Jump to content

Missed PK movies...didnt workout for some reasons


Kakynada

Recommended Posts

https://telugu.filmyfocus.com/list-of-movies-that-were-shelved-in-pawan-kalyans-career/

Nuvve kavali Pk chesthey vera laval lo undedemo  mari....

1. చెప్పాలనివుంది

 

1.-Cheppalani-Undhi-1024x539.jpg

2000లో తరుణ్, రిచా హీరో హీరోయిన్స్ గా దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం నువ్వే కావాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పెట్టుబడికి 20 రెట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీని పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు. చెప్పాలనివుంది అనే టైటిల్ తో మూవీ ప్రకటించడం కూడా జరిగింది. అమీషా పటేల్ హీరోయిన్ గా నటించాల్సివుంది. కారణం ఏదైనా ఈ ప్రాజెక్ట్ నుండి పవన్ తప్పుకోవడంతో తరుణ్ కి గ్రేట్ ఎంట్రీ లభించింది.

2. సత్యాగ్రహి

2.-Satyagrahi-1024x539.jpg

ఓ పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో సత్యాగ్రహి అనే చిత్రాన్ని పవన్ తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ టైటిల్ ప్రకటనతోనే సినిమాకి భారీ హైప్ వచ్చి చేరింది. ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సత్యాగ్రహి సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించి, నటించాలని పవన్ భావించారు. అప్పటికే తన దర్శకత్వంలో వచ్చిన జానీ ఘోర పరాజయం పొందడంతో పవన్ ఆ ఆలోచన విరమించుకున్నారు.

3. దేశి

3.-Deshi-1024x539.jpg

దేశి అనే మరో చిత్రాన్ని కూడా దేశభక్తి కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ తెరకెక్కించాలనుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. కారణం ఏదైనా పవన్ చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు.

4. ప్రిన్స్ ఆఫ్ పీస్

4.-Prince-of-Peace-1024x539.jpg

వైవిధ్యంగా ఆలోచించే పవన్ కొన్ని డిఫరెంట్ సబ్జక్ట్స్ కూడా ఎంచుకున్నారు. వాటిలో ప్రిన్స్ ఆఫ్ పీస్ కూడా ఒకటి. ఈ చిత్రంలో పవన్ లార్డ్ జీసస్ పాత్ర చేయాల్సివుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాల్సిన ఈ మూవీ మధ్యలో ఆగిపోయింది. 2010లో జెరోసలేం లో ఓ షెడ్యూల్ కూడా మొదలుపెట్టిన తరువాత మూవీ ఆగిపోయింది.

5. కోబలి

5.-Kobali-1024x539.jpg

పవన్ ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ లో కోబలి ఒకటి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కాంబినేషన్ లో సోసియో ఫాంటసీ మూవీగా కోబలి తెరకెక్కించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అప్పటిలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బడ్జెట్ సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలైనా కావచ్చు మూవీ మాత్రం పట్టాలెక్కలేదు.

6. పవన్ – లారెన్స్

6.-pawan-kalyan-raghava-lawrence-1024x53

నటుడు దర్శకుడు మరియు కొరియా గ్రాఫర్ లారెన్స్ కూడా పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ ప్రకటించడం జరిగింది. భారీ బడ్జెట్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ వీరి కాంబినేషన్ లో రానుందని ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ సైతం ముందుకు వెళ్ళలేదు.

7. పవన్- వివి వినాయక్

7.-Pawan-Kalyan-V.V.Vinayak-1024x539.jpg

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ పవన్ తో మూవీ చేస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. అత్తారింటికి దారేది చిత్రం తరువాత వివి వినాయక్ తో మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం ఛాల్చలేదు.

8. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

8.Pawan-Kalyan-with-Puri-Jagannadh-1024x

 

దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బెస్ట్ మూవీస్ లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఒకటి. 2003లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు హీరో రవితేజ స్టార్ హీరోగా ఎదగడానికి పునాది వేసింది. నిజానికి ఈ స్క్రిప్ట్ పవన్ కోసం పూరి రాసుకున్నారు. బద్రి సినిమా తరువాత వీరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయి. దానితో ఆయన ఈ ప్రాజెక్ట్ కి హీరోగా రవితేజను ఎంచుకున్నారు. పవన్ ఈ మూవీ చేస్తే దాని ఫలితం మరో స్థాయిలో ఉండేది.'

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...