Jump to content

చైనాలో స్థిరాస్తి బుడగ పేలనుందా? ప్రపంచానికి మాంద్యం భయం


Peruthopaniemundhi

Recommended Posts

చైనాలో స్థిరాస్తి బుడగ పేలనుందా?

నేడు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా కాదు... చైనా అని మెకిన్సే అంతర్జాతీయ సంస్థ ఇటీవల తేల్చిచెప్పడం ఎందరినో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 2000-2020 మధ్య కాలంలో చైనా సంపద ఏడు లక్షల కోట్ల డాలర్ల నుంచి 120 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అదే సమయంలో అమెరికా నికర సంపద 90 లక్షల కోట్ల డాలర్ల వద్దనే నిలిచిపోయిందని మెకిన్సే వెల్లడించింది. అమెరికాకన్నా చైనాలో స్థిరాస్తుల ధరలు విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. అమెరికాలో 2008లో స్థిరాస్తి గాలి బుడగ పేలి యావత్‌ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పుడు చైనావల్లా అటువంటి ఉపద్రవమే వచ్చిపడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎవర్‌ గ్రాండే వంటి బడా చైనీస్‌ స్థిరాస్తి సంస్థలపై మొత్తం అయిదు లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఉందని ఫైనాన్స్‌ సంస్థ నొమురా అంచనా వేసింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ కంపెనీలు ఎడాపెడా అప్పులు చేశాయి. గడచిన నాలుగేళ్లలో అవి రెండింతలయ్యాయి. ఎవర్‌ గ్రాండే తన రుణాల్లో పెద్ద భాగాన్ని ఇటీవల చెల్లించింది. ఫాంటాసియా, ఖైసా గ్రూప్‌తో సహా మొత్తం నాలుగు కంపెనీలు రుణాలను ఎగవేయాల్సిన దుస్థితిలోకి జారిపోయాయి. గత సెప్టెంబరులో తమ విక్రయాలు అంతకుముందు ఏడాదికన్నా 35శాతం తగ్గిపోయాయని 100 బడా చైనీస్‌ స్థిరాస్తి కంపెనీలు తెలిపాయి. స్థిరాస్తి రంగం చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి 29శాతం వాటా సమకూరుస్తోంది. ఈ రంగం పతనమైతే చైనాకే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ లక్ష కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని యూబీఎస్‌ గ్రూపు లెక్కకట్టింది. చైనా నిర్మాణ రంగం ఇతర దేశాల నుంచి ఉక్కు, సిమెంటు, లోహాలతోపాటు నిర్మాణ సామగ్రిని, భారీ వాహనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. అవి పడిపోతే ఆస్ట్రేలియా, వియత్నాం, బ్రెజిల్‌ వంటి దేశాలకు నష్టం ఎక్కువగా ఉంటుంది. చైనాకు ఎగుమతులు నిలిచిపోతే పలు దేశాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు భారీగా నష్టపోతారు.  

 

అమెరికా తరహా సంక్షోభం చైనాలో చోటుచేసుకోదని చాలామంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2020లో చైనా మధ్యతరగతి కుటుంబాలు తమ ఆదాయంలో 33.9శాతాన్ని పొదుపు చేశాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా. 2019లో చైనా జాతీయ పొదుపు రేటు 44శాతమైతే, అమెరికాలో అది 18శాతమే. 2019లో చైనా కుటుంబాలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన సొమ్ము భారత్‌, బ్రిటన్‌, రష్యా, బ్రెజిల్‌, ఇటలీ దేశాల మొత్తం జీడీపీకన్నా ఎక్కువ. చైనీయులు గృహ ధరలో 60శాతాన్ని మాత్రమే బ్యాంకు రుణంగా తీసుకొని, మిగతా 40శాతాన్ని పొదుపు నుంచే చెల్లిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికన్లు సొంత పొదుపు నుంచి చేసే ఆరంభ చెల్లింపు మూడు నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది. ఇది బ్రిటన్‌లో 5-15 శాతంగా, జర్మనీలో 20శాతంగా ఉంది. అందువల్ల చైనాలో స్థిరాస్తి ధరలు 20-30శాతం తగ్గినా, రుణ ఎగవేతలు కొంత పెరిగినా బ్యాంకింగ్‌ రంగం తట్టుకొంటుందని పేర్కొంటున్నారు.

ఇంతకాలం పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులపైనే ఆధారపడిన చైనా, పోనుపోను పాశ్చాత్య సంపన్న దేశాల మాదిరిగా అంతర్గత వినియోగం, సేవా రంగాల విస్తరణ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని లక్షిస్తోంది. అమెరికా, ఐరోపా తదితర ఓఈసీడీ దేశాల ఆర్థికాభివృద్ధిలో 73శాతానికి అంతర్గత వస్తుసేవల వినియోగమే ఆధారమని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చాటుతున్నాయి. గత తొమ్మిదేళ్లుగా చైనా సైతం అంతర్గత వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నందువల్ల, నేడు జీడీపీలో వినియోగం వాటా 56శాతానికి చేరింది. చైనా ప్రజలను స్థిరాస్తి, షేర్ల కొనుగోళ్లకు ప్రోత్సహిస్తూ జీడీపీలో వినియోగం వాటాను ప్రభుత్వం పెంచుతోంది. దీనివల్ల స్థిరాస్తి మార్కెట్‌ మితిమీరి వేడెక్కి ఎవర్‌ గ్రాండే తదితర కంపెనీలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి చైనా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటోంది. పైగా చైనాలో పట్టణీకరణ జోరు తగ్గకపోవడంవల్ల ఇళ్లు, అపార్ట్‌మెంట్లకు గిరాకీ తగ్గదనే చెప్పాలి. ప్రస్తుతం ఆ దేశ జనాభాలో 60శాతం నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్నారు. 2050కల్లా ప్రతి అయిదుగురు చైనీయుల్లో నలుగురు (112 కోట్లమంది) పట్టణాల్లో నివసిస్తారని అంచనా. అందువల్ల స్థిరాస్తి రంగానికి ఢోకా ఉండదని, కొవిడ్‌ కల్లోలం సద్దుమణిగాక చైనాలో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకొంటుందని కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...