Jump to content

Thoughtful content abt overater poets- must read -


chinnapillalabandi

Recommended Posts

#నిగ్గదీసి_అడుగు
#అగ్గితోటి_కడుగు
(సంవత్సరం క్రితం రాసింది)

"కష్టజీవికి ఇరువైపులా వుండేవాడే కవి" అంటాడు శ్రీశ్రీ. 
"కవి చేసే అంతర్ బహిర్ యుద్దారావమే కవిత్వం" అంటాడు చలం. 
అంటే కష్టజీవికోసం కవిచేసే అంతర్ బహిర్ యుద్దం కవిత్వం. మరి ఇతడు చెప్పే కవిత్వంలో కష్టజీవి ఎక్కడున్నాడో, అతడికోసం చేసే అంతర్ బహిర్ యుద్దారావం ఎంత వినిపిస్తోందో, రండి జేబుల్లో చేతులు పెట్టుకుని విందాం:

తరతరాలుగా అక్షరాల్ని పుట్టుకతో నేర్చి వ్యాపారం చేసుకున్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని నువ్వు.  అలాంటి నీకే తెలియని వాక్యాల్లో అతడు రాశాడంటే, ఎవరికోసం రాశాడు? ఎందుకోసం రాశాడు? పోనీ ఏం రాశాడు? 

కొన్ని కోట్ల సంవత్సరాలుగా నిరంతరాయంగా ఉదయించే సూర్యుడిని 99% ప్రజలకు అర్థంకాని విధంగా కీర్తించడంలో అంత గొప్పదనం వుందా? మరి సూర్యునికన్నా ముందేలేచి నాగలి భుజాన వేసుకుని, ఆ సూర్యుడు లేచేసరికి అరెకరం పొలందున్ని ఈ ప్రపంచాన్ని నడిపిస్తోన్న రైతు గురించి నీ కవి ఎన్నడూ రాయడా? అప్పుడు తమిళనాడు రైతులు గావచ్చు, ఇప్పుడు పంజాబు రైతులు గావచ్చు, అతడిని దోపిడీ చేస్తోంటే, ఆ దోపిడీ మీద అన్ని కష్టాలకోర్చి అక్కడ ఉద్యమిస్తున్నప్పుడు ఆ రైతుగురించి రాయనివాడు కవెలా అయ్యాడోయ్? అతడిది కవిత్వం ఎట్లాగైందోయ్? నువ్వు దాన్ని గొప్పగా ఉటంకించడమెట్లైందోయ్? కింద సీట్లలో కూర్చున్నవాళ్లకు, అందులో ఏ అద్భుతం కనిపించిందని ఖాలీ తలకాయల్ని తన్మయంగా వూపుతున్నారోయ్?

"కొంపెల్ల జనార్ధనరావుకోసం"లో శ్రీశ్రీ రాసి విసిరిన "ఇదిగో ఇక్కడ నిలబడి ఆవాహన చేస్తున్నాను, అందుకో ఈ చాచిన హస్త"న్ని ఈ దేశంలో నిరుద్యోగులూ, స్త్రీలూ, కిందికులాలవాళ్లూ, మైనారిటీలూ, పంట రైతులూ తమని కుల హత్యలనుండి, మత మారణహోమాలనుండి, ఆత్మహత్యల నుండి, మానభంగాలనుండి కాపాడమని ఇన్నాళ్లుగా చేయి చాపలేదా? ఈ ప్రభుత్వాలమీద, సంప్రదాయాలమీద గొంతెత్తమని చెప్పడం లేదా? అలా గొంతెత్తి జైళ్లలో మగ్గుతోన్నవారికి కనీసం ఒక సానుభూతి వాక్యమైనా రాయాల్సిన అవసరాన్ని ఇతడు అవాహన చేసుకోడా? వూకదంపుడు అవినీతి అనేది రాసేటప్పుడు అసలు ఈ దేశంలో తరతరాలుగా ఎవరు చేస్తున్నారో తెలియదా? ఎవరు అవినీతిపరులో, లెక్కలతోపాటు పత్రికలు రాస్తున్నప్పుడు ఒక్క వాక్యంలోనైనా తను వాళ్ళని సూటిగా ప్రశ్నించడా? 

అవును రాయలేడు, నిజానికి రాయడానికి శక్తికావాలి, ధైర్యం కావాలి, నీతి వుండాలి. రీతిగా బ్రతకడం నేర్చాలి. కానీ ఇవన్నీ లేకుండా సూర్యుడిమీదా, చంద్రుడిమీదా, పువ్వులమీదా రాయడానికి నువ్వు చెప్పిన “అలవోకతనం” సరిపోతుంది.

ఏమయ్యా? "వసంతం తనంతట తానే తరళి వస్తుందా?, తన దగ్గరికి రాని వనాలకోసం?" ఇలా రాసేటప్పుడు సిగ్గుపడాలి, గుడుంబా తాగించడం కన్నా, ఇలా పాట రాసి మోసపుచ్చడం ఇంకా ద్రోహం! ఏం ఈ దేశంలో వూరిబయట అంటరానివాళ్ల దరికి రాదా? పేదల వద్దకు రాదా? నిజానికి ఇలా రాయడమంటే సోమరిపోతుతనాన్ని మేపడం కాదా? ఏమీ? తరళి వస్తుందా వసంతం? ఏం, ఇన్ని తరాల తర్వాతైనా ఏ అంటరాని కులస్తుడి ఇంటికి మన స్త్రీని వాళ్ల కోడలుగా తరళించామా? వాళ్లే స్వయంగా వూర్లోకి వూరేగింపుగా వస్తావమని ఉద్యమిస్తే, రోడ్డుమీదే పెళ్లికొడుకుని చావగొట్టి, పెళ్లి బృందాన్ని తరిమెయ్యడం లేదూ? అంటే బ్రతుకులో వసంతం పండించుకుందామని కుటుంబాన్ని కన్నీళ్ల మధ్య వదిలేసి కువైట్ వెళ్లినవాడూ, బెంగుళూరులో వసంతం వెదుక్కుందామని వలసకూలీగా వెళ్ళినవాడు వెర్రివాడంటావు? వసంతం పండించడానికి పొలాలకు, కర్మాగారాలకూ బయలుదేరే వాళ్లను వద్దంటావ్? వసంతాన్ని వెదుక్కుంటూ తామే చలిలో బయలుదేరిన డిల్లీ ఉద్యమిస్తోన్న రైతులది తప్పంటావ్? ఇంట్లో పడుకుంటే వసంతం తనే వస్తుందంటావ్? దమ్మిడీ కష్టం చేయకుండా ఇట్లా అబద్దాలు చెప్పడానికి నోరెట్లా వస్తుంది? 

నిజమే స్పేస్ లేదు, స్పేస్ లేనప్పుడు పడికట్టు, కనికట్టు పదాలతో అవకాశాల్ని దొంగలించడంలో ఆరితేరిన చేయి, సామాన్యుల విముక్తి కోసం అక్ష్యరాస్యతని ప్రభోదిస్తూ జాతికోసం ఒక పాటరాయదు గానీ లక్షల్లో రెమ్యునరేషన్ కోసం స్త్రీ శరీరంతో అక్ష్యరాస్యత నేర్పించగలదు “బలపం పట్టి భామ వొల్లో అఆ ఇఈ” అంటూ, నువ్వు  దాన్ని గొప్పగా కీర్తించగలవు.

నిజమే “రాత్రిళ్లు టేబిల్ మీద ఆయన ఖర్చుపెట్టిన క్షణాలు, ఆయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన వదులుకున్న కుటుంబం, ఆయన మాట్లాడలేని మనుషులు.. ప్రపంచమంతా పడుకున్నప్పుడు ఆయన లేస్తాడు,” చల్లని ఏసీగదిలో ఒక చేత సిగరెట్, మరో చేతిలో మందుతో టేబిల్ మీద నాలుగు అక్షరాలు రాయడం భూమ్మీద అత్యంత కష్టమైన పని అని నిజంగా తెలియదబ్బా! 

ఆయన ఎవరికోసం రాత్రిళ్లు ఖర్చుపెట్టాడయ్యా? ఒక్కో వాక్యానికి ఒక్కో లక్ష తీసుకోవడం లేదా? ఏం ఆయన రాత్రిళ్లు చీకట్లో పురుగూ పుట్రా తొక్కుకుంటూ వెళ్లి పొలానికి నీళ్ళు పెడుతున్నాడా? నిశ్శబ్ద రాత్రి విజిల్ వూదుతూ గూర్ఖాగా కాపలా కాస్తున్నాడా? ఏం బ్యాంకు ముందు రాత్రంగా కాపలా కాసిన సెంట్రీ డ్యూటీ చేస్తోంటే, మట్లాడడానికి మనుషులులు దొరకలేదా? అవును ఆసుపత్రుల్లో, పోలీసు స్టేషన్లలో, ఆ మాటకొస్తే నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే ప్రతి మనిషీ, నువ్వనే  “ రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు, పదాలు అనే కిరణాలు, అక్షరాలు అనే తూటాలు తీసుకుని, ప్రపంచమీదకు వేటకు బయలుదేరతాడు.” ఆయినా పగలంతా నిద్రపోయి, రాత్రి నిద్రరాక, తిన్నది అరగక గదిలో తిరుగాడే ప్రతివాడు, పబ్బుల్లో రాత్రంతా తాగి తందానాలాడే ప్రతివాడూ సూర్యుడు అవడమంటే, అది ప్రాగ్దిశ వీణియపైన, మయూఖ తంత్రులపైన నడిచిన దివాకరుడికి ఎనలేని అవమానం అంటగట్టడం కాదా!

ఆయన రాశాడు, సరే, ఎవరికోసం రాశాడు? వాక్యానికో లక్ష తీసుకుని దాన్ని సిగరెట్ ముక్కలకీ, మందు బాటిళ్లకోసం కాదా? నువ్వే చెప్పినట్లు మాలాంటి వాళ్ళచేత  “తినడానికే డబ్బుల్లేని సమయంలో సినిమా టికెట్టుని కొనిపించడానికేగా?” 

“రండి నాకు సమాధానం చెప్పండి. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని మనమీదకు సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు, హాల్లో కూర్చొంటాడు, బెడ్రూంలో పక్కనే వస్తాడు” అవునా? అతడు ఇప్పటిదాక సంధించిన ప్రశ్నలెన్ని? సినిమా పాటలు గాకుండా అతడు రాసిన కవితలెన్ని? ప్రభుత్వంచేత నిషేదించబడిన కవితలెన్ని? రాసిన రాతలకు పోలీసు స్టేషన్లో కూర్చొన్న క్షణాలెన్ని?  సినిమా పాటలు గాకుండా కనీసం ఒక్కడికైనా  ఇతగాడు రాసిన ఒక్క కవితైనా తెలుసా? సినిమాలకోసం సింగారాల్ని వర్ణించి రాసి అమ్ముకున్న కవితలకు విలువెక్కడదయ్యా? 

సినిమా పాటలనే కవిత్వమనీ, అదో అద్భుతమనీ పొగిడిన నీ మాటల్ని వింటే ఒకపక్క తుపాకీని ఒక చేత్తో సవరించుకుంటూ మరో చేత్తో కవిత్వపు అక్షరాలతో అడవుల్లో కూడా అక్షర సేద్యం చేసిన విప్లవ కవుల నేమనాలి? “ఉద్యమపు నెలబాలుడి”కి ప్రాణం పోసిన శివసాగర్ లాంటి వాళ్ల కవిత్వం ఎంత విలువైంది కావాలి? ఏముకలు విరగ్గొట్టి మురికి కాలువలో పడేసినా మనుషుల హక్కులకోసం రాసిన రచయితల నేమనాలి? హవాయి చెప్పులేసుకుని, భుజమ్మీద గుడ్డ సంచీతో తిరుగుతూ రాసిన బాలగోపాల్ని ఏమనాలి? ఏనభై ఏళ్ళ ముదిమిలో కూడా అండాసెల్లో నిర్బంధించబడి, జైలు గోడల మధ్యనే కవిత్వం రాస్తోన్న వరవరవరరావు నేమనాలి? 

ఒక నిజాన్ని కీర్తించకపోవడం తప్పుకాకపోవచ్చు గానీ, ఒక అబద్దాన్నే నిజంచేయాలని కీర్తించే నీలాంటి వాళ్ల మోసం వుంది చూశావూ, అది అత్యంత గర్హనీయమైనది.

“అర్దశతాబ్దపు అఙ్ణానాన్నే స్వతంత్రమందామా?” అనడానికి పెద్ద నిజాయితీ అక్కర్లేదు, కనీసం ఒక్కరికైనా అక్షరఙ్ణానం కలిగించడానికి నిజాయితీ కావాలి. ఈ సమాజం చేత ఒక్క మూఢనమ్మకమైనా, ఒక్క అవలక్ష్ణణమైనా, మానిపించడానికి, ఒక్క మనిషిలోని ఒక్క తప్పిదమైనా ఎదిరించడానికి  ధైర్యం కావాలి. ఆది అతడిలో వుందా? ఎన్నడైనా ఒక్క సంప్రదాయాన్నైనా, ఒక్క వ్యవస్థనైనా, ఒక్క వ్యక్తినైనా అతడు ప్రశ్నించగలిగాడా? 

“నిగ్గదీసి అడుగు సిగ్గులేని సమాజాన్ని” అన్నాడతడు, కమాన్, సమాజంలో భాగమైన మనిషిగా, ఇంత స్పృహ వున్న మనిషిగా ఏ దమనకాండమీదైనా సిగ్గుపడినట్లు ప్రభుత్వాల మీద నిరసన తెలిపాడా?  కరంటు బిల్లులు కట్టలేక జనం ఉద్యమం చేస్తే ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయి, తూటాలు దింపాయి, ఆడపిల్లని పాశవికంగా అత్యాచారం చేసి చంపుతున్నారు, మతం కారణంగా నదిఒడ్డున నీళ్లతో పాటు నెత్తురు పారించారు, కులం కారణంగా మనుషుల్ని పొలల్లో ఎరువుకింద తొక్కేసి పూడ్చారు.  దేశంలోని మేధావులంతా, కవి గాయకులంతా అయా కాలాల్లో అయా రీతిలో తెలిపిన నిరసన పత్రం మీద ఎన్నడైనా ఒక్కసారైనా ఒక్క చిన్న సంతకమైనా చేశాడా? నిజానికి ఇతడు, ఇతడిలాంటి మీరంతా  అగ్గితో కడగాల్సిన జీవచ్చవాలు.

సామాన్య జనం టిక్కెట్లకు పుట్టినోళ్లుగా మీకు ఆ సామాన్య జనం పట్ల కృతఙ్ణత, ఇక్కట్ల పట్ల కనీస పట్టింపులేదు.  పైగా పట్టింపుగల కవిగాయకులని గాకుండా ఇలాంటి వాళ్లని పైకెత్తడం అంటే ద్రోహం చెయ్యడం.  నిజానికి అతడి గురించి నువ్విలా భజన చేయడంకన్నా నీతిమాలిన తనం మరోటిలేదు. కింద తలలూపే సభికులకన్నా గొర్రెతనం మరోటిలేదు. అవున్లే, వినేవాళ్లంతా వెధవలైతే చెప్పేవాడల్లా ఙ్ణానే అవుతాడు.

"నీలాంటి వాళ్లు చేతులు జేబుల్లో పెట్టుకుని ఏక్కడికో నడుచుకుటూ గమ్యంలేకుండా పోతారడనం" శుద్ద అబద్దం. మీకు స్పష్టమైన లక్ష్యం వుంది, దానికనుగుణమైన కక్ష్యా వుంది. మీరు అందులో నడుస్తారు జేబులనిండా డబ్బూ, కీర్తీ, సుఖాలూ కుక్కుకుని, ఒడుపుగా కోసుకున్న మా మతిలేని తలకాయల్ని గొంతులో పూమాలగా ధరించి, దేదీప్యమానంగా ప్రకాశిస్తూ.. - socialist

Link to comment
Share on other sites

Assal ee picchi pithre gallu edupu thappa em undoddhu? Did he see sitarama shastrys room? Nenu 12 lo vellina … chala normal ga untadhi. Smoking habit undhi kani drink cheyyadu. Ayana room lo fan thappa Ac lu , PC lu em undav …. Antha thelivunna M koduku veede velli ayanala songs rasi ayana kanna pedda writer ayipoyi … room lo ac em karma? Restroom lo kuda pettinchukomanu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...