Jump to content

Shinnayana meda jaggadi prema.. in his sisters words


psycopk

Recommended Posts

నా తండ్రి హత్యను రాజకీయంగా వాడుకుని జగన్ లబ్ధిపొందారు: వివేకా కుమార్తె సంచలన వాంగ్మూలం 

28-02-2022 Mon 09:35
  • హత్య గురించి చెబితే జగన్, భారతి చాలా తేలిగ్గా తీసుకున్నారు
  • తన భర్తపైనే అభాండాలు మోపారు
  • చిన్నాన్న కంటే కాంపౌడర్‌కే విలువిచ్చారు
  • సీబీఐతో విచారణ జరిపిస్తే అవినాశ్ రెడ్డి బీజేపీలో బీజేపీలో చేరుతాడన్నారు
  • రూ. 104 కోట్ల వ్యవహారం కూడా హత్యకు కారణమై ఉండొచ్చు
  • వాంగ్మూలంలో డాక్టర్ సునీత
Doctor Sunitha Statement comes into light on vivekas murder

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత 7 జులై 2020న సీబీఐ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో పలు కీలక విషయాలను ఆమె వెల్లడించారు. తన తండ్రిని చంపిన హంతకులు వారే అయి ఉండొచ్చంటూ అన్న (జగన్) వద్ద కొందరి పేర్లను ప్రస్తావించానని, దానికి ఆయన ఇచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. వారిని అనవసరంగా అనుమానించొద్దని అన్నారని పేర్కొన్నారు. దీంతో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరానని చెప్పారు. అందుకు జగన్ బదులిస్తూ.. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ఏమవుతుందని, అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరుతాడని, అతడికేమీ కాదని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 11 కేసులకు మరోటి తోడవుతుంది తప్పితే ఒరిగేదీమీ ఉండదన్నారని జగన్ చెప్పడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. అంతేకాదు.. వాళ్లను అనుమానించొద్దని, బహుశా నీ భర్తే హత్య చేయించాడేమోనని అనడంతో తన గుండె పగిలినంత పనైందని వాపోయారు. 

అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్ కుమార్‌రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్ కోప్పడ్డారని అన్నారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా కాంపౌండరే ఆయనకు ఎక్కువ అయ్యారని పేర్కొన్నారు. తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి సంబరాలు చేసుకునేందుకు బాణసంచా కొనుగోలు చేసిన వ్యక్తిని ఎలా వదిలిపెట్టారో అర్థం కావడం లేదన్నారు. తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన తండ్రిపై కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. హత్య విషయాన్ని తొలుత భారతికి, ఆ తర్వాత జగన్‌కు ఫోన్ చేసి చెబితే.. అవునా.. అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, వారిలో ఇసుమంతైనా బాధ కనిపించలేదని అన్నారు. 

తండ్రి మరణవార్త తెలిసిన తాము పులివెందులకు బయలుదేరామని, తాము వచ్చే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని చెప్పానని, అయినప్పటికీ కాసేపటి తర్వాత ఫోన్ చేసి పోస్టుమార్టం పూర్తయిందని, కుట్టువేసి కుట్టేశారని చెప్పారని డాక్టర్ సునీత పేర్కొన్నారు. అంతేకాదు ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని తెలిసింద్నారు. నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని నిర్ధారించుకున్నట్టు చెప్పారు.

నాన్న హత్యతో ఎన్నికల్లో జగన్ లాభపడ్డారని, హత్యను సానుభూతి కోసం వాడుకుని ప్రయోజనం పొందారని అన్నారు. తన తండ్రి హంతకులను శిక్షించాలని అన్న జగన్‌ను, సజ్జల, సవాంగ్ తదితరుల సమక్షంలో బతిమాలినట్టు గుర్తు చేసుకున్నారు.  ఉదయ్‌కుమార్‌రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎంవీ కృష్ణారెడ్డి(వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్‌రెడ్డే హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదని అనడంతో జగన్‌తో వాగ్వివాదానికి దిగానని చెప్పారు.

సీబీఐతో విచారణ జరిపిస్తే దోషులు ఎవరో తేలుతుందని చెబితే, అలా ఏమీ జరగదని, అవినాశ్ వైసీపీని వీడి బీజేపీలో చేరుతాడని అంతకుమించి మరేమీ జరగదని అన్నారు. అంతేకాదు, జగన్‌పై ఉన్న 11 కేసులకు మరోటి చేరుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోయానని అన్నారు. తనకు తెలిసినంత వరకు.. భరత్ యాదవ్, సునీల్ యాదవ్‌తో కలిసి తన తండ్రి రూ. 104 కోట్ల వ్యవహరాన్ని సెటిల్ చేశారని, అందులో తన తండ్రికి రూ. 4 కోట్లు వచ్చాయని అన్నారు. అందులో భరత్, సునీల్ వాటా డిమాండ్ చేస్తే కోటిన్నర రూపాయలకు ఎక్కువ ఇవ్వనని తేల్చి చెప్పారని, తన తండ్రి హత్యకు బహుశా ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందన్నారు.  

తన తండ్రి, పెదనాన్న(రాజశేఖరరెడ్డి)కి ఉమ్మడిగా ఉన్న 600 ఎకరాలను జగన్, షర్మిల, తనకు  సమానంగా తలా 200 ఎకరాలు పంచారని, ఆ తర్వాత ఎకరం లక్ష చొప్పున తన నుంచి ఆ ఆస్తిని వెనక్కి తీసుకున్నారని అన్నారు. అవినాశ్‌తతో తన భర్త కుమ్మక్కైనట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఆస్తి మొత్తానికి తానే వారసురాలినని డాక్టర్ సునీత చెప్పుకొచ్చారు.  

Link to comment
Share on other sites

I dont know and dont understand cbi is leaking(making public) the statements given by witness and victims in this case. Definitely life threatening to the people who gave these statements 

  • Like 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

I dont know and dont understand cbi is leaking(making public) the statements given by witness and victims in this case. Definitely life threatening to the people who gave these statements 

same thing happened...Jagan ni CBI vaallu investigate chesinappudu...leaks vadilaru CBI valllu mana media ki.

Link to comment
Share on other sites

57 minutes ago, anandam2012 said:

same thing happened...Jagan ni CBI vaallu investigate chesinappudu...leaks vadilaru CBI valllu mana media ki.

JD Lakshmi narayana used to talk to the press all the time.. all these officers like the attention they get.. and there are few motormouths.. 

Link to comment
Share on other sites

2 hours ago, Vaampire said:

I dont know and dont understand cbi is leaking(making public) the statements given by witness and victims in this case. Definitely life threatening to the people who gave these statements 

These are not recent statements.. these are all old statements recorded by cbi and submitted to the court… the investigating agencies talk to the press a lot both formally and informally… 

And some of the news could be just speculation (gas) too.. 

Link to comment
Share on other sites

5 hours ago, Vaampire said:

I dont know and dont understand cbi is leaking(making public) the statements given by witness and victims in this case. Definitely life threatening to the people who gave these statements 

CBI leak cheyyadam kaadhu. Other lawyers ki court lo cheppinavi ivvali. Konni court lo cheppina vangmulam. There is another benfit for CBI giving this info - Ee case lo CBI ni shankisthu CBI investigating officer meedha Kadapa lo caselu vesaru. Vesindhi kooda ee case lo unna muddhayule. Its good CBI is providing this info to public. Entha mandhini champuthaaru? CBI ki statement icchinavaallu ippati varaku oka 20 members unnaru. andharani champuthaara?

Link to comment
Share on other sites

6 hours ago, Android_Halwa said:

Yeah..CBN CM avalsindi…shinnayana murder valle jaggadiki 151 seats vachinayi..

Poor CBN..5 years development antha shinnayana murder mundu niluvaledu

Mari appatlo cbn ye sampesadu antivi kada ra potti

Link to comment
Share on other sites

3 hours ago, southyx said:

CBI leak cheyyadam kaadhu. Other lawyers ki court lo cheppinavi ivvali. Konni court lo cheppina vangmulam. There is another benfit for CBI giving this info - Ee case lo CBI ni shankisthu CBI investigating officer meedha Kadapa lo caselu vesaru. Vesindhi kooda ee case lo unna muddhayule. Its good CBI is providing this info to public. Entha mandhini champuthaaru? CBI ki statement icchinavaallu ippati varaku oka 20 members unnaru. andharani champuthaara?

Akkada cm okka psyco gaadu. Sampina samputhadu 20 members ni. Okkaridharini champina migitha andaru maata marustharu.

ap lo champithey prob avuthadi anukuntey tg lo champutharu. Elago kcr tho manchi friendship undi.

 

 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

43 minutes ago, mettastar said:

Sontha family lo kuda kabja lu .. em family ra 

ayya bathikunnappudu CM seyyamani thala boppi kattisthivi ...

jail lo unnappudu selli ni road la pai thippinchi...bayataki raagane ki asthilo vaata eggotti state bayataki pampisthivi..

sinnayannani ki swarga dwaralu open seyisthivi

amma ki old age lo manasanthi lekunda sesthivi

inka sinnayana koothurini intha kante baaga emi treat sesthavu lee..

 

emi ra jagga nee valla rashtraniki upayogam.... ee maata ante opposition charithra theesatharu jaffas...anthe kaani veetini mathram evadu kandhu ani ana leru..suffort seyyaleru

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...