Jump to content

కొవిడ్‌ వచ్చిందని రూ.కోటి నొక్కేశారు!


r2d2

Recommended Posts

కొవిడ్‌ వచ్చిందని రూ.కోటి నొక్కేశారు!

కరోనా సోకి ఆర్థికంగా తలకిందులైన ఎన్నో కుటుంబాలను చూశాం. అన్ని రకాలుగా కుదేలైన వాళ్ల పరిస్థితి చూస్తే అయ్యోపాపం అంటాం. అలా ‘జాలి’ చూపించడమే ఓ వ్యక్తిని నిండా మునిగేలా చేసింది. కొవిడ్‌ పేరు చెప్పి ఆ ముంబయి వాసి నుంచి ఏకంగా రూ.1.3 కోట్లు కొట్టేశారు కిలేడీ తల్లీ కూతుళ్లు. ఆరునెలల తర్వాత ఆ మోసగాళ్లను ఉత్తర ముంబయి సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

59 ఏళ్ల బాధితుడు ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉన్నతోద్యోగి. ఆరునెలల కిందట ఒక సామాజిక మాధ్యమంలో 46 ఏళ్ల మహిళ పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరు సన్నిహితులయ్యారు. తర్వాత తను కథలు చెప్పడం మొదలుపెట్టింది. తన భర్త, పెద్దకూతురు కొవిడ్‌తో చనిపోయారనీ, బిల్లులు కడితేనే ఆసుపత్రి వాళ్లు మృతదేహాలు అప్పగిస్తామని అంటున్నారని నమ్మబలికింది. అదంతా నమ్మి బాధితుడు అడిగినంతా డబ్బు ఇచ్చాడు. అయినా ఆమె ఆశ తీరలేదు. కొద్దిరోజులకు ఆ మహిళ చిన్న కూతురినంటూ 22 సంవత్సరాల అమ్మాయి రంగంలోకి దిగింది. ‘మా అమ్మ కూడా కరోనా బారిన పడింది. వైద్య ఖర్చులకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలి’ అని అడిగింది. అప్పుడు కూడా ఆ వ్యక్తి గుడ్డిగా నమ్మేసి భారీగా మొత్తం ఇచ్చాడు. 

కొన్నాళ్లకు ఆ కిలేడీ మరో నాటకానికి తెర తీసింది. అమ్మ చనిపోయింది. అంత్యక్రియలు కూడా డబ్బులు లేవంటూ అడిగింది. కొద్దిరోజులయ్యాక మాకున్న ఆస్తులు అమ్మి మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికింది. అమాయకంగా ఆ మాటలు నమ్మాడు తను. కొన్నాళ్లయ్యాక డబ్బులు ఇవ్వమని ఆ కూతురిని అడిగితే.. తల్లీకూతుళ్లిద్దరూ సోషల్‌ మీడియా ఖాతాలు తొలగించి పత్తా లేకుండా పోయారు. అప్పుడు అనుమానం వచ్చిన ఆ పెద్ద మనిషి సైబర్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ మహేశ్‌ దేశాయ్‌ రంగంలోకి దిగి కిలేడీల కోసం గాలింపు చేపట్టారు. చివరికి వారిద్దరూ ముంబయి సమీపంలోని భివాండిలో పట్టుబడ్డారు. వారి దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో బంగారం, రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Link to comment
Share on other sites

Corporate lo high position lo unnna 59 years person...atla story vini nammi anni dabbulu okkate lady/family ki ichhi mosapovadam ante nammettatu ledu...Inka edo expect cheyadamo/edo story jarigi untadi...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...