Jump to content

What is this new Green Card (GC) Immigration Bill?


SRH

Recommended Posts

18 minutes ago, SRH said:

someone pls explain

employment-based immigrant applicant with a “priority date that is more than 2 years before” can adjust to permanent residence without numerical limits by paying a “supplemental fee of $5,000.”

Link to comment
Share on other sites

Green card: ఫీజు చెల్లిస్తే గ్రీన్‌కార్డ్‌.. అమెరికా కొత్త బిల్లులో ప్రతిపాదన

 

ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాల్లో ప్రతి దేశానికీ ఏడు శాతం పరిమితి ఉంది. దీంతో హెచ్‌-1బీ పని వీసాలపై వచ్చిన వారు గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ జనాభా కలిగిన భారత్‌, చైనా వలసదారులు ఈ నిబంధనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదిత బిల్లు కాపీని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయారిటీ డేట్ దాటి రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు. అదే ఈబీ-5 వీసాదారులు అయితే 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఈ ప్రతిపాదిత బిల్లులో గ్రీన్‌ కార్డుల కోసం దేశాల కోటాను ఎత్తివేయడం, హెచ్‌1బీ వీసా వార్షిక కోటాకు సంబంధించిన పరిమితులు ఎత్తివేయడం వంటి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని శాశ్వత నిర్మాణాత్మక మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవు. అలాగే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే జ్యుడీషియరీ కమిటీ ఆమోదించాలి. ఆ తర్వాత ప్రతినిధుల సభ, సెనేట్‌ ఆమోదం పొందాలి. అనంతరం అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాలుస్తుంది. ఒకవేళ ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే అమెరికాకు చిన్నవయసులో వచ్చినవారు, తాత్కాలికంగా రక్షణ పొందినవారు, వ్యవసాయ కూలీలు, మహమ్మారి కాలంలో అత్యవసర కార్మికులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఓ విధంగా వీసాలపై ఉన్న పరిమితిని ఎత్తివేసినట్లేనని ఇమ్మిగ్రేషన్‌ పాలసీ అనలిస్ట్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్‌, చైనీయులే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. 

 

https://www.eenadu.net/nationalinternational/latestnews/us-bill-proposes-permanent-residency-for-a-fee/0700/121188397

Link to comment
Share on other sites

Uscis process delay ani Twitter lo & senates daggata bags hadavidi chestunnaru, so issue ni divert cheyadani ki antee. Mana ind's mentality to ni baga catch cheaarj.

Leader lo gollapudimaruthi raoul dialogue vundi ga same formula 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...