Jump to content

Happy birthday balayya


Lovecrusader

Recommended Posts

సమైక్యాంద్ర గా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు..
హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎలక్షన్ జరుగుతున్నాయి..
నేను బ్యాచ్లర్ గా మిత్రులతో కలిసి Dilshuknagarలో ఉన్నప్పుడు..

కార్పొరేటర్ గా ఆది రెడ్డి అన్న ఆయన రంగంలోకి దిగారు..
ఇప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ప్రచారంలో  వెబ్  సపోర్టింగ్ కోసం టెక్నికల్గా సహాయం చేయడం గురించి మిత్రులతో కలిసి రంగంలో దిగాము రోజు ఆయన కూడా తిరగడం ఫోటోలు వీడియోలు బ్యానర్ డిజైన్స్ అవి వెబ్సైట్లో పెట్టి పబ్లిసిటీ చేయడం.. ఇది మా పని 

ఒకరోజు అనుకోకుండా ఒక లోకల్ గా ఒక ఆంజనేయస్వామి ఆలయానికి బాలయ్య వచ్చాడు... TDP తరుపున పోటీ చేసే ఆదిరెడ్డి అన్న అతను బాలయ్యను కలిశాడు.. అన్న కాస్త ప్రచారం చేసి పెట్టండి అని అడిగాడు. రెండు క్షణాలు కళ్ళు మూసుకుని,  గుళ్ళో ఉండగా అడిగావు నేను నీకు ఎదో ఋణం ఉంటే గాని ఇలా జరగదు...  తప్పకుండా చేస్తా అని అన్నాడు బాలయ్య.. నిజానికి అతను అడిగింది ఒక రోజు  వచ్చి ప్రచారం చేసి వెళ్ళమని.. రేపు షూటింగ్ ఉంది ఎప్పుడు రావాలి అని అడిగాడు బాలయ్య.. . మీ ఇష్టం బాబు మీరు ఒక్క రోజు చాలు ఒక పూట వచ్చినా చాలు అని రెడ్డి అన్నాడు... రెండు రోజులు ఆగు మూడవ రోజు మళ్ళి గుడి దగ్గరే మొదలు పెడదాం అని ఒకతాడు తీసి ఆదిరెడ్డి చేతికి కట్టాడు..

తర్వాత రోజు ప్రచారం రోజూ 9: 00కి మొదలు పెట్టాలి..
ఈయన ఏ టైంలో వస్తారో అన్న టెన్షన్ పటాపంచలు చేస్తూ ఉదయం  8:30 కి వచ్చి రాత్రి 8 గంటలు వరుకూ మూడు రోజులు పాటు ఘనంగా సాగింది..క్యాడర్ లో ఆ జోష్ వేరు.. అసలు అలసట లేదు మొహంలో.. మూడవ రోజూ వెలుతూ వెలుతూ డబ్బులు అనవసరంగా ఖర్చుచేయకు అని చెప్పాడు.  విజయోస్తు అని అందరికి చెప్పి అందరితో ఫోటోలు దిగి బాగా వచ్చాయా లేకపోతే మళ్ళి దిగుదాం అన్నాడు బాలయ్య.  ఆ మూడు రోజులు బాలయ్య స్టార్ అనే విషయం ఆయనకు మాకు కూడా గుర్తులేదు.. 

అసలు ఒక కార్పోరేటర్ కి మర్యాద పూర్వకంగా కలిసి మాటవరసకి అడగ్గానే మూడు రోజులు ప్రచారం చేయడం ఎంటి..? మా రెడ్డిగారు వారి భార్యతో నేను నెగ్గకు పోయినా బాదలేదు..బాలయ్య బాబు వచ్చారు అదే నాకు మేయర్ అయినంత సంతోషంగా అని కంటతడితో అనడం బాగా గుర్తు..  భక్తి ఎక్కువే... దేవుళ్ళపై అపార నమ్మకం.. పంచాంగం ముహూర్తం మీద మంచి గ్రిప్ ఉంది బాలయ్యకు.. వెండి తెరలా  బాలయ్యకు మంచి మనసుంది.. అది దగ్గరగా చూసిన వారికి ఆమనిషి విలువ తెలుస్తుంది.. ఆ మూడు రోజులు బాలయ్య చేత వయసులో చిన్న వాడినైనా రాజుగారు అని పిలిపించుకున్న జ్ణాపకం అస్సలు మరిచిపోలేను...

కాలేజీ రోజుల్లో ఆయనపై అందరి హీరో అభిమానులు ఆయన పట్ల దురభిమానం ప్రదర్శించేవారో.. ఒక  ఐదు-ఆరు  సంవత్సరాలు బాలయ్య మీద విషం చిమ్మడమే దగ్గరగా చూసాను (ఇప్పటికీ FB లో చూస్తుంట.).  దగ్గరగా ఆ మూడు రోజులు దగ్గరగా చూసి   భయట మాటలకి చూసిన దానికి చాలా తేడా ఉంది.. బాలయ్య బాబు కల్మషం లేనోడు. బోలా మనిషి.. కొన్ని విషయాలలో చిన్న పిల్లాడి మనస్తత్వం. ఉన్నది పైకి అనేసే వ్యక్తిత్వం. భయట నటించడం చేతకాని మనిషి.. 

బాలయ్య నీకు పుట్టీనరోజు శుభాకాంక్షలు..
నువ్వు చూడని ఐశ్వర్యం ఏముంది...
నువ్వు చేయని సినిమా ఏముంటుంది...
 నీ సహనటులలో  నీస్థాయి రౌద్రం పలికే వారు ఎవరు..? 
ఆ బేస్ తో  పలకగలిగే వారు ఎవరు..? భయట కూడా తెలుగుదనం ఉట్టిపడే ఆహార్యం రూపం ఎవరిది..?
వీటన్నింటికి సమాధానం నువ్వు కాక ఇంకెవరు...
నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

Happy birthday balayya..💐

Copied .fb post 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...