Undilaemanchikalam Posted July 22, 2022 Report Share Posted July 22, 2022 దేశాన్ని మోదీ–ఈడీ డబుల్ ఇంజన్ నడిపిస్తోందన్న విషయం స్పష్టమైందన్న కేటీఆర్ రైళ్లలో వయో వృద్ధులకు రాయితీలు ఎత్తివేయడంపైనా విమర్శ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలంటూ రైల్వే మంత్రికి విజ్ఞప్తి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ల పైనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుగుతాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కె.తారకరామారావు ఖండించారు. బీజేపీని, బండి సంజయ్ ను ఎద్దేవా చేస్తూ ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ కుమార్ ను ఈడీ చీఫ్ గా కూడా నియమించినందుకు కృతజ్ఞతలు. దేశాన్ని నడిపిస్తుందంటున్న డబుల్ ఇంజన్ ‘మోదీ–ఈడీ’ అన్నది దీనితో స్పష్టంగా అర్థం అవుతోంది” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ ను తన ట్వీట్ కు కేటీఆర్ జత చేశారు. ఇక వయోవృద్ధులకు రైళ్లలో రాయితీలు ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం కేటీఆర్ తప్పుపట్టారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మన విధి అని.. రైళ్లలో రాయితీ అంశాన్ని పున: సమీక్షించాలని రైల్వేశాఖ మంత్రిని కోరారు. Quote Link to comment Share on other sites More sharing options...
Tomb__ayya Posted July 22, 2022 Report Share Posted July 22, 2022 memes lo ED under cover "my hom Zoo Pallli" anta Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.