r2d2 Posted November 27, 2021 Report Share Posted November 27, 2021 తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకోడానికి గులాబీ దళం ప్రయత్నించినా, 6మాత్రమే దక్కి, మిగతా 6చోట్ల ఎన్నిక అనివార్యమైంది. అన్నిటిలోకీ, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడి రెండు స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, టి.భానుప్రసాద్ సహా మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందరిలోకి కరీంనగర్ మాజీ మేయర్, టీఆర్ఎస్ తిరుగుబాటు నాయకుడు సర్దార్ రవీందర్ సింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ (CM KCR) పై తిరుగుబావుటా ఎగరేసిన సర్దార్.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో సాధించిన ఫలితాన్నే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ చేస్తారనే అంచనాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ లో ఉద్భవించిన సరికొత్త వర్గం, సీఎం కేసీఆర్ పోకడలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూటీ, బీటీ బ్యాచ్ కాదు, కొత్త వర్గం టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడొక సరికొత్త వర్గం పుట్టుకొచ్చింది. ఇప్పటిదాకా పార్టీలో.. ఉద్యమ తెలంగాణ (యూటీ) బ్యాచ్ , బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్ కాకుండా కొత్తగా మెయింటనెన్స్ బ్యాచ్(ఎంటీ) కూడా మొదలయిందని, తప్పుడు పద్దతులు, అక్రమ మార్గాల్లో ఎన్నికలను మేనేజ్ చేయడమే ఈ కొత్త బ్యాచ్ పని అని, కరీంనగర్ లో ఎమ్మెల్సీ స్థానానికి తన నామినేషన్ ను కూడా అడ్డుకోవాలని ఈ బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నించిందని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. తన నామినేషన్ ను తిరస్కరించే ప్రయత్నం జరిగిందని, తనకు మద్దతిచ్చినవాళ్లపై టీఆర్ఎస్ సర్కారు అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టిందని సింగ్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
AverageDesiGuy Posted November 27, 2021 Report Share Posted November 27, 2021 Hopefully he can win! Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.