Jump to content

AP lo Waste gadini cm chesinandu happy antuna KTR


psycopk

Recommended Posts

ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి: తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్ 

29-04-2022 Fri 13:16
  • ఏపీ పరిస్థితుల గురించి తన మిత్రులు చెప్పారన్న కేటీఆర్
  • ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టుందని అన్నారని వ్యాఖ్య
  • దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్న మంత్రి
KTR sensational comments on AP

ఏపీపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని... ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. 

తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని... దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు.  నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం ఉంది. క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

 

బొత్స క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేదేమో?... ఏపీ మంత్రికి టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంట‌ర్‌! 

29-04-2022 Fri 15:42
  • హైద‌రాబాద్‌లో రెండు నిమిషాలు కూడా క‌రెంట్ పోదు
  • హైద‌రాబాద్‌లోనే నివాసం ఉంటున్న జ‌గ‌న్ ఫ్యామిలీని అడిగితే తెలుస్తుంది
  • హైద‌రాబాద్‌లోనూ వైసీపీ నేత‌ల కుటుంబాల నివాసమ‌న్న రంజిత్ రెడ్డి
trs mp ranjith reddy satires on botsa comments

ఏపీలో మౌలిక వ‌సతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ప‌రోక్షంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తే... ఆయ‌న కామెంట్ల‌కు కౌంట‌రిస్తూ ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హైద‌రాబాద్‌లో కరెంట్ లేక జ‌న‌రేట‌ర్ వేసుకోవాల్సి వ‌చ్చిందంటూ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బొత్స వ్యాఖ్య‌ల‌కు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. 

మీడియాతో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ... "తెలంగాణ‌లో 2 నిమిషాలు కూడా క‌రెంట్ పోదు. బొత్స క‌రెంట్ బిల్లు క‌ట్ట‌లేదేమో. అందుకే క‌ట్ చేశారు. వైసీపీ నేత‌ల కుటుంబాలు హైద‌రాబాద్‌లోనే ఉంటున్నాయి. ఇక్క‌డే ఉన్న జ‌గ‌న్ కుటుంబాన్ని అడిగినా తెలుస్తుంది. కేసీఆర్ పాల‌న బాగుంద‌ని వైసీపీ ఎంపీలే చెప్పారు" అంటూ సెటైరిక‌ల్ కామెంట్లు చేశారు.   

Link to comment
Share on other sites

ఉమ్మ‌డి రాష్ట్రంలోనే హైద‌రాబాద్ అభివృద్ధి... కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌ల స్పంద‌న‌ 

29-04-2022 Fri 17:05
  • పీవీ హైవే వైఎస్ హ‌యాంలో నిర్మించిందే
  • ఏపీకి రాజ‌ధాని లేకుండా విభ‌జ‌న చేశారు
  • విభ‌జ‌న త‌ర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు
  • మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లోనూ విద్యుత్ కోత‌లున్నాయ‌న్న స‌జ్జ‌ల‌
sajjala ramakrishnareddy responds on ktr comments

ఏపీలో మౌలిక వ‌స‌తులు అధ్వాన్నంగా ఉన్నాయ‌న్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయం చేయ‌ద‌ల‌చుకోలేద‌న్న స‌జ్జ‌ల‌.. ఎవ‌రైనా ముందుగా త‌మ రాష్ట్రం గురించి చెప్పుకోవాల‌ని,  ఆ త‌ర్వాత ఇత‌ర రాష్ట్రాల గురించి మాట్లాడాల‌ని వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల ఏమ‌న్నారంటే... "కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయం చేయ‌ద‌ల‌చుకోలేదు.  మాట్లాడే ముందు వారి రాష్ట్రం కోసం మాట్లాడాలి. త‌ర్వాతే ఇత‌రుల గురించి వ్యాఖ్య‌లు చేయాలి. మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లోనూ విద్యుత్ కోత‌లున్నాయి. రోడ్లు కూడా బాగా లేవు. విభ‌జ‌న త‌ర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. సుమారు 50 నుంచి 60 వేల కోట్లు ఆస్తుల విభ‌జ‌న జ‌ర‌గాల్సి ఉంది. ఏపీకి రాజ‌ధాని లేకుండా విభ‌జించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే హైద‌రాబాద్ అభివృద్ధి చెందింది. పీవీ హైవే కూడా వైఎస్ హ‌యాంలో నిర్మించిందే" అని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. 

Link to comment
Share on other sites

ఉన్న విష‌యం చెబితే అంత అక్క‌సు ఎందుకు?.. బొత్స‌పై తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ఫైర్‌ 

29-04-2022 Fri 16:30
  • ఏపీ గురించి కేటీఆర్ ఉన్న మాటే అన్నారన్న ప్ర‌శాంత్ రెడ్డి 
  • ఏపీలో రోడ్లు బాగా లేవు మ‌రి
  • రాష్ట్రంలో క‌రెంటు కోతలున్నాయ‌ని వారి సీఎం చెప్పారు
  • ఉన్న‌మాట అంటే అంత ఉలుకెందుకు? అన్న మంత్రి
telangana minister prashanth reddy fires on botsa satyanarayana comments

ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇచ్చిన కౌంట‌ర్ కు టీఆర్ఎస్ నుంచి వ‌రుస‌గా ఘాటు ప్ర‌తిస్పంద‌న‌లు ఎదుర‌వుతున్నాయి. బొత్స వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సెటైరిక్‌గా స్పందించగా...తాజాగా తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కూడా బొత్స వ్యాఖ్య‌ల‌పై విరుచుకుప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ "ఏపీ గురించి కేటీఆర్ వాస్త‌వాలే చెప్పారు. బొత్స కుటుంబం హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. బొత్స‌తో పాటు అక్క‌డి నేత‌ల కుటుంబాల‌న్నీ ఇక్క‌డే ఉంటున్నాయి. మీరూ (మీడియా ప్ర‌తినిధులు) కూడా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు క‌దా. మ‌రి మ‌నం జ‌న‌రేట‌ర్ల‌ను వాడుతున్నామా? హైద‌రాబాద్‌లో జ‌న‌రేట‌ర్లు వాడుతున్నామ‌న్న వ్యాఖ్య‌ల‌ను బొత్స విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నా. ఎందుకంత అక్క‌సుగా మాట్లాడాలి. ఉన్న విష‌యమే కేటీఆర్ చెప్పారు. ఏపీలో రోడ్లు బాగా లేవు మ‌రి. క‌రెంటుకు ఇబ్బంది ఉన్న‌ద‌ని వారి ముఖ్యమంత్రే చెప్పారు.  విజ‌య‌వాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులు హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఏపీని అభివృద్ధి చేస్తే మేం ఏమైనా అడ్డుప‌డుతున్నామా? ఉన్న మాట అంటే ఉలికిప‌డ‌ట‌మెందుకు? అంటూ ప్ర‌శాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారు: ప్రత్తిపాటి పుల్లారావు  

29-04-2022 Fri 16:20
  • ఏపీలో కరెంట్, నీళ్లు లేవన్న కేటీఆర్
  • ఏపీ విధ్వంసం కేసీఆర్, జగన్ ఆధ్వర్యంలోనే జరిగాయన్న ప్రత్తిపాటి
  • ఏపీలో భూముల ధరలు 200 శాతం పడిపోయాయని వ్యాఖ్య
KTR told truth about AP says Prathipati Pulla Rao

ఏపీలో కరెంట్, నీళ్లు లేవని, రోడ్లు ధ్వంసమయ్యాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక పుట్టిస్తున్నాయి. వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేశ్ లు కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారని అన్నారు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదని... దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్పను చాటుకునేందుకు ఏపీతో పోల్చుకుంటున్నాయని చెప్పారు. 

అయితే తెలంగాణ అభివృద్ధి, ఏపీ విధ్వంసం ఇవి రెండూ కేసీఆర్, జగన్ ల ఆధ్వర్యంలోనే జరిగాయని ప్రత్తిపాటి ఆరోపించారు. ఏపీలో భూముల ధరలు 200 శాతం పడిపోయాయని, ఇదే సమయంలో తెలంగాణలో రేట్లు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, పరిశ్రమలు మూతపడ్డాయని, ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని... అందుకే అందరూ తెలంగాణ సురక్షితమని అనుకుంటున్నారని అన్నారు.

Link to comment
Share on other sites

ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి: తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్ 

29-04-2022 Fri 13:16
  • ఏపీ పరిస్థితుల గురించి తన మిత్రులు చెప్పారన్న కేటీఆర్
  • ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టుందని అన్నారని వ్యాఖ్య
  • దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్న మంత్రి
KTR sensational comments on AP

ఏపీపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని... ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. 

తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని... దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు.  నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం ఉంది. క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Link to comment
Share on other sites

కేటీఆర్.. రా.. వచ్చి కళ్లారా ఏపీ అభివృద్ధి గురించి తెలుసుకో.. ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ 

29-04-2022 Fri 13:58
  • ఏ సీఎం చేయని అభివృద్ధి జగన్ చేశారని కౌంటర్
  • ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందని కామెంట్
  • కేసీఆర్ లాగానే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని ఫైర్
Jogi Ramesh Fires On KTR Comments Over AP

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ విమర్శలు చేశారు. కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. 

దీనిపై స్పందించిన జోగి రమేశ్.. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నానంటూ చెప్పారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందన్నారు. 

‘‘ఏపీకి వస్తే అమ్మ ఒడి కనిపిస్తుంది. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుంది. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో సచివాలయం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుంది. సచివాలయ వ్యవస్థ బాగుందని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. అక్కడా సచివాలయ వ్యవస్థను పెడతామన్నారు. దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ లా అభివృద్ధి పనులను చేయాలనుకుంటున్నారు. మేం కేబినెట్ లోనూ సామాజిక న్యాయం పాటించాం. ఏపీలో జరిగినట్టు సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

Link to comment
Share on other sites

హైదరాబాద్ కు కల్చర్ నేర్పిందే కోస్తా ఆంధ్ర.. కేటీఆర్ కు మల్లాది విష్ణు కౌంటర్ 

29-04-2022 Fri 14:02
  • తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి జరిగింది ఏపీ వల్లే
  • మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కోరుకునే రోజులొస్తాయి
  • హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని మండిపాటు
AP Taught Culture To Hyderabad

అభివృద్ధి అంటే ఏంటో విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కోస్తా ఆంధ్ర ప్రజలు వెళ్లి తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. తెలంగాణకు కల్చర్ నేర్పి.. డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. అయితే, కొందరి రెండు కళ్ల సిద్ధాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందన్నారు. 

తమ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని, అది సరైన పద్ధతి కాదని కేటీఆర్ కు చురకలంటించారు. ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు.

Link to comment
Share on other sites

కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు చెప్పాడేమో.. నేను నిన్న‌టిదాకా హైద‌రాబాద్‌లోనే ఉన్నా: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ 

29-04-2022 Fri 14:35
  • హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్‌పై ఉండాల్సి వ‌చ్చింది
  • కేటీఆర్ మాట‌ల‌ను నేను ఆక్షేపిస్తున్నాను
  • మీ ద‌గ్గ‌ర జ‌రిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవ‌చ్చు
  • కానీ ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్దు
  • కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలన్న బొత్స‌
botsa comments on ktr comments

ఏపీలో మౌలిక వ‌స‌తులు లేవంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీకి చెందిన నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. ఏపీ గురించి కేటీఆర్ ప్ర‌త్య‌క్షంగా ఏమీ చూడ‌కుండానే ఆయ‌న స్నేహితుడు చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌న్న బొత్స‌... తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినా తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అంటూ స్పందించారు. త‌మ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవ‌చ్చు గానీ పొరుగు రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌రాదంటూ బొత్స అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ "ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు ఫోన్ చేశాడేమో. నేను నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉన్నా. క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉండాల్సి వ‌చ్చింది. ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదు క‌దా. కేటీఆర్ మాట‌ల‌ను నేను ఆక్షేపిస్తున్నాను. బాధ్య‌త క‌లిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడ‌కూడ‌దు. మీ ద‌గ్గ‌ర జ‌రిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవ‌చ్చు. కానీ ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్దు. కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలి" అని బొత్స వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి స్పంద‌న‌ 

29-04-2022 Fri 15:01
  • సింగ‌రేణి కార‌ణంగానే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌ల్లేవు
  • ఏపీలోనూ విద్యుత్ కోత‌లు లేవు
  • రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసమే కేటీఆర్ వ్యాఖ్య‌లు
  • తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు
  • ఓట్ల కోస‌మే ఈ వ్యాఖ్య‌లు అన్న పెద్దిరెడ్డి
peddireddy satires on ktr comments

ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఇంధ‌న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పందించారు. 

ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ "తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి. అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవు. ఏపీలో కూడా విద్యుత్ కోత‌లు లేవు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ వ్యాఖ్య‌లు. బొగ్గును ఎక్కువ‌ ధ‌ర‌కు కొన‌డానికైనా సిద్ధం. పంచాయ‌తీరాజ్‌లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్లు నిర్మించాం. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఎవ‌రో ఒక‌ర్ని కించ‌ప‌రిస్తే ఓట్లు ప‌డ‌తాయ‌ని విమ‌ర్శించారు" అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

Link to comment
Share on other sites

1 minute ago, reality said:

Arey KTR ga, farmers issues tweet chesthe response ivvavu… nikenduku ra pakka state gurinchi… fake pakeer lanjodkaaa….

This is election strategy ....47osjd.gif

Link to comment
Share on other sites

అట్టుంటది ఒక్క ఛాన్స్‌ తోని!.. అంటూ కేటీఆర్ వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేశ్ 

29-04-2022 Fri 18:40
  • కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల యుద్ధం
  • తెలంగాణ మంత్రి వ్యాఖ్య‌ల‌ను షేర్ చేసిన నారా లోకేశ్‌
  • ఒక్క ఛాన్స్‌తో జ‌గ‌న్ రాష్ట్రాన్ని అధోఃగ‌తి పాలు చేశార‌న్న అర్ధం వ‌చ్చేలా ట్బీట్‌
nara lokesh satirical tweet on ktr comments

పొరుగు రాష్ట్రంలో మౌలిక వ‌స‌తులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల మంట‌ల‌ను రాజేశాయి. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు కౌంట‌ర్లు ఇస్తుంటే... వాటికి రీ కౌంట‌ర్లు ఇస్తూ టీఆర్ఎస్ నేత‌లు సాగుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీలోని వాస్త‌వ ప‌రిస్థితుల‌కు కేటీఆర్ వ్యాఖ్య‌లు అద్దం ప‌డుతున్నాయంటూ ఏపీలో విప‌క్ష పార్టీ టీడీపీ కీల‌క వ్యాఖ్య‌లు చేస్తోంది.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్... కేటీఆర్ వ్యాఖ్య‌ల వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి అట్టుంటది ఒక్క ఛాన్స్‌ తోని! అంటూ ఓ సెటైరిక్ కామెంట్‌ను యాడ్ చేశారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చి రాష్ట్రాన్ని అధోఃగ‌తి పాలు చేశార‌న్న అర్థం వ‌చ్చేలా లోకేశ్ ఈ సెటైర్‌ను సంధించారు. 

Nara LokeshTDPKTR
 
Leave Feedback on this news
 
Link to comment
Share on other sites

VadU time epudu istado ento.., current eppufu untado nuvve chusi aa time lo rammanu

 

కేటీఆర్ టైమ్, డేట్ చెబితే ఏపీ అంతా తిప్పి చూపిస్తా... సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం రోజా ఆఫర్ 

29-04-2022 Fri 18:48
  • సీఎం కేసీఆర్ ను కలిసిన రోజా
  • అనంతరం మీడియాతో మాట్లాడిన వైనం
  • కేటీఆర్ వ్యాఖ్యలకు ఖండన
  • కేటీఆర్ ఏపీని చూసిన తర్వాత మాట్లాడాలని హితవు
Roja condemns KTR comments

ఏపీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేదని హితవు పలికారు. ఈ సాయంత్రం రోజా హైదరాబాదులో ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. 

ఏపీ పరిస్థితుల గురించి ఎవరో చెప్పారని కేటీఆర్ అంటున్నారని, ఆ చెప్పిందెవరో గానీ కేటీఆర్ ను తప్పుదోవ పట్టించారని వెల్లడించారు. "కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను వాట్సాప్ లో చూశాను. ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా, స్ఫూర్తిదాయకమైన నేతగా కేటీఆర్ ను అందరం గుర్తిస్తాం. అటువంటి కేటీఆర్ మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారని నేను అనుకోను. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎక్కడా ఏపీ అనే పదం వాడలేదు. పొరుగు రాష్ట్రాలు అనే మాట వాడారు. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. 

టూరిజం మినిస్టర్ గా నేను కేటీఆర్ ను ఏపీకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకునే సీఎం జగన్ పాలనలో ఏపీ ఎలా ఉందో చూడండి. సీఎం జగన్ అమలు చేస్తున్న అనేక విప్లవాత్మకమైన మార్పులను నేను కేటీఆర్ కు దగ్గరుండి చూపిస్తాను. 

కేటీఆర్... ఏపీ పరిస్థితులను చెప్పారని భావిస్తున్న ఆయన ఫ్రెండును కూడా తీసుకువస్తే ఏపీలో నాడు-నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా పునరుద్ధరించామో చూపిస్తాను. అంతర్గత రహదారులు, కేంద్రంతో కలిసి నిర్మిస్తున్న జాతీయ రహదారులను కూడా చూపిస్తాను. అవినీతికి తావు లేకుండా, పొరుగు రాష్ట్రం తమిళనాడును కూడా ఆకర్షిస్తున్న ఏపీ వాలంటీర్ వ్యవస్థను కూడా కేటీఆర్ కు చూపిస్తాను. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న తీరును చూపిస్తాను. 

ఇవన్నీ చూపిస్తే తెలంగాణలోనూ ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టాలని కేటీఆర్ తప్పక అనుకుంటారు. ఆ ఫ్రెండు చెప్పింది తప్పు అని కూడా కేటీఆర్ తెలుసుకుంటారని భావిస్తున్నా. మరి కేటీఆర్ ఏపీకి ఎప్పుడు వస్తారో డేట్, టైమ్ చెబితే వెయిట్ చేస్తాను. ఆయనకు స్వాగతం పలికి, టూరిజం మినిస్టర్ హోదాలో రాష్ట్రమంతా తిప్పి చూపిస్తాను. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జగన్ సాగిస్తున్న పాలనను చూపిస్తాను" అని రోజా స్పష్టం చేశారు. 

ఇవాళ దేశంలో తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, అది అందరికీ తెలిసిన విషయమేనని రోజా అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి కేటీఆర్ వచ్చి చూస్తే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. పక్కనున్న వాళ్ల మాటలు నమ్మి టీవీ చానళ్ల ముందు చెబితే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కేటీఆర్ గుర్తించాలన్నారు. అందుకే కేటీఆర్ స్వయంగా వచ్చి ఏపీలో పరిస్థితులు చూసి అప్పుడు మాట్లాడాలని రోజా హితవు పలికారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...