Jump to content

K.G.F 3 story leaked..

anna_vendy

Recommended Posts

ముళబాగల్ - 3 .
  
అతనో డాన్ 

.పేరు బాకీ .

   ఏనాటికైనా ప్రపంచం లోని ఆటం బాంబ్స్ ,  హైడ్రోజన్ బాంబ్స్ మొత్తం సొంతం చేసుకొని దీపావళి నాడు కాల్చి పండుగ చేసుకొంటానని అమ్మకు మాటిచ్చాడు .

అక్క్షన్ స్టార్ట్ . 

 మన హీరో బాకీ , అమెరికా అధ్యక్షుడిని బందీ  చేసి తన ఇంటి బాత్ రూమ్ లో బంధిస్తాడు . CIA  యుద్ధం చేస్తుంది . ప్లీజ్ ప్లీజ్....  మీరు లాజిక్కులు అడక్కండి ." CIA  గూఢచారి సంస్థ అది యుద్ధం  చేయదు" లాంటి అవుట్ డేటెడ్ మాటలు వద్దు. సినిమా ను సినిమా లాగా చూడండి . లేకపోతె థియేటర్ నుండి వెళ్లిపోండి . 

నెక్స్ట్ రష్యా పుతిన్ ను కిడ్నాప్  చేస్తాడు . సైబీరియా లో ఉన్న ఐస్ మొత్తాన్ని ఒక తన్ను తన్నుతాడు . ఆ ఐస్ మొత్తం సూర్యుడి పైకి వెళ్లి పోతుంది . అక్కడ సైబీరియా లో పుతిన్ ను ఒక ఎర్ర చందనం చెట్టుకు  కట్టేస్తాడు .అక్కడ కొన్ని వందల డైనోసార్లు ఉంటాయి . వాటిని  పట్టి చంపి సూప్ చేసుకొని తాగేస్తాడు . అప్పుడు ఒక శాసనం చేస్తాడు . డైనోసార్ల అంతానికి తాను కారణం అనే సత్యాన్ని దాచేయాలని మానవ జాతి పుట్టాక ముందే డైనోసార్లు అంతరించి పోయాయని ప్రచారం చేయాలనీ ఆదేశిస్తాడు . అందరూ పాటిస్తారు . 

ఇప్పుడు ఉత్తర కొరియా కిమ్ వంతు . అతను పారిపోయి ఎవరెస్ట్  శిఖరం ఎక్కి కూర్చుంటాడు . మన హీరో బాకీ,  ఒక వేలు పెట్టి హిమాలయ శ్రేణిని మొత్తం  లేపి పసిఫిక్ సముద్రం లో పడేస్తాడు . 

ఇప్పుడు కిమ్ పసిఫిక్ లోతులు నుంచి పారి పోయి పుతిన్ ను జోబిడెన్ ను రక్షిస్తాడు . వీరందరూ కలిసి హీరో బాకీ పై యుద్ధం ప్రకటిస్తాడు . రష్యా,  అమెరికా,  జర్మనీ,  జపాన్,  ఉత్తర కొరియా,  దక్షిణ కొరియా,  ఫ్రాన్స్,  ఇంగ్లాండ్ . ఈ దేశాల ఆర్మీ , నేవీ , ఎయిర్ ఫోర్స్ అన్నీ ఒక వైపు . మన హీరో బాకీ ఒక వైపు . 

భయంకర మైన అరుపులు .. కపాలాలు పగలడం , చావు  కేక లు , ఎముకలు పటపట  మురుకుల్లా సౌండ్ చేసుకొంటూ విరగడం .. సుమారుగా తొంబై నిముషాలు నాన్స్టాప్ యాక్షన్ . ఈ యుద్ధం లో మొత్తం అయిదు కోట్ల మంది ప్రపంచ దేశాల సైనికులు మరణిస్తారు . లక్షకు పైగా యుద్ధ  విమానాలు కూలిపోతాయి . యాభై వేల యుద్ధ నౌకలు , ఇరవై వేల జలాంతర్గాములు ధ్వంసం . మన హీరో వేసిన కోటు తీయకుండా జుట్టు చెరగకుండా ఒంటి చేత్తో అవలీలగా గెలుస్తాడు . 

ఇంత చేసినా ఇంకా ప్రపంచ దేశాల నాయకులు దొరకలేదు . వారు బంగాళా ఖాతం లో సముద్ర  గర్భం లో ఉన్న రాజరాజచోళుడి యుద్ధ నౌక లో దాగి వున్నారు 

హీరో బాకీ కి కోపం వచ్చి బంగాళాఖాతం పై ఒక దెబ్బ కొడుతాడు . అంతే ఆ నీళ్లు మొత్తం చంద్రమండలం పైకి .. సూర్యుడ్ని ఒక చేతితో తీసి అంటార్కిటికా లో పడేస్తాడు . ఆ నీరు మొత్తం మెల్లగా కరిగి కరిగి జపాన్ ను కొరియా దేశాలను ముంచేస్తుంది . ఇప్పుడు అట్లాంటిక్ పై మరో దెబ్బ . ఆ నీరు యెగిరి పాలపుంత దాటి కొన్ని నక్షత్రాల పై పడుతుంది . ఆ దెబ్బకు ఒక పది బ్లాక్ హోల్స్ రాలి అమెరికా పై పడుతాయి . 

ఇప్పుడు ముళబాగల్ లో మన హీరో ఇంటి దొడ్డ్లో క్లైమాక్స్ సీన్ . అన్ని దేశాల అధ్యక్షులు ప్రధానులు అక్కడ ఉన్న చెట్లకు  తలకిందులుగా వేలాడుతుంటారు . అన్ని దేశాల దగ్గర ఉన్న అణ్వయుధాలు అక్కడ కుప్పగా పోసి ఉంటాయి . హీరో సిగరెట్ వెలిగిస్తాడు. అగ్గి పుల్లను ఆటం బాంబ్స్ హైడ్రోజన్ బాంబ్స్ పడేస్తాడు . అవన్నీ చిటపట దీపావళి టపాకాయలు లాగ మాడి మసి అయిపోతాయి . తల్లి ఫోటో ముందు హీరో. " అమ్మా ! చూడు నీకు మాటిచ్చా . ఇప్పుడు ఇదిగో ఇలా ప్రపంచ శాంతి సాధించా అంటూ సెటిమెంట్ పండిస్తాడు . ప్రేక్షకుల కళ్ళల్లో నీరు                 
   .. పార్ట్ త్రి కి శుభం కార్డు . 

కథలో నీతి :

నేరం నాది కాదు .. డోపమైన్ ది.

ప్రతి మనిషి శరీరం లో డోపమైన్ అనే హార్మోన్ ఉత్త్పత్తి అవుతుంది . మనకు ఇస్టమైన పనులు,  మనసుకు ఆహ్లాదం కలిగించే పనులు చేసినప్పుడు అది ఉత్త్పత్తి అవుతుంది . ఇది మన జాతి పుట్టినప్పటినుంచి జరుగుతుందే !

డోపమైన్ హై :  

ఆటలాడడం , పిక్నిక్ , టూర్ ..ఇవన్నీ డోపమైన్ హప్పినెస్స్ ఇస్తాయి . 

కానీ కొంతమంది డోపమైన్ హై కి బానిసలు అయిపోతారు . 

తాగడం , స్మోకింగ్ , జూదం, డ్రగ్స్ , పోర్న్  .. లాంటివి డోపామైన్ హై నిస్తాయి . డోపమైన్ తో సమస్య ఏమిటంటే అది మరీ ఎక్కువ స్థాయికి పెరిగితే .. కొన్ని గంటల్లో అంత తక్కువ స్థాయికి పడిపోతుంది . అప్పుడు స్ట్రెస్ .. డిప్రెషన్ వస్తుంది . తిరిగి డోపామైన్ కిక్ రావాలనుంటే డోసు పెంచాలి . ఒక పెగ్గు తో స్టార్ట్ చేసిన వాడికి .. రేండు నెలల్లో రెండు పెగ్గులు .. సంవత్సరం లో క్వార్టర్ బాటిల్ .. అటు పై దశలో .. హాఫ్ .. ఫుల్ .. పొద్దునే మొదలు .. గ్యాంబ్లింగ్ అయినా స్మోకింగ్ అయినా డ్రగ్స్  అయినా అంతే .. డోసు పెంచితేనే కిక్కు . డోపామైన్ హై కి అలవాటు పడినవాడు ఇంగిత జ్ఞానం కోల్పోతాడు . శరీరం నాశనం , ఇల్లు నాశనం .. చివరకు స్మశానం లో కట్టె గా కాలిపోతాడు . 

హింస అన్నిటికీ మించిన  డోపమైన్ కిక్కు .

 ఇది మన ముళబాగల్ సినిమా తో  మొదలయ్యింది కాదు . ఎప్పుడో .. ఎప్పుడో...  సినిమాల్లో మొదలయ్యింది . డోసు పెరిగింది . పెరిగింది . పాత డోసు సరిపోదు . కిక్కు రావాలంటే డోసు పెంచాలి . అసలే లాక్ డౌన్ కాలం లో జనాలు వెబ్ సిరీస్ కు,  రకరకాల సినిమా ల కు అందులోని  హింస కు అలవాటు పడ్డారు .ఇప్పుడు డోసు పెంచాలి . అప్పుడే కిక్కు   . డోపమైన్ కిక్కు . లాజిక్కులు ఎవడికి కావాలి ?.డోపమైన్ కిక్కు ఇస్తే నా సామిరంగా వేల కోట్లు వస్తాయి . 

భారత పార్లమెంట్ లోకి ఒక డాన్ నేరుగా వెళ్లి కాల్పులు జరిపినట్లు చూపినా దొంగ సెన్సార్ డబ్బుల కట్టలతో నిద్దరోతుంది . ఎవడూ మాట్లాడడు. మేధావులు .. మీడియా ..  కిమ్మనకుండా ఉండిపోతారు . వేల కోట్లు వసూలు అవుతాయి  .

ఎవడైనా ఇదేంటి అని అడిగితే  డోపమైన్ కిక్కు కు బానిసలం అయిన మనం     అతి తెలివితే తో"  సినిమా ను సినిమా లాగా చూడాలి .. జస్ట్ మూడు  గంటలు ఎంటర్టైన్మెంట్" అని దబాయిస్తాము . ఇంకా అడిగితే "అదేంటి .. ఆ సినిమా లో లేదా .. ఈ సినిమా లో లేదా? అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడ లేదు " అని దబాయించి నోరు  మూయిస్తాము 

సినిమా చూసినవారు అందరూ ఒకేలా వుండరు . మానసిక పరిపక్వత లేని వారు వేల సంఖ్యలో .. వారి సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ హింస తిష్టవేస్తుంది .దెయ్యం సినిమా లు చూసి దెయ్యం పట్టించుకొన్న అమ్మాయిల కథ విన్నారు కదా ? ఇది అంత కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ 

 కాబొయ్యే భర్త ను గొంతు కోసిన యువతి. అమ్మాయి పీక కోసిన యువకుడు . ఆసిడ్ పోసిన యువకుడు . భర్త మర్మాంగాన్ని కోసి అవతల పడేసిన భార్య .. తండ్రి తల నరికి సంచిలో వేసుకొన్న కొడుకు ..యువతి గ్యాంగ్ రేప్ .కూతురు ను రేప్ చేసి అటు పై తలనరికి చంపిన తండ్రి    . మూడు నెలల పసికందు ను రేప్ చేసిన యువకుడు   .. ఆరు గొంతులు కోసిన యువకుడు .. ఇలా ప్రతి రోజు క్రైమ్ కాలం నిండా  వార్తలు . దీన్ని మసాలా దట్టించి చిత్రీకరించి ప్రసారం చేసే టీవీ లు . 

ప్రతి రోజు .. ప్రతి గంట .. వయోలెన్స్ కుక్కు .. కిక్కే కిక్కు .. డోసు పెంచుకొంటూ .. ఎంజాయ్ చేసుకొంటూ .. ఫుల్ కిక్కు .. ఫ్రీ కిక్కు 

. పడవ ఒక వైపు బొక్క  పడితే ఉబికి వస్తున్న నీటి తో ఆడుకొంటూ ఎంజాయ్ చేస్తున్న  అమాయక జనాలూ .. 

 ఎంజాయ్ చెయ్యండి . ఎక్కువ సమయం లేదు . ఎంజాయ్ చేయండి .

Link to comment
Share on other sites

54 minutes ago, anna_vendy said:

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...