Jump to content

సైడవుతున్న సజ్జనార్.. డీసీపీ చుట్టు బిగుస్తున్న ఉచ్చు?


JackSeal

Recommended Posts

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ అంతే. నిందితులకు తగిన శాస్తి జరిగిందని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. కానీ.. పోలీసులకు మాత్రం ఎన్ కౌంటర్ తలనొప్పిగా తయారైంది. దీనిపై విచారణ జరుపుతున్న కమిషన్ ముందుకు తాజాగా గత సైబరాబాద్ సీపీ సజ్జనార్ హాజరయ్యారు. దిశ హత్యాచార కేసు దర్యాప్తుతో తనకేం సంబంధం లేదని.. విచారణను తాను పర్యవేక్షించలేదని.. ఎప్పటికప్పుడు వివరాలు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ప్రత్యేక బృందాలు సమాచారం ఇవ్వలేదన్నారు. దిశ హత్యచార కేసు విచారణను డీసీపీ ప్రకాష్ రెడ్డి పర్యవేక్షించారని చేతులెత్తేశారు. ప్రతీరోజూ ఉదయం టెలీకాన్ఫరెన్స్‌ లో కేసు స్టేటస్ ను మాత్రమే తనకు చెప్పారని స్పష్టం చేశారు. నిజానికి ఎన్ కౌంటర్ తర్వాత పొగడ్తల వర్షం కురిసింది సజ్జనార్ పైనే. ఆయన సూపర్ కాప్ అంటూ ఆకాశానికేత్తేశారు అంతా. కానీ.. విచారణలో మాత్రం తనకేం తెలియదని చెప్పడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

సజ్జనార్‌ ను దాదాపు 2 గంటలపాటు విచారించిన కమిషన్ 45 ప్రశ్నలు సంధించింది. దిశ హత్యాచార కేసు దర్యాప్తు జరిగిన క్రమం, సిబ్బందికి ఆయుధాల కేటాయింపు, స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం (ఎస్‌వోటీ), తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. నిందితులను అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని 2019 నవంబరు 29 సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌ డీసీపీ ఫోన్‌ లో చెప్పారని సజ్జనార్‌ వివరించారు. సాయంత్రం 5.30 గంటలకు నిందితులను పట్టుకుంటే.. అదే రోజు రాత్రి 7 గంటలకు శంషాబాద్‌ డీసీపీ కార్యాలయంలో ప్రెస్‌ మీట్‌ ఎలా పెట్టారు..? గంటన్నరలోనే కేసు సమాచారమంతా ఎలా తెలిసింది..? కొద్ది సమయంలోనే ఇదంతా ఎలా సాధ్యమైందని కమిషన్‌ ప్రశ్నించింది. శంషాబాద్‌ డీసీపీ ఫోన్‌ లో సమాచారం ఇచ్చినప్పుడు తాను ఎయిర్‌ పోర్టులో ఉన్నానన్నారు సజ్జనార్. అక్కడి నుంచి నేరుగా డీసీపీ ఆఫీస్ కు వెళ్లినట్లు.. ఆయన సూచన మేరకే ప్రెస్‌ మీట్‌ నిర్వహించినట్లు సమాధానమిచ్చారు. శంషాబాద్‌ డీసీపీ ఇచ్చిన సమాచారాన్నే ప్రెస్‌ మీట్‌ లో చెప్పారా..? అని కమిషన్ ప్రశ్నించగా.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించానని చెప్పారు. దీంతో విచారణ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితులు దిశ స్కూటీ టైర్‌ గాలి తీశారు.. నోట్లో వస్త్రం కుక్కి హత్యాచారం చేశారు? ఇవన్నీ సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయా? అని ప్రశ్నించింది కమిషన్. ఆ ఫుటేజీ లేదని, ఘటనాస్థలంలో లభించిన దుస్తులు, పర్స్‌, కార్డులు, నిందితుల కాల్‌ డేటా రికార్డులను పరిశీలించానని చెప్పారు సజ్జనార్‌. సైబరాబాద్‌ చాలా పెద్ద కమిషనరేట్‌ అని, శాంతిభద్రతల పర్యవేక్షణకు తాను ఇంచార్జినని, అన్ని కేసులను పర్యవేక్షించడం కష్టమన్నారు. అయితే ఒక సీనియర్‌ పోలీస్ అధికారి అయి ఉండి ఇలా చెప్పడం కరెక్ట్ కాదని సజ్జనార్‌ పై కమిషన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ పోలీస్‌ మాడ్యుల్‌ లోని 43 ప్రకారం ఆయుధాల రిజిస్టర్‌ ఎస్పీ-సీపీ ఆధీనంలో ఉండాలని, ఆ రిజిస్టర్‌ తన దగ్గర ఎందుకు లేదో వివరణ ఇవ్వాలని సజ్జనార్‌ ను ప్రశ్నించింది కమిషన్. ఆ పనిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగం చూస్తుందని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారాయన. నందిగామ, అమన్‌ గల్‌ ఎస్‌హెచ్‌వోలకు ఆయుధాల కేటాయింపు వివరాలను రిజిస్టర్‌ లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించగా.. పోలీస్ స్టేషన్లకు ఎస్‌హెచ్‌వోలు మారగానే ఆయుధాలు కొత్తగా వచ్చే అధికారులు తీసుకుంటారని, వాటిని ప్రత్యేకంగా రిజిస్టర్‌ లో నమోదు చేయరని సమాధానం ఇచ్చారు. హత్యాచార కేసు విచారణకు ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌ లాంటి ఆరు భారీ ఆయుధాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించగా.. శంషాబాద్‌ డీసీపీ సూచన మేరకు కేటాయింపు జరిగిందన్నారు. ఎన్‌ కౌంటర్‌ కేసు విచారణలో కమిషన్‌ అడిగిన పలు ప్రశ్నలకు సజ్జనార్‌ సమాధానాలు దాటవేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...