Jump to content

Maha Yagna with 1.5 lakh kg of pure ghee 🔥 🔥


JackSeal

Recommended Posts

ఒక పది కట్టెలు తెచ్చి ఒక చోట వేసి, దానిలో ఏదో ఒక ఆయిల్ వేసి అంటిస్తే వచ్చేది మంట. అదే పని సంక్రాంతి పండుగ ముందు రోజు చేస్తే భోగిమంట. అదే పని పక్కన మంత్రాలు చదువుతూ చేస్తే యజ్ఞం. వీటి అన్నిటిలో నుంచి వచ్చేది వేడి, కార్బన్ డై ఆక్సైడ్.

ఒక స్వామివారు షుమారు రెండు లక్షల కిలోల నెయ్యి, కొన్ని టన్నుల కలప మీద పోసి మంట వేస్తారట. మరో భాషలో యజ్ఞం చేస్తారట. సరే, అది మత ఆచారం. అది ఏ మతమైనా వారి మనోభావాలు దెబ్బతినేలా మనం ప్రవర్తించకూడదు సమాజానికి హాని చేయనంత వరకు. నేనూ మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు చేశాను. మీరు పుణ్యం వస్తుంది అంటే నేను మాట్లాడను..అది ఒకరి నమ్మకం. కానీ ఇక్కడ సమస్య కొంతమంది ఒక కిలో నెయ్యి తగలబెడితే ఒక టన్ను అంటే వెయ్యి కిలోల ఆక్సిజన్ పుడుతుంది అని చెప్తున్నారు, కొన్ని పోస్టులు పెడుతున్నారు. వారికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు ఒక వస్తువు తగలబడితే అంతకు వెయ్యి రెట్లు బరువైన మరొక వస్తువు వస్తుందా! ఇది ఏ సైన్స్ కి అందని న్యూసెన్స్. మనుషుల్లో కనీసం ఉండాల్సిన బేసిక్ జ్ఞానం కూడా లేకుండా పోతుందా అనే బాధ కలుగుతుంది ఇటువంటి వారిని చూస్తే.

దయచేసి, ప్రజల్లో పిచ్చి నమ్మకాలను పెంచకండి.

నెయ్యి కొంచెం మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దానిలో రకరకాల విటమిన్లు ఉంటాయి. కానీ పొయ్యి మీద దానితో వంటలు చేసేటప్పుడు 170 డిగ్రీల Centigrade దాటిన తర్వాత నెయ్యిలో ఉండే విలువలు కోల్పోవటం జరుగుతుంది. నెయ్యి తినటం మానకండి. కానీ కొంచెం మాత్రమే తీసుకోండి. పెరిగే పిల్లలకు మరీ మంచిది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...