Jump to content

Sachin bhajana


BattalaSathi

Recommended Posts

odiyamma..manavatvam chaatukunnadu ante veedemanna feekademo anukunna..."good job" ani oka twee vesadanta/kalisi thanks cheppadanta.  danike intha buildup aa?  idhi bhajana at a different level!

 

 
eenadu.net
 

అందుకేనేమో ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది: సచిన్‌

Eenadu
2-3 minutes

Published : 18/12/2021 01:12 IST

అందుకేనేమో ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది: సచిన్‌

171221sachinn-twittr-srr1.jpg

ఇంటర్నెట్ డెస్క్‌: సచిన్‌ తెందూల్కర్‌ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తన స్నేహితురాలు తీవ్రంగా గాయపడిన సమయంలో తక్షణమే స్పందించిన పోలీసును, పౌరులను ట్విటర్‌ వేదికగా సచిన్‌ అభినందించారు. అంతేకాకుండా సదరు ట్రాఫిక్‌ పోలీసును నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పినట్లు వెల్లడించారు. దేవుడి దయ వల్ల బాధితురాలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘‘ఇటువంటి పౌరులు ఉండటం వల్లనేమో ప్రపంచం చాలా అందంగా ఉంటుంది’’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. 

‘‘కొద్ది రోజుల కిందట నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే దేవుడి దయతో ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీస్‌, అక్కడి చుట్టుపక్కల పౌరులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమయానికి ఆటోలోనే తీసుకెళ్లి మరీ ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలో ఆ పోలీసు అధికారిని నేను కలిశా. ఆయన చేసిన సాయానికి ధన్యవాదాలు చెప్పా. ఆ అధికారి మాదిరిగానే పౌరులు కూడా సందర్భోచితంగా స్పందించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాలి. మనమందరం కూడానూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలి. అజాగ్రత్తలే  కొన్నిసార్లు ఇతరుల జీవితాలను ప్రమాదంలోకి పడేసే అవకాశం ఉంటుంది’’ అని ట్విటర్‌లో సచిన్‌ రాసుకొచ్చారు.

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...