Jump to content

Kudos ra jagga


psycopk

Recommended Posts

Development cheta kaka poina… ministers andarini nee cheppu kinda petukunav…

ఏపీ మంత్రుల రాజీనామా.. సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌ల అంద‌జేత‌ 

07-04-2022 Thu 17:17
  • ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ
  • మంత్రులంతా రాజీనామాలు చేసిన వైనం
  • రాజీనామా లేఖలు జ‌గన్‌కు అంద‌జేసిన మంత్రులు
  • గ‌వ‌ర్న‌ర్‌కు రాజీనామాల‌ను పంప‌నున్న జ‌గ‌న్‌
ap ministers resigns to their minister posts

అంతా అనుకున్న‌ట్లుగానే ఏపీ కేబినెట్‌లోని 24 మంది మంత్రులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించారు. ఈ మేర‌కు గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన కేబినెట్ భేటీకి ఖాళీ లెట‌ర్ హెడ్‌ల‌తో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపైనే త‌మ రాజీనామాలను చేశారు. ఈ లేఖ‌ల‌ను మంత్రులంతా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతిలో పెట్టారు. ఈ లేఖ‌ల‌ను జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించ‌నున్న‌ట్టు స‌మాచారం. 

గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన అనంత‌రం మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పై చ‌ర్చ జ‌ర‌గ్గా.. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు మంత్రులంతా అక్క‌డిక‌క్క‌డే త‌మ రాజీనామాల‌ను స‌మ‌ర్పించారు. మంత్రుల రాజీనామాల స‌మ‌ర్ప‌ణ‌తో గురువారం నాటి కేబినెట్ భేటీ ముగిసింది.

Link to comment
Share on other sites

మూడేళ్లూ ఎంతో సంతృప్తిగా పని చేశా: ఏపీ మంత్రి వెల్లంపల్లి 

07-04-2022 Thu 16:24
  • 90 శాతం మంత్రులను మారుస్తానని జగన్ ముందే చెప్పారన్న మంత్రి 
  • సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానన్న వెల్లంపల్లి 
  • జగన్ ఇచ్చే పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే తన కర్తవ్యమని వ్యాఖ్య 
 

I worked as minister with fill satisfaction says Vellampalli

ఏపీ మంత్రిగా మూడేళ్ల పాటు ఎంతో సంతృప్తికరంగా పని చేశానని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే మధ్యలో 90 శాతం మంది మంత్రులను మారుస్తానని సీఎం జగన్ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమయిందని చెప్పారు. జగన్ ఇచ్చిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే తన కర్తవ్యమని చెప్పారు. 

అది పార్టీ బాధ్యత అయినా, ప్రభుత్వ బాధ్యత అయినా సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయని... అయితే ఆ కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు.

Link to comment
Share on other sites

కొడాలి నానికి నాలుగు కొమ్ములు లేవు: గుడివాడ ఎమ్మెల్యే కీల‌క వ్యాఖ్య‌లు 

07-04-2022 Thu 17:31
  • అంద‌ర‌మూ రాజీనామా చేశాం
  • ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్ర‌మాణం
  • జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే రాజీనామాలన్న కొడాలి
kodali nani comments on cabinet ministers resignations

ఏపీ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవ‌ని చెప్పిన నాని.. తాను కూడా అంద‌రి మాదిరిగానే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్ర‌స్తుతం రాజీనామా చేసిన వారిలో కొంద‌రికి స్థానం ఉంటుంద‌ని చెప్పిన నానికి మీడియా ప్ర‌తినిధుల నుంచి ప్ర‌శ్న‌ల వ‌ర్షం ఎదురైంది. 

ఈ సంద‌ర్భంగా కొడాలి నానికి కొత్త మంత్రివ‌ర్గంలో స్థాన‌ముంటుందా?  అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన నాని... కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవ‌ని వ్యాఖ్యానించారు. కొత్త కేబినెట్‌లో త‌న‌కు స్థానంపై అవ‌కాశాలు త‌క్కువేన‌ని ఆయ‌న చెప్పారు. కేబినెట్ భేటీలో సీఎం ఆదేశాల మేర‌కు మంత్రివ‌ర్గంలోని అంద‌రం రాజీనామా చేశామ‌ని చెప్పారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్పార‌న్నారు. మంత్రి ప‌ద‌వుల‌కు తాము రాజీనామా చేస్తుంటే..జ‌గ‌న్ ఎక్కువ‌గా బాధ ప‌డిన‌ట్టుగా క‌నిపించింద‌ని, అయితే తాము ఇష్ట‌పూర్వ‌కంగానే రాజీనామా చేస్తున్నామ‌ని,.  మీరేమీ బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నాని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన మంత్రి పేర్ని నాని 

07-04-2022 Thu 17:01
  • ఈరోజు రాజీనామాలు చేయనున్న ఏపీ మంత్రులు
  • మీడియా ప్రతినిధులకు వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన పేర్ని నాని
  • ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటానని వ్యాఖ్య
Perni Nani gives sendoff party to media

ఏపీ మంత్రులు ఈరోజు రాజీనామాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఈరోజు చివరి కేబినెట్ సమావేశం జరుగుతోంది. అంతకు ముందు మీడియాకు మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస్ లు కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటానని చెప్పారు. ఈ మూడేళ్లలో మీడియా మిత్రులందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని అన్నారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన జగన్ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని చెప్పారు.

Link to comment
Share on other sites

ఆయన కోసం తల కోసుకోవడానికైనా సిద్ధమే: మంత్రి ఆదిమూలపు సురేశ్ 

07-04-2022 Thu 14:59
  • విద్యాశాఖ మంత్రిగా జగన్ నాకు మంచి అవకాశం ఇచ్చారు
  • జగన్ నాయకత్వంలో పని చేయడం గొప్ప అనుభవం
  • జగన్ ఏ బాధ్యతలను అప్పగించినా మరింత ఉత్సాహంగా పని చేస్తా
I am ready to cut my head for Jagan says Adimulapu Suresh

ఇద్దరు, ముగ్గురు మినహా ఏపీ మంత్రులంతా రాజీనామా చేయబోతున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవిని నిలుపుకునేది ఎవరు? కొత్తగా అవకాశం ఎవరెవరికి దక్కబోతోంది? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. తమకు మరోసారి అవకాశం రాకపోవచ్చని ఇప్పటికే చాలా మంది మంత్రులు మానసికంగా సిద్ధమయ్యారు. 

ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రిగా తనకు సీఎం జగన్ గొప్ప అవకాశం ఇచ్చారని అన్నారు. జగన్ నాయకత్వంలో పని చేయడం గొప్ప అనుభవమని చెప్పారు. సీఎం లక్ష్యాలకు అనుగుణంగా, ఆయన అంచనాలను అందుకునే విధంగా శాయశక్తులా పని చేశానని తెలిపారు. జగన్ కోసం తన తల కోసుకోవడానికైనా సిద్ధమని అన్నారు. 

గత పాలకులు విద్యను కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం చేశారని సురేశ్ విమర్శించారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనేని జగన్ విధానమని అన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. మూడేళ్లలో విద్యారంగంపై 76 సమీక్షలను నిర్వహించారని చెప్పారు. తనకు జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని అన్నారు.

Link to comment
Share on other sites

వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించినప్పుడూ నేను బాధపడలేదు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి 

07-04-2022 Thu 12:15
  • మళ్లీ మంత్రిని కావాలనే ఆశ లేదు
  • ఎప్ప‌టికీ వైఎస్‌ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక
  • నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ ఎంతో గౌరవించారు
  • జగనే త‌న యజమాని, నాయకుడు అన్న నారాయ‌ణ స్వామి
Narayana Swamy on cabinet minister post

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు సర్వం సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దీనిపై స్పందిస్తూ.. తాను మళ్లీ మంత్రిని కావాలనే ఆశ లేద‌ని చెప్పారు. అయితే, ఎప్ప‌టికీ వైఎస్‌ జగన్ సీఎంగా ఉండాలనేదే త‌న‌ కోరిక అని చెప్పుకొచ్చారు. త‌న‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ ఎంతో గౌరవించారని ఆయ‌న అన్నారు. 

జగనే త‌న యజమాని, నాయకుడు అని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి తాను ఎల్ల‌ప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. త‌న‌ను గ‌తంలో వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు కూడా తానేం బాధపడలేదని తెలిపారు. 

దళితుడిని కాబట్టే ఆ బాధ్యతల నుంచి తప్పించారని కొందరు ఆ స‌మ‌యంలో ప‌లు వ్యాఖ్య‌లు చేశారని ఆయ‌న చెప్పారు. త‌న‌ శాఖపై ప్రతిపక్ష పార్టీల నేత‌లు అర్థం లేని విమర్శలు చేశార‌ని ఆయ‌న అన్నారు. ఏపీలో మద్యం అమ్మ‌కాల‌ ద్వారా వచ్చిన ఆదాయాన్నే సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు అర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

Link to comment
Share on other sites

Eedu rajenama mundu kuda comedy chesi velladu… buffon yedava

చంద్రబాబు వల్లే ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది: ఏపీ మంత్రి బాలినేని 

07-04-2022 Thu 07:54
  • చంద్రబాబు హయాంలో రూ. 68 వేల కోట్ల అప్పులు
  • తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వల్పంగా పెంచాల్సి వచ్చిందన్న మంత్రి 
  • పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు తపిస్తున్నారని వ్యాఖ్య 
Power charges hiked because of Chandrababu said minister balineni

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన రూ. 68 వేల కోట్ల అప్పుల కారణంగానే ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదన్నారు.

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పొత్తు లేకుండా ఏనాడూ గెలవలేదని, ఈసారి పవన్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేశారు. ఇంతకీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థా? కాదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

12 minutes ago, psycopk said:

మంత్రి ప‌ద‌వుల‌కు తాము రాజీనామా చేస్తుంటే..జ‌గ‌న్ ఎక్కువ‌గా బాధ ప‌డిన‌ట్టుగా క‌నిపించింద‌ని, అయితే తాము ఇష్ట‌పూర్వ‌కంగానే రాజీనామా చేస్తున్నామ‌ని,.  మీరేమీ బాధ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నాని వ్యాఖ్యానించారు.

CITI_c$y  like they have an option.....

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...