Jump to content

RRR -- future la alluri ante RRR cinema reference teeskuntaru


vaakel_saab

Recommended Posts

Copeid from google
 
రాముడు ౼౼ భీముడు :
పేరు సూడంగనే పాత ఎన్టీవోడి సినిమా అనుకునేరు. కాదులెండి. నాకు తెలిసిన ఇద్దరు గొప్ప నాయకుల కథ. రాముడేమో అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర ప్రాంతం వాడు. భీముడు తెలంగాణోడు.
నాకు తెలిసిన ఈ రాముడు చిన్నప్పటి నుంచీ తెల్లోళ్ల అరాచకాలు చూస్తూ పెరిగినోడు. యుక్త వయసు రాంగనే ఆంగ్లేయులను ఎలా తరిమికొట్టాలి , స్వతంత్రంగా ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ దేశాటనం చేసి దేశ నాయకులను కలిసి ఆలోచనలు పంచుకొని , గోదావరి తీరాన అటవీ ప్రాంతంలో ఒక సాధువులాగా తపస్సు చేసి , గిరిజనుల చేత మన్నెం దొరగా పిలవబడి, చెప్పి మరీ పోలీసు స్టేషన్ లపై దాడి చేస్తూ 2 సంవత్సరాల కాలం ఇంగ్లీషు వాళ్లకు చుక్కలు చూపించిన దైవ సమానుడు.
 
భీముడేమో అడవి బిడ్డ. గోండు వీరుడు. అడవి మీద బ్రతికేవాడు. తను పుట్టి పెరిగిన అడవి నుంచి , ఆ మట్టి నుంచి దూరం చేయడంతో ఆగ్రహించి నిజాం రాజులను ఎదిరించి ప్రత్యేక గోండు రాజ్యాన్ని స్థాపించినవాడు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో నిజాం సైన్యం గుండెల్లో నిద్రపోయిన వీరుడు.
 
అవకాశవాదం అద్భుతం :
రాజమౌళి సార్ గురించి మీకు తెలుసేనాయే ! జనాల నాడి తెలిసిన దర్శకుడు. తన వస్తువును ఎలా మార్కెట్ చేయాలో తెలిసిన ఫక్తు వ్యాపారి. ఆయన తీసిన సినిమాయే RRR.
సినిమా ఫస్టు సీన్ చూడంగానే నా మనసు చివుక్కుమన్నది. ఎందుకంటే నేను సదివిన రామరాజు లేడిక్కడ. బ్రిటిష్ వారి దగ్గర అండర్ కవర్ గా పని చేస్తున్న వ్యక్తి అట. ఇప్పటికే మన హిందూ దేవుళ్లను రకరకాలుగా చిత్రీకరించి , సంస్కృతిని భ్రష్టు పట్టించారు సరే ఇప్పుడు దేశ నాయకుల మీద పడ్డారు. అదొక్కటి మాత్రం నచ్చలేదు.
ఆయనెంత కల్పితం అని చెప్పినా సరే. కల్పితం అనుకున్నప్పుడు ఆళ్లకు పవన్ కళ్యాణో , మహేష్ బాబో అని పేరు పెట్టేదుండే. ఏమైతది ??
 
సినిమా విషయానికి వస్తే బాగానే తీశాడు రాజమౌళి. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు ఇద్దరూ పోటీ పడి నటించారు. ఎన్టీఆర్ గురించి చెప్పేది ఏముంది ? ఇప్పుడు ఉన్నోళ్లలో బెస్ట్ యాక్టర్. అడవి బిడ్డగా అమాయకత్వం , బలం , స్నేహ ధర్మం పాటించే భీముడిగా యాక్టింగ్ సూపర్బ్. ఇక రామ్ చరణ్. అతని కెరీర్ ను రంగ స్థలం కంటే ముందు , తర్వాత అని చెప్పుకోవచ్చు. విప్లవం కోసం అండర్ కవర్ కాప్ గా తమ్ముడి లాంటి భీముడిని కాపాడటం కోసం జైలు పాలైన రాముడిగా అతడి నటన అద్భుతం. కొమరం భీముడో సాంగ్ మరొక్కమారు ఏడిపించింది. సీన్ ల వారీగా తీసుకుంటే అరే ఈ సీన్ సూపర్ గా ఉంది కదా , ఈ పాట బాగుంది అని , ఫైట్ బాగుంది కదా అని మనకు అక్కడక్కడ తప్పక అనిపిస్తుంది.
చూడొచ్చు కానీ 500 పెట్టి మాత్రం చూసేటంత మాత్రం కాదు. హీరోల పేర్లు నాకు నచ్చలే. మనకు తెలియని వాళ్ళ పేర్లు పెట్టినా సినిమాకు లోటెం లేదు. మనకు బాగా పరిచయం ఉన్న మహా నాయకులు కాబట్టి కొద్దిగా బాధ అనిపించింది అంతే.
Link to comment
Share on other sites

Edo hype kosam Alluri & Komaram Bheem perlu vadukunnaru. Except RC getup in climax scene, vaallatho elaanti sambandham leni story. Evaina fictional names petti complete fictional story chesthe bagundedi.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...