Telugumoviereviews Posted August 25, 2022 Report Share Posted August 25, 2022 విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఎప్పుడూ చూడనంత క్రేజ్, హైప్ వచ్చిన సినిమా 'లైగర్'. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమై, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో డబ్ అయిన ఈ మూవీని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. సీనియర్ హిందీ యాక్టర్ చంకీ పాండే కుమార్తె అనన్యా పాండే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని పూరి జగన్నాథ్, చార్మితో పాటు హిందీ అగ్ర దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించిన ఈ సినిమాపై రిలీజ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ హైప్, విజయ్ దేవరకొండ క్రేజ్ అంబరాన్ని చుంబించే స్థాయిలో పెరిగిపోయాయి. అయితే రిలీజ్‌కు ముందు #BoycottLiger అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి రావడం వార్తల్లో నిలిచింది. దానికి ప్రతిగా #ISupportLiger, #UnstoppableLiger అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను విజయ్ అభిమానులు ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన 'లైగర్' ఎలా ఉన్నాడయ్యా అంటే... కథ భర్త ఎంఎంఏ నేషనల్ ఛాంపియన్స్‌లో ఫైనల్స్‌లో ఓడడటమే కాకుండా, చనిపోవడంతో కొడుకును ఎలాగైనా ఆ స్పోర్ట్స్‌లో నేషనల్ ఛాంపియన్‌గా చూడాలనుకుంటుంది బాలామణి (రమ్యకృష్ణ). భర్తను లయన్‌గా, తనను టైగర్‌గా సంబోధించుకొనే ఆమె కొడుక్కి లైగర్ (విజయ్ దేవరకొండ) అనే పేరు పెట్టుకుంటుంది. కరీంనగర్ నుంచి ముంబైకి వచ్చి చాయ్ బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు ఆ తల్లీకొడుకులు. ఓ బాక్సింగ్ ట్రైనర్ (రోణిత్ రాయ్) దగ్గర కొడుకుని చేర్పిస్తుంది బాలామణి. అక్కడ తానియా (అనన్యా పాండే) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు లైగర్. ఆమె అన్న సంజూ (విష్) కూడా బాక్సరే. లైగర్, సంజూ ప్రత్యర్థులుగా మారతారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో నేషనల్ ఛాంపియన్ కావాలనే తల్లి కలను లైగర్ నెరవేర్చాడా? తల్లి అభిప్రాయానికి విరుద్ధంగా తానియాను ప్రేమించిన లైగర్ లవ్ స్టోరీ ఏ మలుపు తిరిగింది? అనే విషయాలకు సమాధానాలు తర్వాత కథలో తెలుస్తాయి. పూరి జగన్నాథ్ తీర్చిదిద్దిన 'లైగర్'ను ఇన్‌స్టంట్‌గానే కాదు, నెమ్మదిగా కూడా లైక్ చేయలేం. విజయ్ దేవరకొండ ఎంత బాగా చేసినా లైగర్ క్యారెక్టరైజేషన్‌లోని లోపాలు, అసలు అతని తండ్రి పాత్రను చూపించకపోవడం సినిమాకు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. ఇది మనం ఊహించిన పైసా వసూల్ సినిమా కాదు. విడుదలకు ముందు విజయ్ క్రేజ్‌ను, మార్కెట్ వాల్యూను ఎన్నో రెట్లు పెంచుతుందని నమ్మకం కలిగించి, తీరా విడుదలయ్యాక తుస్సుమనిపించిన సినిమా. Quote Link to comment Share on other sites More sharing options...
rako Posted August 25, 2022 Report Share Posted August 25, 2022 ee "konda" gaadu icchina buildup anta inta kaadu. Labbe gaadu, and vaadi attitude! time bokka money bokka. faltu movie. okkati, okkatante okka plus kanipinchala 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.