్ లాంటి మోడరేటర్ నేను ఏదైతే నేను చేయగలను అని చెప్తున్నానో దాని గురించి అడిగితే ఖచ్చితంగా స్టాంప్ పేపరు మీద రాసి ఇస్తాను.*
*నేను జీవితంలో చెప్పనిది, ఎన్నడూ క్లెయిం చేయని అంశాన్ని అడిగితే ఎలా అంగీకరిస్తాను?*
*నేను ప్రజలకు మీటింగ్ లో చెప్పింది "నా డైట్ తో మిమ్మల్ని డయాబెటిస్ మీరు తెచ్చుకున్న ముందు రోజుకు మాత్రమే తీసుకెళ్తాను.* *గతంలోలా విచ్చలవిడిగా తింటే మరలా వస్తుంది. ఒక పద్దతిలో నా పోస్ట్ డైట్ ప్రొటోకాల్ ప్రకారం తింటే రిజల్ట్ నిలబడి ఉంటుంది." అని స్పష్టంగా చెప్పాను.*
*రజనీకాంత్ నన్ను సంతకం పెట్టమంది "విచ్చలవిడిగా తిన్నా రాదు" అని.*
*అసలు ఇదేమన్నా పద్దతిగా ఉందా.. నేను ఎప్పుడూ చెప్పని విషయం గురించి నేనెలా ఒప్పుకుంటాను.. అది కూడా ప్రక్రుతికే అసాధ్యం అయిన విషయం ఎలా అడగగలరు..??*
*కావాలంటే నాలుగేళ్ళ క్రితం HbA1c 12+  ఉండి అప్పుడు 5 లోపు వచ్చి మూడు నాలుగేళ్ళ రెగ్యులర్ పోస్ట్ డయట్ లో 6 దాటని వారిని రిపోర్టు లతో సహా చూపిస్తాను. వేల రిపోర్టు లు.. అల్లోపతిలో అలా ఒక్క రిపోర్టు చూపించినా మందులతో తగ్గిన వారిని నేను నా డైట్ కంప్లీట్ వాపసు చేసుకోవటానికి సిద్దం.*
*గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం మూలంగా తెచ్చుకున్న రోగాలను అదే మెటబాలిజం లో ఉంటూ సరిచేయటం సాధ్యం కాదు. అందుకే డయాబెటిస్ తో పాటు మిగిలిన జీవనశైలి వ్యాధులకు చనిపోయే వరకు మందులు వాడుతున్న పరిస్థితి..* 
*జీవనశైలి వ్యాధులకు ఒకే ఒక్క పరిష్కారం ఆహార విధానంలో మార్పు.. కేవలం మెటబాలిజం మార్పు ద్వారా మాత్రమే జీవనశైలి వ్యాధులు తగ్గుతాయి. ముఖ్యంగా మందులు పారేసి తాత్కాలికంగా కొంతకాలం ఫాట్ మెటబాలిజం కు షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే డయాబెటిస్ తగ్గుతుంది..*
*అల్లోపతిలో మందులతో  రక్తంలో షుగర్ మాయం అవుతుంది కానీ శరీరం నుంచి కాదు. అందుకే డయాబెటిక్ మరణాలు మొత్తం మరణాలలో 50 శాతం.. డాక్టర్లు మోసం చేయటం లేదు.. వారికి వారి సొంతవారికి కూడా అదే వైద్యం చేసుకొంటున్నారు కదా..! ఈ మోసపు విధానాన్ని అనధికారికంగా గైడ్ లైన్స్ చేశారు తప్ప ఎలాంటి ప్రామాణికత, సైన్సు పునాది లేదు.. కాబట్టే నేను మెటఫామిన్, ఇన్సులిన్ తో డయాబెటిస్ తగ్గిన సైన్స్ పేపర్లు చూపండి అని నిలదీస్తే దాటవేశారు తప్ప ఇదిగో ఆధారం అని చూపలేదు.*

*అలాగే నా డైట్ ఫెయిల్ అయిందని వారు తీసుకొచ్చిన వ్యక్తి బోగస్ క్లెయిం అని రుజువు అయ్యింది. నేను మూడు పూట్ల కొబ్బరినూనె 70x3=210 ml అని చెప్పానా? అలాగే కూరగాయల జ్యూస్ NO అని నేను చెప్తే అదే తాగింది అని అతను చెప్తున్నాడు.. నిజానికి ఇది 2017లో కేసు. కాజీపేట ఆమె నా డైట్, మంతెన డైట్, చపాతీలు మిక్స్ కొట్టి చేసింది.*
*పొటాషియం కొద్దిగా తగ్గితే ICU లో ఎవడన్నా పెడతారా?*

*ఇది కాకుండా IMA పచ్చి అబద్దాలు. నేను ఎప్పుడూ మాస్కులు, వాక్సిన్ లు, సోషల్ డిస్టెన్స్ లు వద్దు అని చెప్పలేదు.. వేరే సందర్భంలో చెప్పిన మాటలతో వక్రీకరించబోయి వారే అభాసుపాలు అయ్యారు.. వేక్సిన్లు వేసుకోండి కానీ కరోనా రాదు అని నమ్మకుండా ఇతర జాగ్రత్తలు తీసుకోండి అంటే అవి విరుద్ధం ఎలా అవుతాయి. అందరూ అదే కదా చెప్పేది..*

*నాతో రెండు ఇంటర్వ్యూ లలో మాట్లాడిన డాక్టర్ల బిహేవియర్, వారి ట్రైగ్లిజరాయిడ్స్, వెజిటేరియన్స్ కు డయాబెటిస్ రాదు, కొబ్బరినూనె తో గుండె జబ్బులు వస్తాయి లాంటి హాస్యాస్పద అవగాహన, మెడిసిన్ దమ్ముంటే చదువు లాంటి బుకాయింపులు చూశాక ఇక నేను వారితో సమీప భవిష్యత్తు లో డిబేట్ చేసి నా విలువైన సమయం వ్రుధా కానివ్వాలనుకోవటం లేదు.*

*కాన్సర్ తగ్గించినందుకు చైనా అవార్డు, పేరు పెట్టి గౌరవం ఇచ్చిందంటే చైనా లో చదివినోడు ఇక్కడ ప్రాక్టీస్ చేయడు అనే వితండవాదం. ఆ యూనివర్సిటీ ఇండియా కు కోవిడ్ గైడ్ లైన్స్ ఇస్తే తీసుకుంటారు.. అదే యూనివర్సిటీ నాకు అవార్డు ఇస్తే తూచ్..*

*మేము కూడా డైట్, ఎక్సరసైజ్ చెప్తున్నాం అంటున్నారు. వారు చెప్పేది గ్లూకోజ్ డైట్.. చెప్పాల్సింది ఫాట్ డైట్ కదా..* 

*మాట్లాడితే కేసులు అని బెదిరిస్తే లొంగే రకమా నేను..*

*కల్తీ తేనెల మీద, కెమికల్ రిఫైండ్ ఆయిల్ మీద ఒక్క డిబేట్ జరగదు ఏ ఛానల్లో కూడా..*

*కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మన తెలుగు డైట్ ను ఖచ్చితంగా కాన్సర్ తో సహా అనేక రోగాలకు అత్యుత్తమ పరిష్కారంగా మెడికల్ టెక్ట్ బుక్స్ లో ఎక్కించి తీరతాను.. మీ అందరి సహకారంతో..*
*VRK హెల్త్ ఫౌండేషన్* ( వాసుదేవరావు జరుబుల)
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
వీరమాచినేని రామకృష్ణ గారు.. 
*కేవలం*  ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న ఈ సేవ మరియు పోరాటం.. చరిత్ర లో  శాశ్వతం గా *అలా* నిలిచిపోతుంది సార్. ఎంతో మంది పుడతారు . 
మరెంతో మంది ఎవరికీ తెలియకుండానే పోతారు. 
కానీ.. మీ లాంటి వాళ్లు.. ఇప్పుడు మాతో ఇలా ..ఉండటం....మేం చేసుకున్న అదృష్టం గా భావిస్తాం. 
కానీ అల్లోపతీ మెడిసన్ మన ప్రజల జీవనం లో విడదీయలేని ఒక భాగం గా ఒక పద్దతి ప్రకారం మార్చేశారు. ఇన్ని సార్లు చెబుతున్నా.. ఇంత గా మొత్తుకున్నా.. ఇప్పటికీ గుడ్డిగా.. వాళ్ళని నమ్మే శాతం ప్రజలు ఇంకా  ఎక్కువగానే ఉన్నారు. వాళ్ళని వాళ్ళ మానాన వదిలేయలేమూ.. బలవంతం గా మార్చనూలేము

కానీ  సార్ మీరు..  గుండె నిబ్బరం, ధైర్యం, విజ్ఞత, సంయమనం, పోరాటపటిమ కలగలిపిన మనిషి కాబట్టి ఇలాంటి ఎన్నో ఎదురుదెబ్బలు ఎదురవుతున్నా ముందుకు సాగుతున్నారు. 
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా.. సైన్స్ అనే నిజం ఎప్పటికీ మారదు కాబట్టి.. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ శాతం క్రమంగా పెరుగుతూనే ఉంది..
సమాజంలో జరుగుతున్న మంచి వల్ల నష్టపోయే వారివైపు నుండి వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది. 
వాటన్నింటినీ దాటుకొని..ప్రజలకి నిజమైన విజ్ఞానాన్ని పంచుతూ.. వారి ఆరోగ్యాలను కాపాడుతూ
ఉన్న మీరు *పది కాలాల* పాటు *క్షేమంగా* ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🙏

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...